ramachndra reddy
-
పాతబస్తీలో కాషాయజెండా
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. బీజేపీ భారతీయుల పార్టీ, అన్ని వర్గాల వారిని గౌరవిస్తుంది. ముస్లిం మహిళల మేలు కోరే త్రిపుల్ తలాఖ్‌ను మోదీ రద్దు చేశారు. దేశం కోసమే 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. అధికారంలో ఉండే పార్టీకి తొత్తులా మారి అసదుద్దీన్ పబ్బం గడుపుకుంటున్నారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించి లబ్ధిపొందడం మజ్లిస్ పార్టీకే చెల్లింది. పాతబస్తీలో మజ్లిస్ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నందువల్లే ఆలె నరేంద్రను టైగర్‌గా, బద్దం బాల్‌రెడ్డిని గోల్కొండ సింహంగా ప్రజలు పిలుచుకున్నారు. మజ్లిస్ గూండాగిరి కారణంగానే నందరాజ్ గౌడ్, పాపన్నలు బలయ్యారు. – గోల్కొండlసభలో బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పాతబస్తీ నుంచి మజ్లిస్‌ను తరిమికొట్టి కాషాయ జెండాను ఎగరేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలన విముక్తే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’రెండో రోజైన ఆదివారం మెహిదీపట్నం, షేక్‌పేట్, గోల్కొండ కోట మీదుగా సాగింది. ఈ సందర్భంగా షేక్‌పేట్ నాలా వద్ద సభలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులను పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాతబస్తీలో ఉండే ప్రతి హిందువు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెట్రో, ఎంఎంటీఎస్ సేవలను పాతబస్తీకి విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామని, మొదటి సభను భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ అధినేతలకు నిద్రపట్టడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని అన్నారు. యాత్ర ఇన్చార్జ్ కోలార్ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.65 వేల కోట్ల అప్పులు ఉండేవని, ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని విమర్శించారు. పూల వర్షం కురిపిస్తూ... మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో శనివారం రాత్రి బస చేసిన సంజయ్ ఆదివారం ఉదయం యాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ.. బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల నుంచే కాకుండా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాదవ సంఘాలకు చెందిన కొందరు యువకులు దున్నపోతులను తెచ్చి వాటిపై సవారీ చేస్తూ యాత్రలో అందరి దృష్టిని ఆకర్షించారు. -
సిటీకి కొత్తందం!
►400 నగరంలో నెలకు జరిగే ప్లాస్టిక్ సర్జరీలు ►60% ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొనేవారిలో అబ్బాయిల సంఖ్య ►500 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 40 ఏళ్ల పైబడ్డవారు ►3500 ఏడాదిలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 30 ఏళ్లలోపు యువకుల సంఖ్య అందమనేది తాత్కాలికం కాకూడదు.. అది శాశ్వతంగా మనకే సొంతం కావాలి. ఇన్నాళ్లూ ఇలా ఉండిపోవచ్చు, కానీ ఇకపై మనల్ని చూస్తే కళ్లు తిప్పుకోకూడదు.. అందరి దృష్టినీ ఆకర్షించాలి. బ్యూటీపార్లర్లలో ఫేషియల్సూ, మేకప్ ఆర్టిస్టుల క్రియేటివిటీ తాత్కాలికం.. అందం మనవద్ద లేదనేది గతం. అలా ఉండకూడదనుకుంటే ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదిద్దాం.. యవ్వనం మరింతకాలం పదిలంగా ఉండాలంటే వేరే మార్గం లేదు.. ఇదీ నగర యువత ఆలోచన. కళ్లూ, ముక్కూ, పొట్ట, హెయిర్స్టైలూ ఇవన్నీ సహజత్వంలో కాస్త బాగాలేకపోవచ్చు. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు కదా అంటున్నారు కొత్తతరం యువత. అందంగా ఉన్నామంటే దాన్నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం కూడా బోల్డెంత ఉంటుందనేది ఆలోచన. చప్పిడిముక్కు, బాల్డ్‌హెడ్, నడుముల కింద టైర్లు, బట్టతల వంటి మాటలకు కొత్త అర్థాలు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో అందంగా ఉండాలన్న స్పృహ బాగా పెరిగిందని, ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారిలో 80 శాతం మంది పెళ్లికి ముందు వస్తున్నవారేనని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా.వెంకటరమణ అంటున్నారు. ముప్ఫై ఏళ్ల వయసు లోపే.. ►ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీరాకృతిని మార్చుకోవాలని కోరుకుంటున్న వారిలో 80 శాతం మంది 30 ఏళ్ల లోపువారే. వారిలోనే ఎక్కువ మంది పెళ్లికి ముందు వస్తున్న వారే. ►ఆకృతిని మార్చుకునే వారిలో ముక్కు (రినోప్లాస్టీ), నడుముల కింద ముడతలు, లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ ఎక్కువ. ►ఈ మధ్య కొవ్వులు తొలగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ►శరీరాకృతి ముఖ్యంగా నడుముకింద ముడతలు తొలగించుకోవాలని అనుకుంటున్న వారిలో అబ్బాయిలు ఎక్కువ. ►ముక్కు సరిచేసుకునే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. దీన్నే షేప్ కరక్షన్ అంటారు. ►మొటిమలు పోయాక ఏర్పడ్డ మచ్చలు తొలగించుకున్న వారి సంఖ్య పెళ్లికి ముందు వస్తున్న వారిలో ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు లేకపోతే ఎలా ► సాధారణంగా ఏదైనా జబ్బుకు శస్త్రచికిత్స జరిగితే భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్లుకూడా తీసుకోవాల్సి ఉంది. ► ఉదాహరణకు నడుముకింద ముడతలు తొలగించుకునేందుకు కొవ్వులు తీస్తాం. ఆ తర్వాత మళ్లీ రాకుండా చూసుకునేందుకు జీవనశైలి మార్చుకోవాలి. లేదంటే మళ్లీ కొవ్వులు ఏర్పడితే దానికి అర్థమేముంటుంది? ► నాణ్యమైన ఉపకరణాలు, శస్త్రచికిత్సల విధానాలు వచ్చాక చాలా వరకూ ఇలాంటి ►సర్జరీలు సక్సెస్ అవుతున్నాయి. అది కూడా డాక్టర్ని బట్టి ఉంటుంది. ►చాలామందిలో ఇలాంటివి చేయించుకున్నాక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ► శరీరాకృతిని కాపాడుకోవడానికి వ్యాయామం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ప్రెజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి