కొత్త చికిత్స విధానాన్ని అమలు చేయండి
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి చికిత్స కోసం రోగికి వారానికి మూడు సార్లు మందులు ఇచ్చే విధానాన్ని కాకుండా రోజూ మందులు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘వాడే మందులు ఒకటే అయినప్పుడు రోజూ ఎందుకివ్వకూడదు?’ అని ప్రశ్నించింది.
మందును రోజూ ఇవ్వాలంటూ ఈ వ్యాధి నిపుణుడైన డాక్టర్ రమణ్ కక్కర్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈమేరకు పేర్కొంది. ప్రస్తుత విధానం అశాస్త్రీయమని, ఖర్చు తగ్గించుకోవడానికి తక్కువ మోతాదు మందులిస్తున్నారని కక్కర్ ఆరోపించారు.