ramana murthy
-
కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం బాసట
కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా 2016లో కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కాపు ఉద్యమకారుడు చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి కేంద్రంగా కాపు ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో తునిలో రైలు దహనం ఘటన మరునాడు వెంకట రమణమూర్తి కలెక్టరేట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కాపులను ఇబ్బంది పెడుతోందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకట రమణమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లారీ డీజిల్ మెకానిక్‌గా పనిచేసే అతడి ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సహాయ నిధి నుంచి చీకట్ల పార్వతి పేరిట రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదివారం వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రాజేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వెంకట రమణమూర్తి కుటుంబ పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి రూ.5 లక్షల ఆరి్థక సహాయం పంపించి ఆదుకున్నారని చెప్పారు. వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి కాకినాడ 3వ డివిజన్లో వలంటీర్‌గా పని చేస్తోందన్నారు. -
సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం
దారంతా కష్టాలు కనిపించాయి. చెమట్లు చిందించాడు. అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. అంతులేని పట్టుదల ప్రదర్శించాడు. పేదరికం పెద్ద అడ్డుగోడలా నిలిచింది. ప్రతిభను నమ్ముకుని ముందుకు కదిలాడు. ఆ కష్టాలు ఇప్పుడతనికి అనుభవాలయ్యాయి. అవరోధాలు మైలురాళ్లుగా మారాయి. పేదరికం తన గమ్యాన్ని గుర్తు చేసే సాధనమైంది. సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణమై కనిపిస్తున్న రమణమూర్తి క్రీడా ప్రయాణం ఆసాంతం ఆదర్శ ప్రాయం. ఇప్పటికే జాతీయ పోటీలకు రిఫరీగా ఎంపికైన ఈ డిగ్రీ కుర్రాడు జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. శ్రీకాకుళం న్యూకాలనీ: కఠోర శ్రమ, సాధన, పట్టుదలకు ప్రతిభ తోడయితే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాడు అంపోలు రమణమూర్తి. సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ స్థాయి లో నిర్వహించే పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా కూడా అర్హత సాధించడం విశేషం. ఆమదాలవలస మండల పరిధిలోని కొత్తవలస గ్రామానికి అంపోలు రమణమూర్తి తల్లిదండ్రులు సత్యనారాయణ, కృష్ణవేణి. రమణమూర్తికి అక్క రాజేశ్వరి కూడా ఉంది. రమణమూర్తి తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలే. 2010–11లో జెడ్పీహెచ్ స్కూల్ తొగరాం(ఆమదాలవలస మండలం)లో 6వ తరగతి చదువుతున్న సమయంలో రమణమూర్తిలో ఉన్న ప్రతిభను అక్కడి ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ముఖ్య ప్రతినిధి మొజ్జాడ వెంకటరమణ గుర్తించారు. అలాగే పీడీ ఎంవీ రమణ అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన రమణమూర్తి రాష్ట్రపోటీలకు ఎంపికయ్యాడు. స్లగ్గింగ్తోపాటు ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో మాచర్లలో తాను ప్రాతినిధ్యం వహించిన తొలి రాష్ట్ర పోటీలోనే సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. పాల్గొనే ప్రతి మీట్లోను సత్తాచాటుకున్నాడు. త్రోబాల్ లో కూడా ప్రవేశం ఉన్న రమణమూర్తి జాతీయ పోటీల్లో రాణించాడు. అనతి కాలంలోనే జాతీయస్థాయిలో మెరుపులు మెరిపించాడు. సౌత్‌జోన్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, ఫెడరేషన్ కప్‌లో రజత పతకం సాధించాడు. ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన రమణమూర్తి ప్రస్తుతం డిగ్రీ బీఎస్సీ సీబీజెడ్ ఫైనలియర్ చదువుతున్నాడు. 2020 రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తమ క్రీడాకారుడిగా నాటి కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత.. ఒకవైపు ఆటతోపాటు మరోవైపు కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత సాధించిన రమణమూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2020లో జాతీయ పోటీలకు టెక్నికల్ అఫీషియల్స్‌గా/రిఫరీగా వ్యవహరించే రిఫరీ టెస్టులో అర్హత సాధించాడు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్లేట్ అంపైర్‌గా, టెక్నికల్ అఫీషియల్స్‌గా కూడా వ్యవహరించి మెప్పించాడు. అలాగే 2021–22లో ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి కోచ్‌గా కూడా అర్హత సాధించాడు. రమణమూర్తి సాధించిన విజయాలు.. ► 2016–17లో మహారాష్ట్రలో జరిగిన ఆలిండియా స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ► 2016–17లో వైఎస్సార్ కడపలోని పుల్లంపేటలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలవ డంలో కీలక భూమిక పోషించాడు. ► 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఫెడరేషన్ కప్ సీనియ ర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించాడు. ఈ పోటీల్లో ఏపీ రన్నరప్ గా నిలిచింది. ► 2020లో ఆలిండి యా సౌత్‌జోన్ సీనియ ర్స్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ పోటీ ల్లో ఏపీ విజేతగా నిలిచింది. ► 2022 మార్చిలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఆలిండియా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో బీఆర్‌ఏయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీ ల్లో బీఆర్‌ఏయూ సెమీస్‌లో ఓటమిపాలైంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మనాన్న కూలికి వెళ్తే తప్ప జరగని పరిస్థితి. నేను జాతీయస్థాయి క్రీడాకారునిగా గుర్తింపు పొందాను. ఎన్ఐఎస్ పూర్తి చేసి కోచ్‌గాను, రిఫరీ టెస్టులో క్వాలిఫై అయి టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యాను. నా ప్రతి విజయంలోను నా గురువు ఎంవీ రమణ సర్ ప్రోత్సాహం ఉంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాను. – అంపోలు రమణమూర్తి, సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి క్రీడాకారుడు నిరంతరం కష్టపడతాడు అంపోలు రమణమూర్తి పాఠశాల స్థాయి నుంచి కష్టపడే మనస్తతత్వాన్ని అలవర్చుకున్నాడు. ఉత్తమ లక్షణాలు, నడవడిక కలిగిన రమణమూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆనాడే గుర్తించాను. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం తరఫున బాసటగా నిలిచాం. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు. – ఎంవీ రమణ, ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధి -
బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?
సాగర్‌కు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. పరిమితి కూడా ఎక్కువ. దేనికైనా వీటినే వాడుతూ ఉంటాడు. క్రెడిట్ స్కోరుకు ఢోకా లేకుండా బిల్లు కరెక్టుగా చెల్లిస్తుంటాడు. కానీ ఈ మధ్య ఓ లోన్కోసం వెళితే... తన క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందన్నారు. రిపోర్టు చూసి అదిరిపడ్డాడు సాగర్. ఎందుకంటే తన పేరిట 5 క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో కొన్నింటికి బకాయిలున్నాయి. మరికొన్నిటి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దానివల్లే క్రెడిట్ స్కోరు తగ్గింది. బ్యాంకుకు వెళ్లి ఇదేంటని అడిగిన సాగర్‌కి... విషయం తెలిసి మతి పోయినంతపనైంది. ఇంతకీ ఏంటది? సాధారణంగా షాపింగ్‌కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. వాటిలో కొన్నింటి గడువు తేదీ వారం రోజులే!. మరికొన్నింటికి 10 రోజులు– 15 రోజులు ఇలా బిల్లింగ్ సైకిల్స్ ఉన్నాయి. అంత తక్కువ వ్యవధి కావటంతో వాటిని తిరిగి చెల్లించటంలో కిరణ్ అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇవిగో... ఇవే సిబిల్ రిపోర్టులో కొంప ముంచాయి. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్ వేరువేరు కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని... వ్యాపారాన్ని పెంచుకోవటానికి కొన్ని. కారణమేదైనా ఇపుడు చాలా కంపెనీలు పోస్ట్‌పెయిడ్ మొదలెట్టేశాయి. అంటే... ‘ఇప్పుడు కొను–తరువాత చెల్లించు’ (బీఎన్‌పీఎల్) అన్నమాట. షాపింగ్ యాప్‌లతో పాటు సర్వీసులందించే యాప్‌లు కూడా వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’నే తీసుకుంటే... క్యాబ్ బుక్ చేసిన వెంటనే చెల్లించాల్సిన పనిలేదు. కొంత మొత్తం పరిమితికి లోబడి... ఓలా పోస్ట్ పెయిడ్ సేవలందిస్తోంది. ఆ మొత్తం వరకూ సర్వీసులు వాడుకోవచ్చు. ఈలోపు బిల్లింగ్ తేదీ వస్తే బిల్లు అందుతుంది. చెల్లిస్తే సరి. మరిచిపోతే కాస్త జరిమానాలూ ఉంటాయి. ఓలాతో పాటు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి కూడా కొంత పరిమితి వరకూ ‘పే లేటర్’ సేవలందిస్తున్నాయి. ఇదంతా పోస్ట్‌పెయిడ్ వ్యవహారం. లోన్‌యాప్స్ కూడా ఇంచుమించుగా... మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్లానే ఆన్లైన్ లోన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డులు లేకున్నా, వాలెట్లలో డబ్బులు లేకున్నా సరే... ఈ యాప్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా పే చేసేయొచ్చు. లేజీ పే, సింపుల్, బుల్లెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, ఫ్రీచార్చ్ పే లేటర్, మొబిక్విక్ జిప్ పేలేటర్, పే లేటర్ బై ఐసీఐసీఐ... ఇవన్నీ అలాంటివే. ఆన్లైన్లో కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీసుకో దీనిద్వారా తక్షణం చెల్లించేయొచ్చు. బిల్లులు కూడా. వీటన్నిటినీ కూడా క్రెడిట్కార్డుల్లానే భావించాల్సి ఉంటుంది. అందించేవన్నీ ఆర్థిక సేవల కంపెనీలే కాబట్టి... సిబిల్ జాబితాలో వీటిని కూడా క్రెడిట్ కార్డుల్లానే చూడాల్సి వస్తుంది. చిన్నచిన్న పేమెంట్లే కనక వీటి చెల్లింపు గడువు కూడా తక్కువే. జరిమానాలూ ఎక్కువే. ఉదాహరణకు 100 రూపాయల బిల్లు గనక చెల్లించకపోతే... మరో 100 ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు కనీస ఫైన్ మొత్తాన్ని ఈ రకంగా నిర్ధారిస్తున్నాయి. శాతంలోనైతే ఇది 100. చాలామందికి రూ.100 అనేది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే వీటిని విస్మరిస్తే సిబిల్ రిపోర్టులో స్కోరుపై మాత్రం ప్రభావం చూపిస్తాయని మరిచిపోకూడదు. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్‌కు తేడా ఏంటి? పోస్ట్‌పెయిడ్‌లో సదరు సంస్థ తమ దగ్గర కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీ సుకో దీన్ని అందిస్తుంది. కానీ లోన్‌యాప్స్ అయితే ఏ కంపెనీలో కొన్న వస్తువుకైనా, ఎక్కడ తీసుకున్న సర్వీసుకైనా వీటి నుంచి చెల్లింపులు చేయొ చ్చు. నిజానికిప్పుడు లేజీ పే వంటి చాలా లోన్‌యాప్స్ అస్సలు వడ్డీలు వసూలు చేయటం లేదు. మరి వాటి మనుగడ ఎలా? అనే సందేహం సహజం. ప్రస్తుతానికైతే ఆలస్య రుసుములే వీటికి ప్రధాన ఆదాయ వనరు. పైపెచ్చు ఇవన్నీ యూజర్ బేస్‌ను (కస్టమర్ల సంఖ్య) పెంచుకోవటంపైనే దృష్టిపెడుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే పెట్టుబడులొస్తాయి. ఏదో ఒక దశలో ఆ పెట్టుబడులపై లాభాన్ని అందించాల్సిన బాధ్యత ప్రమోటర్‌కు ఉంటుంది. కాబట్టి మున్ముందు ఇవన్నీ వడ్డీల రూపంలోనో... నెలవారీ ఫీజుల రూపంలోనో యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయక తప్పదు కూడా. ఇంతకీ వీటిని వాడొచ్చా? క్రెడిట్ కార్డుల్ని సైతం ఎడాపెడా వాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవన్నది చాలామందికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. అలాంటిది అందుబాటులో ఉన్నాయి కదా అని ఎడాపెడా లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే?. వీటి బిల్లింగ్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అప్డేటెడ్గా ఉండటం అంత తేలికేమీ కాదు. బిల్లుకు సంబంధించిన మెసేజ్ వచ్చాక... ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా మరిచిపోయి ఫైన్ పడే ప్రమాదం ఎక్కువ. అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. సిబిల్ రిపోర్టులో సైతం మీరు ఉపయోగించిన ఒక్కో లోన్ యాప్ ఒక్కో క్రెడిట్లైన్ మాదిరి కనిపిస్తుంది. వాటిలో జరిమానాలు, ఆలస్యపు చెల్లింపులు ఉంటే స్కోరు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరో ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని యాప్‌లు తమ బకాయిల వసూలుకు రకరకాల అనైతిక మార్గాలు కూడా అనుసరిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ ఫోన్లు చేయటం... భయపెట్టడం... వారి దగ్గర ఈ వ్యక్తిని అవమానించటం వంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. -మంథా రమణమూర్తి -
‘వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిఒక్కరు స్వాగతించాలని సీనియర్ జర్నలిస్టురమణమూర్తి ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. పరిపాలన రాజధాని ఏర్పాటును బలపరచడంతో పాటు త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని విశాఖ ఆంధ్రయూనివర్శిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రొఫెసర్లు డాక్టరు ప్రేమానందం, డాక్టర్ సరున్ రాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి. కాంతరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రమణమూర్తి మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో విశాఖకు, ఉత్తరాంధ్రకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. కాగా అమరావతి రైతులు చేసిన త్యాగమేమిటో ప్రజలకి చెప్పాలన్నారు. భూములతో వ్యాపారం చేసి త్యాగాలు చేశామనడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి వేలాది మంది భూములిచ్చి త్యాగాలు చేశారని, ఉత్తరాంధ్రకు మేలు జరుగే పరిపాలన రాజధాని నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. విశాఖ రాజధానిగా మారితే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన వివరించారు. ఇక ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులుగా మనమంతా మద్దతు పలకాలన్నారు. అధికార వికేంధ్రీకరణ ద్వారనే రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వర్గానికి మేలు చేయడం కోసమే అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సరున్ రాజు మాట్లాడుతూ: విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించాలన్నారు. విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకునేవాళ్లంతా చరిత్రహీనులగా మిగిలిపోతారన్నారు. వెనుకుబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఒక వరం లాంటిదని, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని ఆయన తెలిపారు. -
ముంచింది 16 వేల కోట్లు
రమణమూర్తి మంథా వజ్రాల వ్యాపారి నీరవ్ దీపక్ మోదీ దెబ్బతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నష్టపోయినదెంత? హామీ లేకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ జారీ చేసిన రూ.11,400 కోట్లు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్‌ల వరకేనా? మరి ఇతర కంపెనీల పేరిట పలు బ్యాంకుల నుంచి ఆయన చేసిన అప్పుల మాటేంటి? ఆయన వ్యాపారాలపై దాడులు జరగడం, మోదీ పారిపోయి అమెరికాలో తలదాచుకున్న నేపథ్యంలో ఇకపై రుణాల చెల్లింపులు జరుగుతాయా? పీఎన్బీ ఇన్వెస్టర్ సర్వీసెస్‌తో సహా పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.4,416 కోట్ల అప్పుల మాటేంటి? ఇందులో తీర్చాల్సి ఉన్న వేల కోట్లు బ్యాంకులకు గుదిబండే కదా!! అంటే ఇప్పుడు నీరవ్ కొట్టిన దెబ్బ విలువ రూ.16 వేల కోట్లను కోవాలా? అసలు మన బ్యాంకుల్లో గడిచిన ఐదేళ్లలో నీరవ్ లాంటి ఫ్రాడ్ కేసుల విలువ రూ.64 వేల కోట్లంటే నమ్మగలమా? ఇవన్నీ తట్టుకుని అసలు మన బ్యాంకులు నిలబడతాయా? ఎందరు మోసం చేసినా.. తమకు మూలధనం రూపంలో కేంద్రం డబ్బు లిస్తోంది కదా అనే ధీమాతోనే బ్యాంకులు ఇదంతా చేస్తున్నాయా? ఆ డబ్బంతా ఎవరిది? నిజాయితీగా పన్నులు కట్టేవారిదే కదా!! విదేశాల నుంచి వజ్రాల్ని దిగుమతి చేసుకోవటానికి మోసపూరిత మార్గాల ద్వారా పీఎన్బీ నుంచి నీరవ్ మోదీ పొందిన లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ల విలువ రూ.11,400 కోట్లు. వాటి ద్వారా దిగుమతులు చేసుకోవటమే కాదు!! దేశీయంగా కూడా రకరకాల కంపెనీల పేర్లతో వివిధ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.4,416 కోట్ల మేర అప్పులు కూడా తీసుకున్నారు. వీటిలో చెల్లించింది చాలా తక్కువ. విశేషమేంటంటే ఈ రుణాలిచ్చిన బ్యాంకుల్లో కూడా పీఎన్‌బీదే అగ్రస్థానం. ఢిల్లీలోని పీఎన్బీ శాఖ రూ.3,326 కోట్ల రుణమివ్వగా... ముంబై బ్రాంచీ మరో రూ.514 కోట్ల అప్పు మంజూరు చేసింది. ఇదికాక ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.392 కోట్లు... సూరత్‌లోని రత్నాకర్ బ్యాంక్ నుంచి రూ.184 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఇప్పుడు మోదీ పారిపోవటం, ఆయన ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తుండటంతో ఆ రుణాల చెల్లింపు కూడా ప్రశ్నార్థకమైంది. సన్నిహితులతో కలిసి... నీరవ్ మోదీ తన సన్నిహితులు హేమంత్ దహ్యాలాల్ భట్, రమేశ్ మాధవ్‌దాస్ అసర్, కేతన్ చంద్రకాంత్ సోలంకి, పరేశ్ ప్రవీణ్భాయ్ రాథోడ్, భవీక్ హష్ముక్లాల్ దేశాయ్‌తో కలిసి పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, రాధాషిర్ జ్యుయలరీ కంపెనీ, ఫైర్‌స్టోన్ ట్రేడింగ్, ఏఎన్ఎం ఎంటర్ప్రైజెస్ తదితర పేర్లతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీలన్నీ... పీఎన్బీ నుంచి తీసుకున్న భారీ రుణాల్లో భాగస్వాములే కావటం గమనార్హం. అంతేకాదు తన భార్య అమీ పేరిట కూడా అమీ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన నీరవ్... అందులో తన కుటుంబ సభ్యుల్ని డైరెక్టర్లుగా చేర్చారు. దాదాపు ప్రతి కంపెనీ విడివిడిగా కూడా భారీగా రుణాలు తీసుకోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. స్వాధీనం చేసుకున్న ఆస్తులెంత? నీరవ్ మోదీ వ్యవహారాన్ని పీఎన్బీ అధికారికంగా బయటపెట్టి.. స్టాక్ మార్కెట్లో దాని పతనం మొదలైన కొన్ని గంటల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన ఆస్తులపై సోదాలు మొదలుపెట్టింది. తొలిరోజే రూ.5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించింది. కాకపోతే.. వాటిని స్వతంత్రంగా విలువ కట్టే పని జరుగుతున్నట్లు కూడా పేర్కొంది. శుక్రవారం ఇంకో ట్వీట్లో మరో రూ.550 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అంటే.. రూ.11,400 కోట్ల విలువైన కుంభకోణంలో సగానికి పైగా స్వాధీనం చేసుకున్నట్టేనా!!? దీనిపై ట్వీటర్ వేదికగా పలు సందేహాలు వెల్లువెత్తాయి. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లు మించదని, ఈడీ కావాలనే వ్యవహారాన్ని తేలిక చేయటానికలా చెబుతోందని సీనియర్ జర్నలిస్టు సుచేతా దలాల్ సహా పలువురు విమర్శలు చేశారు. ఇంత త్వరగా వజ్రాల విలువను లెక్కించటం ఎలా సాధ్యమైందని, అసలు లెక్కించటం పూర్తికాకుండా ఎలా ప్రకటించారన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. మోసాల సామ్రాజ్యం ఇంతింత కాదు నీరవ్ మోదీ మోసం రూ.11,400 కోట్లే! కానీ గడిచిన ఐదేళ్లలో ఘరానా మోసగాళ్లు ఏకంగా రూ.61 వేల కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేశారు. ఈ విషయాన్ని స్వయంగా బ్యాంకులే ఆర్బీఐకి నివేదించాయని, ఇది సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైందని ‘బ్లూమ్‌బర్గ్’వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 8,670 కేసుల్లో ఈ మేరకు మోసం జరిగినట్లు తెలియజేసింది. మరోవంక బ్యాంకుల మొండి బకాయిలు సైతం రూ.9 లక్షల కోట్లను దాటేసిన సంగతి తెలిసిందే. చిత్రమేంటంటే బ్యాంకుల మూలధనం ఇలా మోసాలు... మొండి బకాయిల రూపంలో హరించుకుపోతుండటంతో సాధారణ రుణాలివ్వటానికి వాటికి నిధుల కొరత ఏర్పడుతోంది. ఆ కొరతను తీర్చటానికి ప్రభుత్వం తాజాగా రూ.2.1 లక్షల కోట్లను మూలధనం రూపంలో ఇస్తామని ప్రకటించి.. ఆ మేరకు అందజేస్తోంది కూడా. పీఎన్బీకి తాజా త్రైమాసికంలో కేంద్రం రూ.12 వేల కోట్ల మేర మూలధనాన్ని అందజేసింది. కాకపోతే నీరవ్ మోదీ ఒక్కడే ఆ మొత్తాన్ని కాజేశాడు!! అదే తమాషా. ఏదైనా ప్రభుత్వ బ్యాంకేగా!! నీరవ్ మోదీ పలు బ్యాంకుల నుంచి రుణాలే కాక.. పీఎన్బీ నుంచి రూ.11,400 కోట్ల మేర లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్‌లను పొందాడు. ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం... 1. ఇవి కూడా బ్యాంకు గ్యారంటీల్లాంటివే. మనకు బ్యాంకులో ఉండే డిపాజిట్లు చూసో, ఆస్తుల్ని హామీగా పెట్టుకునో బ్యాంకులు ఈ గ్యారంటీలు మంజూరు చేస్తాయి కదా!! ఎల్ఓయూలూ అలాంటివే. కాకపోతే నీరవ్‌కు ఎలాంటి హామీ లేకుండా ముంబైలోని ఓ పీఎన్బీ శాఖ వీటిని మంజూరు చేసేసింది. 2. ఈ ఎల్ఓయూలను విదేశాల నుంచి వజ్రాలు దిగుమతి చేసుకోవటానికి వాడుకున్నాడు నీరవ్ మోదీ. వాటిని విదేశాల్లోని భారతీయల బ్యాంకులకిచ్చాడు. అవి పీఎన్బీ జారీ చేసినవి కావటంతో వాటికి చెల్లింపులు చేయాల్సింది పీఎన్‌బీయే. దీంతో బ్యాంకులు అక్కడి ఎగుమతి దారులకు డబ్బులు చెల్లించేశాయి. 3. ఆ బ్యాంకులు తిరిగి తమ డబ్బులివ్వాలని పీఎన్బీని అడగటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పీఎన్బీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 4. పీఎన్బీకి మోదీ ఎలాంటి చెల్లింపులూ చేయలేదు కనక మునిగిపోయింది పీఎన్‌బీయే. అది మొత్తం రూ.11,400 కోట్లను ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. నిజానికి పీఎన్బీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30 వేల కోట్లు. అంటే తన మొత్తం విలువలో మూడో వంతును అది మోసపోయిందన్న మాట!! -
మనం సైతం
ఆపదలో ఉన్నవారి సహాయార్ధం కోసం చూస్తున్న ఆపన్నులను ఆదుకుంటు పెద్ద చారిటిగా ఎదుగుతున్న సంస్థ మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా మనం సైతం వివిధ కారణాలతో ఇబ్బందుల్లో ఉన్న రమణ మూర్తి, డ్రైవర్ రాజు, మేకప్ రాజశేఖర్, లైట్‌మెన్ బాబు తదితర పది మందికి సంతోష్ కుమార్, అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, జెమినీ కిరణ్ చేతుల మీదుగా చెక్‌ను అందజేశారు. ‘‘ అముగ్గురు నలుగురితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల మందికి చేరువ అవుతుంది. సభ్యులమే పాతిక మంది వరకున ఉన్నాం. దర్శకులు కొర టాల శివ, చిరంజీవి మా వెంట నడుస్తాం అని ముందుకు వచ్చారు’’ అని కదంబరి కిరణ్ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ –‘‘ మా సభ్యులకు డబ్బు లేకున్నా మంచి మనసు ఉంది. మనంసైతంలో ప్రతి సభ్యుడు గొప్పవాడే. నా ఆస్తిలో కొంత వాటా ఈ సంస్థకు ఇవ్వాలి అనుకుంటున్నా’’ అన్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘‘మాటలు చెప్పటం నాకు చేత కాదు, చేయాలనుకున్నది చేతల్లోనే చేస్తుంటాను. నా వంతుగా రెండు లక్షల సాయం ప్రకటిస్తున్నాను. సంస్థకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని అన్నారు. -
పదేళ్లుగా ప్రభుత్వ శాఖతో పోరాటం!
-
'నిబంధనల పేరుతో నిధులు ఆపేస్తున్నారు'
విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంలో రోజుకోరకంగా మార్పులు తీసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రతినిధి రమణమూర్తి ఆరోపించారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆశా సర్వసభ్య సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ప్రనిధిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ... నిబంధనల పేరుతో ఆసుపత్రులకు నిధులు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలుగా అనిపిస్తున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఎన్ని సార్లు అడిగినా పాత, కొత్త ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లో ఓపీ సేవలు అందించడం సాధ్యం కాదని రమణమూర్తి స్పష్టం చేశారు. మా సమస్యలపై ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశంలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని రమణమూర్తి తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
=రూ. లక్ష తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు =అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు నర్సీపట్నం, న్యూస్‌లైన్: ఏసీబీ వలకు భారీ తిమింగలం చిక్కింది. మద్యం దుకాణం యాజమాని నుంచి ఎక్సైజ్ సీఐ ఖలీమ్ రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఆశాఖ అధికారులు శుక్రవారం దాడిచేసి పట్టుకున్నా రు. వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం చీడిగుమ్మలలో విజయ, పెదబొడ్డేపల్లిలో క్వాలిటీ వైన్ షాపుల నిర్వాహకుడు అయ్యపురెడ్డి రమణ అలియాస్ బాబ్జీ ప్రతి నెలా ఎక్సైజ్ అధికారులకు ఇచ్చే మామూళ్లను నిలిపేశాడు. ఈమేరకు ఎక్సైజ్ సీఐ పలుమార్లు అతని పై ఒత్తిడి చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన సీఐ తరచూ షాపుల వద్దకు వెళ్లి గుమస్తాలను బెదిరించేవారు. దీంతో షాపుల యాజమాని కాళ్ల బేరానికి వచ్చా రు. సీఐ రూ. రెండు లక్షలు డిమాండ్ చే శారు. ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖలో ఉంటానని, 22న నర్సీపట్నం వచ్చేసరికి మొ త్తాన్ని చెల్లించాలని షరతు విధించారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని షాపు యాజమాని చెప్పడంతో చివరకు రూ. లక్షకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు షాపు యాజ మాని రమణ ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో సీఐకి రూ. లక్ష ఇస్తుండగా డీఎస్పీ నర్సింహరావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రమణమూర్తి, గణేష్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహరావు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసే వారి వివరాలు తెలియజేస్తే దాడి చేసి పట్టుకుంటామన్నారు. వారి వివరాలు గోప్యం గా ఉంచుతామని, ప్రజలు స్వ చ్ఛందంగా సహకరించాలని కోరారు. సీఐ ఖలీమ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. భారీ ఆక్రమార్జన : రెండేళ్ల క్రితం ఇక్కడ ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఖలీమ్ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వైన్ షాపుల సిండికేట్ల నుంచి భారీగా నెలవారీ మామూళ్లు తీసుకుంటారని,గంజాయి రవాణా దారుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మామూళ్లు తీసుకుని సెటిల్మెంట్కు పాల్పడుతున్నట్టు వాదనలు ఉన్నా యి. రెండు రోజులకోసారి విశాఖ నుంచి వచ్చే ఈయన కేవలం మామూళ్ల వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తారని ఇక్కడ చెప్పుకుంటున్నారు. -
ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ ఏడీ అరెస్ట్
విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతి పట్ల అటవీశాఖ (ఫారెస్ట్) ఏడి రమణమూర్తి శనివారం అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో యువతితోపాటు తోటి ప్రయాణీకులు సామర్లకోటలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రమణమూర్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.