విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఓ యువతి పట్ల అటవీశాఖ ఏడి రమణమూర్తి శనివారం అసభ్యంగా ప్రవర్తించారు.
విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఓ యువతి పట్ల అటవీశాఖ (ఫారెస్ట్) ఏడి రమణమూర్తి శనివారం అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో యువతితోపాటు తోటి ప్రయాణీకులు సామర్లకోటలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రమణమూర్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.