
ఆపదలో ఉన్నవారి సహాయార్ధం కోసం చూస్తున్న ఆపన్నులను ఆదుకుంటు పెద్ద చారిటిగా ఎదుగుతున్న సంస్థ మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా మనం సైతం వివిధ కారణాలతో ఇబ్బందుల్లో ఉన్న రమణ మూర్తి, డ్రైవర్ రాజు, మేకప్ రాజశేఖర్, లైట్‌మెన్ బాబు తదితర పది మందికి సంతోష్ కుమార్, అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, జెమినీ కిరణ్ చేతుల మీదుగా చెక్‌ను అందజేశారు. ‘‘ అముగ్గురు నలుగురితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల మందికి చేరువ అవుతుంది.
సభ్యులమే పాతిక మంది వరకున ఉన్నాం. దర్శకులు కొర టాల శివ, చిరంజీవి మా వెంట నడుస్తాం అని ముందుకు వచ్చారు’’ అని కదంబరి కిరణ్ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ –‘‘ మా సభ్యులకు డబ్బు లేకున్నా మంచి మనసు ఉంది. మనంసైతంలో ప్రతి సభ్యుడు గొప్పవాడే. నా ఆస్తిలో కొంత వాటా ఈ సంస్థకు ఇవ్వాలి అనుకుంటున్నా’’ అన్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘‘మాటలు చెప్పటం నాకు చేత కాదు, చేయాలనుకున్నది చేతల్లోనే చేస్తుంటాను. నా వంతుగా రెండు లక్షల సాయం ప్రకటిస్తున్నాను. సంస్థకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment