ramasethu
-
రామసేతు రహస్యాలు పార్ట్2 : తేలియాడే రామసేతు రాళ్ల రహస్యాలు
రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల విషయంలోనూ చాలా వాదనలున్నాయి. అసలవి నిజమైన రాళ్లేనా లేక వృక్షాలను ఒక క్రమ పద్ధతిలో రాళ్లుగా చేసి వంతెన నిర్మాణంలో ఉపయోగించారా అనే అనుమాలున్నాయి. ఈ సందేహాలకు సరైన కారణాలే ఉన్నాయి. వారధి నిర్మాణానికి చెందినవిగా పేర్కొంటున్న రాళ్లు కొన్ని ఇప్పటికీ రామేశ్వరంలో ఉన్నాయి. ఐతే అవి నీటిలో తేలుతూ ఉండడం గమనార్హం. అంటే రామవారధి నిర్మాణంలో నీటిపై తేలియాడే రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నీటిపై తేలియాడే రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.? ఆ రాళ్లు ఎలాంటి పదార్థంతో తయారయ్యాయి. ?వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఓ వాదన ప్రకారం ఆ రాళ్లు అగ్నిశిలకు చెందిన రాళ్లు. అగ్నిపర్వతం పేలిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశిల రాళ్లు. ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఐతే తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు. దాంతో రామ సేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ప్యూమిక్ స్టోన్స్‌అనే వాదన తప్పు అని తేలి పోయింది. మరో వాదన ఏంటంటే వారధికి చెందిన రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవి. ఐతే ఈ వాదనలో కూడా పస లేదని బయటపడింది. ఎందుకంటే పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బో నేట్ పదార్థముంటుంది.దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ.కాబట్టి నీటిపై తేలడం కష్టం.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కూడా రామసేతు మానవ నిర్మితం కాదని వాదించింది. అది సహజంగా ఏర్పడిన కట్టడమే అని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా సమర్పించారు. అంతేగాక సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ పేరుతో ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా యూపీఏ సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుతో రామ సేతు ఉనికే లేకుండా పోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే యూపీఏ సర్కారు వాటిని పట్టించుకోలేదు. కానీ బీజేపీ, అన్నాడీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రామసేతు రామాయణం కాలం నాటిది. అంటే త్రేతాయుగానికి చెందినదన్నమాట.యుగాల లెక్కల ప్రకారం సత్య యుగం వయసు 17 లక్షల 28 వేల సంవత్సరాలు. త్రేతాయుగ కాల పరిమాణం 12 లక్షల 96 వేల ఏళ్లు. ద్వాపర యుగం వయసు 8 లక్షల 64 వేల ఏళ్లు. కలియుగం వయసు 4 లక్షల 32 వేల ఏళ్లు. ఇక కలియుగం క్రీస్తు పూర్వం 3102లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ లెక్కన కలియుగం నుంచి త్రేతాయుగానికి మధ్య కొన్ని లక్షల సంవత్సారాలు ఉన్నాయి. ఐతే విదేశీ సైంటిస్టులు మాత్రం రామసేతు నిర్మాణంలోని రాళ్లు 7 వేల ఏళ్ల క్రితం నాటివిగా చెబుతుండడం గమనార్హం. -
వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40
Amazon Prime Video Upcoming Web Series And Movies Over 40: కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్లకు ప్రత్యమ్నాయంగా మారాయి ఓటీటీలు. పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు విడుదల చేసేందుకు చిరునామా అయ్యాయి. సినిమాలతోపాటు వాటిని తలదన్నేలా వెబ్ సిరీస్‌లు కూడా తెరకెక్కాయి. ఇంకా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో తన సబ్స్క్రైబర్లకు సూపర్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక ఈ వినియోగదారులకు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో పండగే పండగ. అమెజాన్ ప్రైమ్ వీడియో రానున్న రెండేళ్లలో సుమారు 40 ఒరిజినల్ వెబ్ సిరీస్/సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో వీటిని నిర్మించనున్నట్లు పేర్కొంది. వాటి వివరాలను ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్‌లు/సినిమాలను కరణ్ జోహార్ ధర్మ ఎంటర్టైన్మెంట్, రితేశ్ సిద్వానీ-పర్హాన్ అక్తర్‌లకు చెందిన ఎక్సెల్ మీడియా, నిఖిల్ అడ్వానీ ఎమ్మీ ఎంటర్టైన్మెంట్, రాజ్ అండ్ డీకే ఫిల్మ్స్ ఇలా తదితర నిర్మాణ సంస్థలతో కలిసి తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్ సిరీస్, 9 రిటర్నింగ్ సిరీస్, 3 అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్స్, 2 కో-ప్రొడక్షన్స్ వాటిలో ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్, ఆది పినిషెట్టి, నిత్యా మీనన్, రీతు వర్మ, సుహాసిని, అభిజిత్ (బిగ్‌బాస్ ఫేం) తదితరులు నటించిన మోడర్న్ లవ్ వెబ్ సీరీస్, అమ్ము అనే సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. ఫర్జీ, సజల్, ది విలేజ్, హష్ హష్, ఫోన్ భూత్, యుద్రా, జీ లే జరా, ఫక్రీ 4, కో గయే హై హమ్ కహాన్, అక్షయ్ కుమార్, సత్యదేవ్ 'రామసేతు'తోపాటు సూపర్ హిట్ సిరీస్‌లు మీర్జాపూర్ 3, ది ఫ్యామిలీ మ్యాన్ 3, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 3, ముంబై డైరీస్ 2, మేడ్ ఇన్ హెవెన్ 2, పాతాళ్ లోక్ 2, కామిక్‌స్తాన్ 3, బ్రీత్: ఇన్టు ది షాడోస్ సీజన్ 2, పంచాయతీ ఎస్2 కూడా నిర్మాణంలో ఉన్నాయి. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వెవేక్ ఒబేరాయ్, ఇషా తల్వార్ కీలక పాత్రల్లో నటించిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనె వెబ్ సిరీస్ కూడా రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో 'ట్రాన్సక్షనల్ వీడియో ఆన్ డిమాండ్' (టీవీఓడీ) పేరుతో సినిమాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమ్ మెంబర్స్ కానీ వారికి టీవీఓడీ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పలు స్ట్రీమింగ్ యాప్‌లు పేపర్ వ్యూ పద్ధతి ద్వారా మూవీస్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీ5 టీవీఓడీని 'జీప్లెక్స్' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అది రామసేతువే!
‘రామసేతు’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఒకవైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన సైన్స్ చానెల్ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ.. ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. వివాదం పూర్వాపరాలతో కథనం.. రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలో మీటర్ల దూరంపాటు సముద్రంలో నిజంగా శ్రీరాముడు వంతెన నిర్మించాడా? రామసేతువు, ఆడమ్ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన ‘సైన్స్ చానల్’ రూపొందించిన ఓ కార్యక్రమం. రామసేతువు నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని ఆ కార్యక్రమం చెబుతోంది. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి తాము ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఈ కార్యక్రమంలో చెబుతున్నారు. రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్ చానల్ పేర్కొంది. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్త చెల్సియా రోస్ చెప్పారు. ఐసీహెచ్ఆర్ ద్వారా పరిశోధన రామసేతువు నిర్మాణానికి కారణమైన ద్వీపాలు చారిత్రకంగా ఉన్నాయా లేక మానవనిర్మితాలా అన్న అంశాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టు భవితవ్యం గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలపై తమ పరిశోధన ప్రభావం చూసే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చి నెలలో ఐసీహెచ్ఆర్ చైర్మన్ వై. సుదర్శన్‌రావు అభిప్రాయపడ్డారు. రామసేతువు సహజసిద్ధమైనదా లేదా మానవనిర్మితమా అన్నది నిర్ధారించే అంశాలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000– క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణిస్తున్నట్టు, అందువల్లే ఈ కాలాన్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు సైన్స్ చానల్ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టింది. ఇందుకు కారణం గతంలో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాలే. ప్రస్తుతం నౌకలు దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రావాలంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అందుకు కారణం రామసేతువు వంతెన ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతంలో సముద్రం ఎక్కువ లోతు లేకపోవడమే. ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి, సముద్రాన్ని మరింత లోతుగా చేస్తే నౌకలు అక్కడ నుంచే రాకపోకలు సాగించవచ్చనీ, తద్వారా 350 నాటికల్ మైళ్ల దూరం, దాదాపు 30 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చంటూ అప్పట్లో కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మిత్రపక్షం డీఎంకే వాదనతో కాంగ్రెస్ అంగీకరిస్తూ ‘అక్కడ వంతెన అనేదే లేదు. అది మానవనిర్మితం కాదు. ఒకవేళగతంలో ఎవరైనా దానిని నిర్మించి ఉంటే వారే దానిని నాశనం కూడా చేసి ఉండొచ్చు. రామసేతువు ఈ మధ్యే పూజ్యనీయ ప్రాంతంగా మారింది’ అని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే ప్రజల విశ్వాసాలను గౌరవించాలని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ నాడు సుప్రీంకోర్టులో అన్నారు. మరోవైపు సీతను రక్షించేందుకు ‘రామసేతువు’ మార్గాన్ని శ్రీరాముడు సృష్టించాడన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసమనీ, అందువల్ల ఆ మార్గంలో ఉన్న ద్వీపాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ గట్టిగా వాదించింది. తాజాగా సైన్స్ చానల్ కథనం ఆధారంగా పలువురు బీజేపీ మంత్రులు కాంగ్రెస్‌పై విమర్శలు ప్రారంభించారు. ‘రామసేతువు అంశంపై బీజేపీ వైఖరి సరైనదేనని సైన్స్ ఛానల్ పరిశోధన నిరూపించింది. రామాయణంలో పేర్కొన్న మేరకు సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వంతెనను నిర్మించాడనే ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ యూపీఏ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వారిప్పుడు మాట్లాడాలి. మన సాంస్కృతిక వారసత్వంలో రామసేతువు ఒక భాగం’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ అన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ Are the ancient Hindu myths of a land bridge connecting India and Sri Lanka true? Scientific analysis suggests they are. #WhatonEarth pic.twitter.com/EKcoGzlEET — Science Channel (@ScienceChannel) December 11, 2017 -
మళ్లీ రామసేతు వివాదం ఎందుకు?
-
మళ్లీ రామసేతు వివాదం ఎందుకు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడంతో గత ఆరేళ్లుగా కోర్టు పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద రామ మందిర నిర్మాణ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు అదే కోవలో కాల గమనంలో కనుమరుగైందని అనుకుంటున్న ‘రామసేతు’ అంశం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. రామసేతు ప్రకతిసిద్ధంగా ఏర్పడినదా లేదా మానవ నిర్మాణమా? అన్న అంశాన్ని తెలుసుకోవడానికి తాము స్వతంత్య్ర సర్వే నిర్వహించాలనుకుంటున్నామని భారత చారిత్రక పరిశోధన మండలి శనివారం ఓ ప్రకటన చేసింది. ఈ మండలి చైర్మన్ సుదర్శన్‌రావు పక్కా హిందుత్వ వాదనే విషయం అందరికి తెల్సిందే. పుక్కిటి పురాణాన్ని చరిత్రగా మలిచేందుకు జరిగే ప్రయత్నమే ఇదని కొంత మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం తీరం నుంచి శ్రీలంక ఆగ్నేయ తీరంలోని మన్నార్ దీవులకు మధ్య సముద్రం నీటి లోపల ఓ వారధిలాంటి నిర్మాణం ఉంది. బ్రిటానియా ఎన్సైక్లోపీడియా ప్రకారం దీన్ని రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి అని పిలుస్తారు. ఇది సున్నపు మేటల వల్ల ఏర్పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. దీన్ని ఆడమ్స్ నిర్మించడం ఆడమ్స్ బ్రిడ్జి అని, కాదు రాముడు నిర్మించడం వల్ల రామసేతు అని పేరు వచ్చిందన్నది మత విశ్వాసకుల అభిప్రాయం. సీతను రావణాసురుడు శ్రీలంకకు ఎత్తుకుపోవడం వల్ల అక్కడికి వెళ్లేందుకు వానర సైన్యం రాళ్లతో ఈ వంతెన నిర్మించిందన్నది మత విశ్వాసకుల అభిప్రాయం. 18వ శతాబ్దంలోనే కొట్టేయాలనుకున్నారు పాశ్చాత్య దేశాల నుంచి సరకు రవాణా నౌకలు భారత తూర్పు తీరానికి రావాలంటే సముద్రం నీటిలో ఈ రామసేతు అడ్డుగా ఉంది. దాంతో ఆ నౌకలు శ్రీలంకను చుట్టి భారత్ తీరానికి వస్తున్నాయి. దీని వల్ల అపార ఖర్చుతోపాటు ఎంతో కాలం ఖర్చవుతోంది. బ్రిటిష్ కాలంలో ఇంగ్లండ్ నుంచి భారత్ తూర్పు తీరానికి ఈస్ట్ ఇండియా కంపెనీ సరకుల నౌకలు కూడా శ్రీలంకను చుట్టి వచ్చేవి. ఈ అనవసర ఖర్చును, సమయాన్ని ఆదా చేయడం కోసం రామసేతును కొట్టేయాలని ఇంగ్లీష్ జియోగ్రాఫర్ జేమ్స్ రెన్నెల్ ప్రణాళిక వేశారు. అది అనేక చారిత్రక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్ట్ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. 1955లో సేతు సముద్రం ప్రాజెక్టు కమిటీ ప్రతిపాదనలను భారత్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే 50 ఏళ్ల తర్వాత, అంటే 2005లో ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషద్ లాంటి సంస్థలు ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగడమే కాకుండా సుప్రీం కోర్టుకెక్కాయి. రామాయణం ఒక ఇతియాసం మాత్రమేనని, అందులోని రాముడి పాత్ర నిజంగా ఉందనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవంటూ భారత ఆర్కియాలోజి సంస్థ కోర్టులో 2007లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎల్కే అద్వానీకి ఎంతో కలసివచ్చింది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆయన అఫిడవిట్‌ను అస్త్రంగా మలుచుకొన్నారు. మత విశ్వాసాలను గౌరవించలేని కాంగ్రెస్‌కు లౌకికవాదినని చెప్పుకునే అర్హత కూడా లేదని విమర్శించారు. రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు? కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మద్దతు పలికాయి. రామసేతును దెబ్బతీయకుండానే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా ఏఐడీఎంకే సూచించింది. డీఎంకే నాయకుడు కరుణానిధి ఒక అడుగు ముందుకేసి, రామసేతును కట్టడానికి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల హిందూ సంస్థలు నాడు తీవ్రంగా గొడవ చేశాయి. ప్రముఖ చరిత్రకారుడు పన్నీకర్ కూడా రామసేతుకు నష్టం జరుగకుండా ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగాలని సూచించారు. రామాయణం చరిత్రకాదని, అది కల్పిత గాధన్నది తనకు తెలుసునని, అయితే కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని ఇక్కడ దెబ్బతీయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో వివాదం సద్దుమణగింది. పర్యావరణ అంశాల అవరోధం 2009 తర్వాత కోర్టు వాదనలన్నీ ప్రధానంగా పర్యావరణ అంశాలపై కొనసాగాయి. సేతు సముద్రం ప్రాజెక్ట్ వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందంటూ పర్యావవరణ పరిరక్షణ సంస్థలు వాదించాయి. ఈనేపథ్యంలో వాస్తవాస్తవాలను తేల్చేందుకు ఆర్కే పచౌరి కమిటీ ఏర్పాటయింది. పర్యావరణ పరిస్థితులకు తీవ్ర విఘాతం కలుగుతుందంటూ 2013లో పచౌరి కమిటీ నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి పూర్తిగా తెరపడిన ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకరావడం వెనక దురుద్దేశాలున్నాయని కేరళ, తమళనాడు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మతం పునాదులను బలోపేతం చేసుకునే ప్రయత్నం కావచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.