'రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చండి'
న్యూఢిల్లీ: రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చాలని కేంద్రపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మంగళవారం మంత్రిని కలిసిన కవిత, బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కేంద్రం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మహేశ్ శర్మను బతుకమ్మ పండుగ ఉత్సవాలకు కవిత ఆహ్వానించారు.