Ramji Naik
-
డిగ్రీ గురుకులాల్లో చేరాలి
► గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు రాంజీనాయక్ నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: గిరిజన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించిందని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రాంజీనాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటుచేసిన విద్యా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పదోతరగతి అయ్యాక చదువు మాన్పించి పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారన్నారు. బాల్య వివాహాలు బారిన పడకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీతారాం, ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ ఇంట్లో చోరీ
మాచర్ల శివారులోని ఎంఎస్ఆర్ టౌన్షిప్లో గురువారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. రాంజీ నాయక్ అనే వైద్యుడి ఇంట్లోకి చొరబడి తాళిబొట్టు, ఒక చైన్, రెండు ఉంగరాలతో పాటు రూ.రెండున్నర లక్షల విలువచేసే వస్తువులు ఎత్తుకెళ్లారు. ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకి, కత్తులతో బెదిరించినట్లు బాధితులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.