డిగ్రీ గురుకులాల్లో చేరాలి | Students should in Degree Gurukul's | Sakshi
Sakshi News home page

డిగ్రీ గురుకులాల్లో చేరాలి

Published Sun, Apr 23 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

డిగ్రీ గురుకులాల్లో చేరాలి

డిగ్రీ గురుకులాల్లో చేరాలి

►  గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు రాంజీనాయక్‌
నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌: గిరిజన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించిందని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రాంజీనాయక్‌ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటుచేసిన విద్యా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పదోతరగతి అయ్యాక చదువు మాన్పించి పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారన్నారు. బాల్య వివాహాలు బారిన పడకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీతారాం, ఎల్‌హెచ్‌పీఎస్‌ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement