Rammurthy
-
వేడుకగా హంస పురస్కారాల ప్రదానం
రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్.అబ్దుల్ అజీజ్ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్ జడా సుబ్బారావు (అసిస్టెంట్ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్ హెచ్ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు. వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కె. సుధాకర్ ప్రసంగించారు. -
నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ రామ్మూర్తి
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ నెలరోజులు సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో డీన్ డాక్టర్ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన వచ్చే నెల 2వరకు ఇన్చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. -
గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూత
సాక్షి, నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమ్మూర్తి యాదవ్ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1947 ఆక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. మొదటిసారిగా 1981 లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 1999 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారు. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా రాంమ్మూర్తికి మంచి పేరు ఉంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రాంమూర్తి యాదవ్ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయ పడ్డారు. -
గిల్ట్ తో పల్టీ
చాలాసార్లు క్రైం ఉంటుంది.అన్నిసార్లు అనుమానాలు ఉంటాయి.కొన్నిసార్లు క్లూ ఉండదు.తెలివైన ఆఫీసరు అనుమానాన్ని క్లూగా మార్చాడు.అనుమానానికి పూతపూసి దుర్మార్గుణ్ణి పల్టీ కొట్టించాడు.మే 15, 2018. వరంగల్ జిల్లా హసన్‌పర్తి.రాత్రి తొమ్మిది దాటి ఏడు నిమిషాలు అయ్యింది. శివారులో రామూర్తి ఇల్లు అది. రామ్మూర్తికి 65 ఏళ్లు. అతనికి భార్య గంగాదేవికి 58.పిల్లలు పుట్టలేదు కనుక ఒకరికొకరుఅన్నట్టు ఇద్దరే ఆ ఇంట్లో బతుకుతున్నారు. అదే ఇంట్లో కిరాణా షాపును నడుపుతుంటారు. కాస్త దూరమైనా రామ్మూర్తి ఇంటికి కిరాణ సరుకుల కోసం జనం వచ్చిపోతుంటారు. సాధారణంగా రాత్రి ఏడు గంటలు దాటితే పెద్దగా జన సంచారం ఉండదు ఆ ప్రాంతంలో. అందుకే ఏడు దాటక ముందే కొట్టు మూసేస్తాడు రామ్మూర్తి. తిరిగి ఉదయం 5 గంటలకు పాల వ్యాన్ వచ్చినప్పుడు తెరుస్తాడు. ఇప్పుడు రాత్రి 9 దాటడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. రామ్మూర్తి టీవీ చూస్తున్నాడు.గంగాదేవి పెరటివైపు తలుపు తీసింది బాత్రూమ్కి వెళ్లడానికి.అప్పటికే మూలన చీకట్లో నక్కి ఉన్న ఓ ఆకారం అప్రమత్తమైంది. గంగాదేవి బాత్రూమ్లోకి వెళ్లి తలుపు దగ్గరగా వేసింది. ఒక్క ఉదుటున ఆ ఆకారం బాత్రూమ్లో దూరింది. గంగాదేవి మీద దూకింది. గంగాదేవికి ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యింది. భయంతో అరవబోయేలోగా మెడపై కత్తి రావడం, కంఠం తెగడం క్షణాల్లో జరిగిపోయాయి.అరిచే అవకాశమే లేకుండా గంగాదేవి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్నానాల గది అంతా రక్తంతో నిండిపోయింది.టైమ్ 9.15.ఆ ఆకారం బాత్రూమ్ డోర్ తెరిచి మెల్లగా పెరటి తలుపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. టీవీలో వార్తలు చూసున్న రామ్మూర్తిని వెనక నుంచి సమీపించింది. అలికిడి వినిపించినా గంగాదేవే అనుకుని వెనక్కి తిరగలేదు రామ్మూర్తి. ఆ ఆకారం చేయి పైకి లేచింది. చేతిలో ఇటుకరాయి. రామ్మూర్తి తలమీద ఒకే ఒక్క దెబ్బ పడింది. అంతే. రామ్మూర్తి అడ్డంగా పడిపోయాడు. తెల్లవారింది.‘ఏమోయ్.. టైం 7 దాటుతోంది. కాస్త నా ముఖాన చాయ్ పోస్తవా లేదా?’ అంటూ అరిచాడు పక్కింటి సురేశ్. బాబాయ్ ఇంకా షాప్ తెరవలేదు. లేకుంటే ఎపుడైనా ఆలస్యం చేశానా’ వంటింట్లో నుంచి బయటికి వచ్చింది లక్ష్మి. ‘బాబాయ్ ఊర్లోనే ఉన్నాడు కదా.. బహుశా పాలు రాలేదేమో వెళ్లి చూస్తానుండు’ అంటూ కదిలాడు సురేశ్. పాలవ్యాను వచ్చి వెళ్లింది. పాల ప్యాకెట్ల ట్రేలన్నీ అలాగే షాప్ ముందు వదిలేసి ఉన్నాయి. వచ్చి చూసి రామ్మూర్తి లేడని వెళుతున్నారు ఒకరిద్దరు. ‘అదేంటి బాబాయ్ నిద్ర లేవలేదా? పిన్ని అయినా లేవాలి కదా?’ అంటూ తలుపు కొట్టాడు. లోపలి నుంచి అలికిడి రాలేదు. అతని మనసు ఏదో కీడు శంకించింది. పాల ప్యాకెట్ల కోసం వచ్చిన వాళ్లు ‘ఏం జరిగి ఉంటుందంటారు’ అన్నారు. డోర్ బద్దలు కొట్టి చూద్దాం’ అన్నాడు సురేశ్.వద్దు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్లు వచ్చి చూస్తారు’ అన్నారు అక్కడ గుమికూడిన వాళ్లలో నుంచి ఓ వ్యక్తి.సురేశ్ పోలీసు స్టేషన్‌కి ఫోన్ కలిపాడు. నిమిషాల్లో పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు రామ్మూర్తి ఇంటికి. లోపలి నుంచి డోర్ పెట్టి ఉంది. ఎలా వెళ్లడం అని చూస్తున్నారు పోలీసులు.‘ఇంటి వెనక చిన్న గోడ ఉంది సార్’ అని గుంపులోని వారు చెప్పడంతో వెనకవైపుగా వెళ్లారు. గోడ దూకి చూసిన పోలీసులు ఇంట్లో కనిపించింది చూసి ఉలిక్కిపడ్డారు.ఒకే ఇంట్లో రెండు శవాలు.వెంటనే వైర్లెస్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాడు కానిస్టేబుల్. హసన్‌పర్తిలో డబుల్ మర్డర్.క్షణాల్లో వార్త ఊళ్లో కలకలం రేపింది.వరంగల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు.అక్కడంతా పర్యవేక్షించి ‘హంతకుడు సాయంత్రంలోగా దొరకాలి’ సిబ్బందిని హెచ్చరించి వెళ్లాడు.క్లూస్ టీంతో పాటు మొత్తం 10 బృందాలు రంగంలోకి దిగాయి. కొందరు వాహన తనిఖీలు, మరికొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇంకొందరు లాడ్జీలు ఇలా ఎవరికి కేటాయించిన పనుల్లో వారు మునిగిపోయారు. ఈలోగా కమిషనర్ ఆరుగురు సీఐలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. వారంతా క్రైం, సైబర్, క్లూస్, ఫోరెన్సిక్ రంగాల్లో మెరికల్లాంటి వారు. కమిషనరేట్‌లో ఉన్న వారిలో ది బెస్ట్. క్లూస్ టీం రిపోర్ట్ వచ్చింది.హంతకుడు చాలా తెలివైనవాడు. పరిసరాలపై ముందే అవగాహన ఉంది. అందుకే పొంచి ఉండి మరీ దాడిచేశాడు. ఇంట్లో నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. కొట్టులో చిల్లరనూ ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగింది. హత్యచేసాక సంఘటనా స్థలంలో కారంపొడి చల్లాడు ఆధారాలు దొరకకూడదని. దాడికి కొత్త ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే హత్యాస్థలంలో వేలి ముద్రలు దొరికినా వాటిని పాత నేరస్థుల వేలిముద్రలతో సరిపోల్చితే ఎక్కడా సరి పోలలేదు. ఈ వివరాలతో కేసు జటిలంగా మారింది. హంతకుడి గురించి ఏమీ తెలియడం లేదు. కాని ఇంత కిరాతకంగా మర్డర్ చేశారు కాబట్టి ఒకరి కంటే ఎక్కువమంది హత్యలో పాల్గొని ఉంటారని పోలీసు లు అంచనాకు వచ్చారు. వరంగల్ చుట్టుపక్కల వివిధ పనులకు వచ్చిన ఉత్తర భారతీయలను విచారించడం మొదలు పెట్టారు.సీఐ బృందం రామ్మూర్తి, గంగాదేవిల కుటుంబ వివరాలు సేకరించింది. ‘వీరికి ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. శత్రువులూ లేరు. అలాంటప్పుడు ఇంత కిరాతకంగా హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?’అన్న విషయం పోలీసులకు అంతుచిక్క లేదు. వారికి పక్కింటి సురేశ్‌పై అనుమానం వచ్చింది. అతణ్ణి పట్టుకెళ్లి అన్ని కోణాల నుంచి ప్రశ్నలు సంధించారు. సురేశ్ హడలిపోయాడు. అతడికేం తెలియదనిఅర్థమైంది.ఆ వీధిలో సీసీ కెమెరా లేదు. కాని అది వెళ్లి కలిసే మెయిన్ రోడ్డు మీద ఈ వైపు నుంచి ఓ బైక్ ఆ రాత్రి 9:30 గంటల వెళ్లడం పోలీసులు గమనించారు. మరోవైపు సెల్‌టవర్ పరిధిలోని కాల్స్‌ను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. బైక్‌నంబర్ ద్వారా మనిషి వివరాలు తెలిశాయి. కాని అనుమానించడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని ఆ ఊళ్లోనే ఉన్న అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేడు. ముసలి తల్లి ఉంది.‘హైదరాబాద్ వెళ్లాడు’ అని చెప్పింది.ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి పోలీసులు ట్రై చేస్తే కాల్ కనెక్ట్ కాలేదు. ఫోన్‌ను ట్రాక్ చేయడం మొదలెట్టారు. వరంగల్ శివారులోని అటవీ ప్రాంతం దగ్గర ఆ ఫోన్ ఆపరేట్ అవుతూ ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడ ఎందుకు ఉన్నట్టు?మరో గంటలో మఫ్టీలో ఉన్న పోలీసులు అతణ్ణి చుట్టుముట్టారు. ‘ఎంత ఇంటరాగేట్ చేసినా నిజం చెప్పడం లేదు సార్..’ అలిసిపోయిన కానిస్టేబుళ్లు సీఐతో చెప్పారు.అప్పుడే సీఐ బృందం ఇంటరాగేషన్ రూమ్‌కి వచ్చింది. వాళ్లను చూడగానే అతడు ‘సార్.. నాకే పాపం తెలియదు. నన్నిలా ఇరికించడం న్యాయం కాదు’ అని కన్నీరు మున్నీరు అయ్యాడు. వాలకం చూస్తే జాలి వేసేలా ఉంది. ఇంటరాగేషన్ టీమ్‌కు ఏం చేయాలో తోచలేదు. ఈ లోగా సి.ఐ వచ్చి అతని ముందు ఓ మూట పడేశాడు. దాంట్లో నుంచి కొన్ని చిల్లర నాణేలను తీసి అతనిపై విసిరేశారు. ‘ఇవి నువ్వు కొట్టేసిన నగలు, ఇవి కిరణాషాపులో నువ్వు కొట్టేసిన చిల్లర. ఇవి చాలా.. ఇంకా ఆధారాలు చూపించాలా?‘ అని గద్దించాడు.అంతే. అతని ముఖం మాడిపోయింది.సార్, తప్పయిపోయింది...’అన్నాడు ఏడుస్తూ. అతని మాటలు వింటూనే పోలీసులు అవాక్కయ్యారు. ‘నీతోపాటు ఇంకెవరెవరు ఉన్నారు ఈ హత్యల్లో?’‘నేనొక్కడినే సార్. ఎవరూ లేరు’ అంత దారుణంగా ఇద్దరి వ్యక్తులను పొట్టన పెట్టుకుంది బక్కపల్చగా, పాతికేళ్లయినా లేని ఇతనా! ‘బంగారం ఎక్కడ పెట్టావు’ ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.‘అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైంది అతనికి. పోలీసులు చీకట్లో బాణమేస్తే తానే దొరికిపోయానని.‘ఒక్క క్లూ కూడా వదల్లేదు కదా సార్ ఎలా పట్టుకున్నారు?’ కానిస్టేబుల్ అడిగాడు సిఐని.నిజమే! ఒక్క క్లూ వదల్లేదు.. అతనిపై మాది కేవలం అనుమానమే. పనీపాటా లేని ఇతను అపుడపుడూ ఆ రామ్మూర్తి కిరాణ కొట్టులో పనిచేసే వాడని తెలిసింది. వారం రోజులుగా అక్కడే ఉన్న ఇతను మూడురోజుల నుంచి అసలు ఊళ్లోనే లేడు. హత్య జరిగిన రాత్రే వీధిలో నుంచి వెళ్లిన ఓ బైక్ మెయిన్ రోడ్‌లోని సీసీ ఫుటేజీలోరికార్డ్ అయ్యింది. ఆ బైక్ ఇతనిదేనని చెప్పారు కాలనీవాళ్లు. దానిని బట్టి మేం సెల్ నెంబరుకు ట్రై చేసినా ఇతను దొరకలేదు’ అంటూ నిందితుడివైపు తిరిగిన సీఐ ‘నీ లవర్‌తో నువ్వు వేరే ఫోన్నుంచిమాట్లాడుతున్నా వని గుర్తించాం.ఇంట్లోవాళ్లకు ఊరెళ్తున్నానని చెప్పి. వేరే ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావా? అని అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. కానీ, నువ్వే నేరం అంగీకరించి మాకు దొరికిపోయావు’ అంటూ అసలు విషయం చెప్పారు పోలీసులు. జల్సాల కోసం, ప్రియురాలిని మెప్పించడం కోసం ఈ రెండు హత్యలను చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు తన విలువైన జీవితాన్ని కారాగారంలో గడుపుతున్నాడు ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైందిఅతనికి. పోలీసులు చీకట్లోబాణమేస్తే తానే దొరకిపోయానని. – అనిల్ కుమార్ భాషబోయిన -
బంగారు నగలు చోరీ
సిద్దవటం : సిద్దవటం మండలం ఉప్పరపల్లె పంచాయతీలోని సాయినగర్ రోడ్ నెంబర్3లో నివాసముంటున్న అవ్వారు రామ్మూర్తి తన నివాసంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగలను దొంగలించారని తెలిపారు. రామ్మూర్తి కుమారుడు వెంకటసుబ్బయ్య కడపలోని ఓ డెంటల్ ఆసుపత్రిలో పని చేస్తూ కడపలోనే కాపురముంటున్నారు. ఆయనకు బుధవారం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి తాళాలు వేసి కడపకు వెళ్లారు. బుధవారం రాత్రి తమ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే గ్రామానికి వచ్చి ఇంట్లోని బీరువాను పరిశీలించారు. అందులో ఉన్న బంగారు ఆభరణాలు , నల్ల పూసల దండ, గుండ్ల దండ, 8 గాజులు, ఒక జత కమ్మలు, చైన్, ఉంగరం చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 2.80 లక్షలు ఉంటుందని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏడాదిగా ఎదురుచూపులు
ఏలూరు (సెంట్రల్) : లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఏడాది కాలంగా బందీగా ఉన్న ఏలూరు దొండపాడుకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి రాక కోసం కుటుంబసభ్యులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల క్రితం భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావడంతో రామ్మూర్తి కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురించాయి. ఏలూరు రూరల్ మండలం దొండపాడులో నివాసం ఉండే రామ్మూర్తి 17 ఏళ్లుగా లిబియాలోని సిరిట్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి పలు ప్రయత్నాలు చేస్తున్నా విడుదల కాలేదు. ఈ క్రమంలో ఉగ్రవాదుల బందీ నుంచి ఇటీవల ఇద్దరు విడుదల కావడంతో రామ్మూర్తి భార్య అన్నపూర్ణభవానీ, కుమారుడు, ఇద్దరు కుమారైలు ఆయన రాకకోసం ఎదురుచేస్తున్నారు. రామ్మూర్తి విడుదలైయ్యే విధంగా ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
రాజకీయ పార్టీగా మాలమహానాడు
సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి రామగుండం : వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మాలమహానాడు రాజకీయ పార్టీగా అవతరిస్తుందని మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి ప్రకటించారు. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలను మాలలు ఆదరించాలని కోరారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన మహానాడు చైతన్య సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని, ఆయన రాజీనామా చేసేవరకూ మాలలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సూచించారు. జనాభాలో 5శాతం ఉన్నవారు ముఖ్యమంత్రులు అవుతూ 85శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు స్వార్థం కోసం దళితులను విభజించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. దళితుల బ్యాక్లాగ్ పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని, బడ్జెట్లో 20శాతం నిధులను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాలని కోరారు. అనంతరం పలువురు మహిళా ప్రతినిధులు రామ్మూర్తిని పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి కోల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గడ్డం సుశీల, గాదం రాధ, కారంగుల రాము, కోల కనకయ్య, దేవి రాజలింగు, తీట్ల ఈశ్వరీ, గాదం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పెళ్లికూతుర్ని చూద్దామని వెళ్లి బుక్ అయ్యాడు..
చెన్నై: మలి వయసులో తోడు కోసం పెళ్లి ప్రకటన ఇచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. ఏదో అనుకుంటే ....ఇంకేదో అయిందన్నది ఈ పెద్దాయనకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. చివరికి సమయస్ఫూర్తిగా వ్యవహరించి పెళ్లి మాట దేవుడెరుగు .. బతుకు జీవుడా అనుకుంటూ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డ వైనం చైన్నై తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు చెన్నైకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తి. భార్యనుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఆయనకు..ఆలోచన వచ్చిందే తడవు...వధువు కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అనుకున్నట్టుగానే స్పందన కూడా బాగానే వచ్చింది. వైష్టవి అనే 35ఏళ్ల మహిళ ఫోన్ చేసి.. కోయంబేడు బస్‌స్టాప్‌కు రమ్మని ...మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్పింది.. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. పెళ్లికూతుర్ని చూడాలని ఆతృతగా వెళ్లిన రామ్మూర్తితో వైష్ణవి కలిసి మాటలు కలిపింది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఇంతలో నలుగురు యువకులు హఠాత్తుగా చుట్టుముట్టి రామ్మూర్తిపై దాడి చేశారు. నిమిషాల్లో వైష్ణవితోపాటు, ఆ నలుగురు యువకులు ఆయన్నిఎత్తి కారులో వేశారు. రెండు రోజులు నగరమంతా తిప్పారు. చివరికి ఒక బ్యాంక్ దగ్గరికి తీసుకువెళ్లి రామ్మూర్తి ఖాతాలో ఉన్న రూ.35 లక్షలు డ్రా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన రామ్మూర్తి తెలివిగా వ్యవహరించి తాను కిడ్నాప్ అయిన విషయాన్ని బ్యాంక్ అధికారుల చెవిన వేశాడు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది తాంబరం పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన పోలీసు బృందం స్పాట్‌కు చేరుకుంది. అయితే దీన్ని గమనించిన ఆ ముఠా ..వైష్ణవితో పాటు అక్కడ నుంచి ఉడాయించింది. దాంతో బతుకు జీవుడా అనుకున్న రామ్మూర్తి ..అక్కడ నుంచి బయటపడ్డాడు.