Ramohan Rao
-
బతుకమ్మ ఉత్సవాలు
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు కొనసాగుతాయని, జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో, 4న మున్సిపాల్టీల్లో, 6న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మోడల్ బతుకమ్మలను ప్రదర్శించాలని సూచించారు. బతుకమ్మల నిమజ్జనానికి చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది బతుకమ్మ పాట ల పోటీలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, జిల్లా సమాచారశాఖ డీడీ ముర్తూజా, రమేశ్ రాథోడ్, సుదర్శనం, గోవింద్, జయసుధ, స్రవంతి, శశికళ, సంధ్యారాణి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు రోజులు.. 3 కోట్లు!
* సాగర్‌లో ‘అరుణాచలం’ * టీఆర్ఎస్ శిక్షణశిబిరానికి జెన్కో సీఈ ఏర్పాట్లు నాగార్జునసాగర్: ‘‘30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు చేయాలి..అప్పుడే మూడు వేల కోట్ల రూపాయలకు అధిపతి అవుతావు’’ అని అరుణాచలం సినిమాలోనిదీ డైలాగ్. హీరో రజనీకాంత్ విలాస జీవితం గడిపి ఈ పోటీలో గెలుస్తాడు. అచ్చం ఇలానే ఉంది సాగర్ జెన్కో సివిల్ చీఫ్ ఇంజినీర్ రామ్మోహన్రావు పరిస్థితి. కేవలం నాలుగు రోజుల్లో రూ.3 కోట్లు ఖర్చు చేయాలి. అప్పుడే గులాబీ దళపతి వద్ద మెప్పు పొం దాల్సి ఉంది. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? మార్చి 4,5వ తేదీల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు జరగనున్నాయి. అందుకుగాను రెండురోజులు సీఎంతోపాటు ప్రజాప్రతినిధులు సాగర్‌లో బస చేయనున్నారు. 3వ తేదీ సాయంత్ర మే తెలంగాణలోని గులాబీ దళం సాగర్‌కు చేరుకోనుంది. అయితే రెండో తేదీ వరకే జెన్కో అతిథిగృహాన్ని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌గా మార్చి పోలీస్‌శాఖకు అప్పగించాల్సి ఉంది. జెన్కో అతిథిగృహంలో సకల వసతులకు రూ.3 కోట్లు కేటాయించారు. శిక్షణ శిబిరానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నాలుగు రోజుల్లో మూడు కోట్లు ఖర్చు చేసి అతిథి గృహానికి అందాలు అద్దడానికి చీఫ్ ఇంజనీర్ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. ఎస్ఈ, ఈఈలు, ఏఈలు జేఈలు కంటి మీద కునుకు లేకుండా కృషి చేస్తున్నారు. గురువారం జెన్కో సివిల్ చీఫ్ ఇంజనీర్ రామ్మోహన్రావు హైదరాబాద్ నుంచి వచ్చి పనులను సందర్శించి ఎంత మేరకు పూర్తయ్యాయో అధికారులతో సమీక్ష సమావేశం జరిపి వెళ్లారు. -
సిటీ దివాస్
పరువం వానగా కురిసింది. అందం ముద్దమందారమై విరిసింది. సిటీ సుందరాంగులు ర్యాంప్‌పై హంసనడకలతో అదరగొట్టారు. నానక్‌రామ్‌గూడ హయుత్ హోటల్లో గురువారం నిర్వహించిన ‘యమహా ప్యాసినో మిస్ దివా యుూనివర్స్ 2014’లో ఎవరికెవరూ తీసిపోనంతగా... ‘అందం’గా పోటీపడ్డారు. చివరగా మిగిలిన 11 మందిలో ఐదుగురిని ముంబాయిలో వచ్చే నెల 4న జరిగే ఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు. అందం ఒక్కటే కాదు... పర్సనాలిటీ, మాటతీరు, స్టేజ్ ప్రాక్టీస్, రియాలిటీ షోలలో పాల్గొనడంలో చూపే చొరవ వంటి అంశాలను పరిశీ లించి ఈ ఐదుగురిని ఎంపిక చేశారు. పద్మజాసింగ్ (23;బిజినెస్ అనలిస్ట్, సెయింట్‌పాల్స్ కళాశాల), సరీనా (22; సెయింట్ అండ్రూస్ కళాశాల), అలీస్ రెజిరియో (20; సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల), జయా విశ్వనాథన్ (19; ఎంజీఐటీ కళాశాల), జోయితాఘోష్ (26; టెక్నో ఇండియా ఇంజనీర్) వీరిలో ఉన్నారు. ‘ప్రస్తుతం సీఏ చదువుతున్నా. ఈ ఫైనల్ పోటీల కోసం నాలుగేళ్లుగా సిద్ధవువుతున్నా. ఫైనల్స్ కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా’ అని సరీనా చెప్పింది. ‘ఈ ఆడిషన్స్‌లో పోటీ తీవ్రంగా సాగింది. తుది ఐదుగురిలో చోటు దక్కినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం బిజినెస్ అనాలసిస్ట్‌గా చేస్తున్నా. టైటిల్ సాధిస్తా’నని పద్మజాసింగ్ దీమా వ్యక్తం చేసింది. - రాంమోహన్‌రావు, రాయదుర్గం -
చదువుకున్న చోటే..గౌరవ సత్కారం
కేయూ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రామ్మోహన్రావు కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం, స్నాతకోత్సవ ముఖ్య అతిథి కూడా ఆయనే కావడం ఈసారి ప్రత్యేకత. కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవానికి క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11గంటలకు స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటివరకు యూనివర్సిటీలో 19 స్నాతకోత్సవాలు జరగ్గా 35మంది ప్రముఖులు గౌరవ డాక్టరేట్లు అందుకున్నా రు. హైదరాబాద్‌లోని సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డెరైక్టర్ సీహెచ్ రామ్మోహన్‌రావుకు ఈసారి గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. గౌరవ డాక్టరేట్ పొందేవారినే ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించాలనే నిబంధన ఈసారి ఉండడంతో రామ్మోహన్రావే ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. గతంలో నిర్వహించిన స్నాతకోత్సవాల్లో ఒకరి నుంచి ఆరుగురి వరకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వ గా ప్రస్తుతం ఒక్కరికే ఇవ్వాలనే నిబంధన వి దించారు. ఏర్పాట్లు పూర్తి స్నాతకోత్సవం కోసం యూనివర్సిటీలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఆడిటోరియంను ముస్తాబు చేశారు. గెస్ట్‌హౌస్‌ను రంగులతో తీర్చిదిద్దారు. వీసీ, రిజిస్ట్రార్ పర్యవేక్షణలో వివిధ కమిటీలు పలు విధులు నిర్వర్తిస్తున్నాయి. నిరాశపరిచిన గవర్నర్ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వస్తారని యూనివర్సిటీ అధికారులు భావించి నప్పటికీ ఆయన రావడం లేదని గవర్నర్ పేషీ నుంచి శనివారమే యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవాలని ఆశపడిన పీహెచ్డీ పూర్తిచేసిన విద్యార్థులు నిరాశ చెందు తున్నారు. గవర్నర్ స్థానంలో కేయూ వీసీ వెంకటరత్నం పట్టాలు, బంగారు పతకాలు ప్రదా నం చేస్తారు. ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ,పీజీ, డిప్లోమా కోర్సుల్లో 174 గోల్డ్‌మెడల్స్, 510 వర కు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేయనున్నా రు. నోటిఫికేషన్ ఇచ్చాక సకాలంలో స్నాత కో త్సవంపై దృష్టి సారించకపోవటంతో 150 మంది వరకు విద్యార్థులు తమ పట్టాలను తీసు కెళ్లారు. 2010 మే 25నుంచి ఈనెల 10వతేదీ వరకు అవార్డు పొందిన అభ్యర్థులకు కూడా పీ హెచ్డీ పట్టాలను అందించనున్నారు. ఆయా అభ్యర్థులకు పాస్‌లు, బ్యాడ్జీలు అందజే శారు. రామ్మోహన్రావు అందుకున్న అవార్డులు యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్(1990) యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (1982) శ్రీనివాసయ్య మెమోరియల్ అవార్డ్(1996) ది సొసైటీ ఆఫ్ బయాలాజికల్ కెమిస్ట్రీ (ఇండియా) రోహతో అవార్డ్ ఫస్ట్ ఏసియన్ క్యాటరాక్ట్ కాన్ఫరెన్స్(1996-చైనా) శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ (1999) రాన్‌బ్యాక్సీ అవార్డ్ ఫర్ బేసిక్ మెడికల్ సెన్సైస్(2000) జేసీ బోస్ నేషనల్ ఫెల్లోషిప్,డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా (2011) ది స్టేట్ ఇంటలెక్చువల్ ఆనర్ గ్రేట్ సన్ ఆఫ్ ది సాయిల్ (2010) బిరెస్ చంద్రగుహ మెమోరియల్ లెక్చర్ అవార్డ్ ఐఎన్ఎస్ఏ (2014) మెంబర్షిప్ ఇన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఇవికాక పలు అసోసియేషన్లలో మోహన్‌రావుకు మెంబర్షిప్ ఉంది. అమెరికా అసోసియేషన్ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యూలర్ బయాలజీ( యూఎస్ఏ). అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్విజన్ అండ్ ఆఫ్తాల్మాలజీ (యూఎస్ఏ), ఇండియన్ ఫొటో బయాలజీ సొసైటీ (ఇండియా), సొసైటీ బయాలజికల్ కెమిస్ట్రీ (ఇండియా). 2009 నుంచి 2011వరకు ఇండియన్ బయోఫిజికల్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్మోహన్రావు కేయూ పూర్వ విద్యార్థే స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ రామ్మోహన్రావు కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వారే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఆయన జనవరి19, 1954న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. హుజూరాబాద్‌లోనే హైస్కూలు విద్య పూర్తిచేసిన మోహన్‌రావు ఓయూలో బీఎస్సీ పూర్తిచేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశారు. 1984లో హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న రామ్మోహన్రావు 2009 నుంచి సీసీఎంబీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వద్ద 17మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్డీ చేశారు. 13మంది పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్‌కు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్‌లో ఎడిటోరియల్ బోర్డ్ సభ్యుడిగా వ్యవహరించిన డాక్టర్ రామ్మోహన్రావు ప్లాంట్స్ఫీల్డ్లో నూతన ఆవిష్కరణలకు గాను నాలుగు యూఎస్ పేటెంట్లు కలిగి ఉన్నారు. జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్న ఆయన ‘సైన్స్ ఫర్ ది పీపుల్స్ మూవ్మెంట్’కు తనవంతు సహకరిస్తున్నారు.