సిటీ దివాస్ | Yamaha passion miss diva universe 2014 Ramp show at Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీ దివాస్

Published Fri, Aug 8 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

సిటీ దివాస్

సిటీ దివాస్

పరువం వానగా కురిసింది. అందం ముద్దమందారమై విరిసింది. సిటీ సుందరాంగులు ర్యాంప్‌పై హంసనడకలతో అదరగొట్టారు. నానక్‌రామ్‌గూడ హయుత్ హోటల్‌లో గురువారం నిర్వహించిన ‘యమహా ప్యాసినో మిస్ దివా యుూనివర్స్ 2014’లో ఎవరికెవరూ తీసిపోనంతగా... ‘అందం’గా పోటీపడ్డారు. చివరగా మిగిలిన 11 మందిలో ఐదుగురిని ముంబాయిలో వచ్చే నెల 4న జరిగే ఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు. అందం ఒక్కటే కాదు... పర్సనాలిటీ, మాటతీరు, స్టేజ్ ప్రాక్టీస్, రియాలిటీ షోలలో పాల్గొనడంలో చూపే చొరవ వంటి అంశాలను పరిశీ లించి ఈ ఐదుగురిని ఎంపిక చేశారు.
 
పద్మజాసింగ్ (23;బిజినెస్ అనలిస్ట్, సెయింట్‌పాల్స్ కళాశాల), సరీనా (22; సెయింట్ అండ్రూస్ కళాశాల), అలీస్ రెజిరియో (20; సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల), జయా విశ్వనాథన్ (19; ఎంజీఐటీ కళాశాల), జోయితాఘోష్ (26; టెక్నో ఇండియా ఇంజనీర్) వీరిలో ఉన్నారు. ‘ప్రస్తుతం సీఏ చదువుతున్నా. ఈ ఫైనల్ పోటీల కోసం నాలుగేళ్లుగా సిద్ధవువుతున్నా. ఫైనల్స్ కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా’ అని సరీనా చెప్పింది. ‘ఈ ఆడిషన్స్‌లో పోటీ తీవ్రంగా సాగింది. తుది ఐదుగురిలో చోటు దక్కినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం బిజినెస్ అనాలసిస్ట్‌గా చేస్తున్నా. టైటిల్ సాధిస్తా’నని పద్మజాసింగ్ దీమా వ్యక్తం చేసింది.   
-  రాంమోహన్‌రావు, రాయదుర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement