rangamma
-
సుత్తితో మోదీ.. దుప్పట్లో చుట్టి.. భార్య దారుణ హత్య!
మహబూబాబాద్: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య, రంగమ్మ(65) దంపతులకు ముగ్గురు కుమారులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుమారుడు మృతి చెందగా మరో ఇద్దరు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈక్రమంలో తండ సత్తయ్యకు మతిస్థితిమితం సరిగా లేకపోవడంతో ఏడు సంవత్సరాలుగా వైద్యం అందించారు. మాములు స్థితికి చేరిన సత్తయ్య తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం సత్తయ్య మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య రంగమ్మతో గొడవకు దిగి ఇంట్లో ఉన్న సుత్తితో మెడపై మోదీ హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా దుప్పట్లో చుట్టి మంచం పక్కన ఉంచాడు. ఉదయం ఎంతసేపటికీ రంగమ్మ లేవకపోవడంతో చుట్టుపక్కలవారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి రంగమ్మ విఘతజీవిగా పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది తొర్రూర్ డీఎస్పీ వెంకటేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘అమ్మో’ ఆ విషయం చెప్పను : అనసూయ
సీతంపేట: రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్లో ఒదిగిపోయి సినీ ప్రేక్షకుల మది దోచుకున్న అనసూయ భరద్వాజ్ శుక్రవారం సాయంత్రం నగరంలో సందడి చేశారు. గురుద్వార కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘మగువ’ బొటిక్‌ను ఆమె ప్రారంభించారు. అక్కడ డిస్ప్లే చేసిన కలెక్షన్ తిలకించిన అనంతరం మాట్లాడుతూ బొటిక్‌లో శారీస్, చుడీదార్స్, హ్యాండ్లూమ్ కలెక్షన్, హ్యాండ్‌బ్యాగ్స్, టాప్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. హైదరాబాద్ తర్వాత వైజాగ్ తనని బాగా ఎక్సైట్ చేసే ప్రదేశమని, అందుకే విశాఖ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘అమ్మో’ చెప్పను ప్రస్తుతం 5సినిమాలతో బాగా బిజీ గా ఉన్నానని అనసూయ చెప్పారు. ఎవరితో నటిస్తున్నారని అడగ్గా అమ్మో... చెప్పనని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల వద్ద సినిమాలు చేశానని, మరో ముగ్గురు దర్శకుల వద్ద సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ దర్శకుల పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. నా భర్తే ఫేవరెట్ హీరో ఏ హీరో ఇష్టమని అడగ్గా తన భర్త భరద్వాజ్ ఇష్టమని సమాధానమిచ్చారు అనసూయ. తనకు డ్రీమ్‌రోల్ అంటూ ఏమీ లేదని, రంగమ్మత్తలా మంచి క్యారెక్టర్స్‌తో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళ హీరోయిన్ అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. నా కోసం నిరీక్షిస్తున్న వారిని చూసి వైజాగ్‌లో నాకు చాలా మంది అభిమానులున్నారని ఈ రోజే తెలిసిందని మురిసిపోయారు. రంగమ్మత్తగా గుర్తింపు ఆనందాన్నిచ్చింది రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌తో మంచి పేరు వచ్చిందని, ఎక్కడకు వెళ్లినా రంగమ్మత్త అని పిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనసూయ. జబర్దస్త్ షోలో ఒకలా, రంగస్థలం సినిమాలో మరొకలా ఉన్నానని, ఇపుడు చాలా మంది తనను ప్రత్యేకంగా చూడటానికి ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు. -
సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్
-
హత్య కేసు నిందితుడి అరెస్టు
అగళి(మడకశిర): అగళి మండలం ఆర్.జి.పల్లిలో గొల్ల రంగమ్మ(35)ను హత్య చేసిన కేసులో అనుమనపల్లికి చెందిన పూజారి రంగప్పను మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ దేవానంద్ తెలిపారు. అగళి, రొళ్ల ఎస్ఐలు రాంబాబు, నాగన్న, అగళి ఏఎస్ఐ ఖలీల్‌బాషాతో కలసి నిందితుడ్ని మీడియా ఎదుట హాజరుపరిచారు. గొల్ల రంగమ్మను ఈ నెల 16న అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. హత్యకు గల కారణాలను నిందితుడు తమ విచారణలో అంగీకరించాడని సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం... రంగమ్మ భర్త మైసూర్లో గొర్రెల కాపరిగా పనికి కుదిరాడు. వారి కుమారుడు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న రంగమ్మ సైతం ఇటుకల తయారీకి వెళ్లేది. ఈ క్రమంలో అనుమనపల్లికి చెందిన పూజారి రంగప్పతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే కొన్నాళ్ల తరువాత మనసు మార్చుకున్న ఆమె అతన్ని దూరం ఉంచుతూ వచ్చింది. ఇక నుంచి రావొద్దంటూ ఆమె ఈ నెల 16న గట్టిగా చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన రంగప్ప బండరాయితో హత్య చేశాడు. ఆ తరువాత ఇంటిలోని బీరువాలో నుంచి రూ.30 వేల నగదు, చెవి కమ్మలను ఎత్తుకెళ్లాడు. హతురాలి కుమారుడు ఉమేశ్ ఫిర్యాదు మేరకు రంగప్పపై దృష్టి పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ హత్య తానే చేశానంటూ అంగీకరించాడని సీఐ తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల పాటు రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని వివరించారు. -
ఉసురు తీసిన విద్యుత్
కొలిమిగుండ్ల, న్యూస్‌లైన్ : పని చేస్తున్న చోటే మృత్యువు పొంచి ఉందని, అది ఆమెను కబలిస్తుందని ఎవరికి తెలుసు. ఆ ప్రాంతం మీదుగా మరోచోటుకు వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి తెగిపోవడం, సమీప ధోబీఘాట్‌లో బట్టలుతుకుతున్న ఓ మహిళ వాటికి బలి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మృత్యువొడి చేరేందుకేనన్నట్టు ధోబిఘాట్‌లోని మిగతా వారంతా భోజనం చేసి సేద తీరుతుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. కాసేపటికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి నడిపి నాగన్న భార్య రంగమ్మ (45) కులవృత్తి ద్వారా జీవనం సాగిస్తోంది. రోజులాగే ఆదివారం కూడా బట్టలుతికేందుకు స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని ధోబి ఘాట్‌కు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేసి సేదతీరుతుండగా రంగమ్మ అప్పుడే బట్టలుతికేందుకు ధోబీఘాట్లోకి దిగింది. ఇంతలో గ్రామ పొలాల్లో కొనుగోలు చేసిన శనగ పొట్టును జమ్మలమడుగు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ పాఠశాల సమీపానికి చేరగానే విద్యుత్ తీగలు తగిలి తెగిపడ్డాయి. సరిగ్గా తీగల కిందే ధోబీఘాట్‌లో రంగమ్మ ఉండడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు ట్రాక్టర్లో ఉన్నోళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపేయడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే తల్లి రంగమ్మ గిలాగిలా కొట్టుకుంటూ మరణించడాన్ని తట్టుకోలేక ఆమె కూతురు ఆర్తనాదాలు చేసింది. ఎస్ఐ రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తప్పిన ముప్పు.. తీగలు తెగిపడిన సమయంలో స్కూల్ బయట విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు అటు వెళ్లకుండా హెచ్ఎం సుంకన్న జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తీగలు కిందుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా ఒక నిండు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. రజకులందరూ పనిలో ఉన్నా, తరగతుల విరామ సమయంలో ఘటన జరిగి ఉన్నా ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు.