నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ పోలీసుల ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. హయత్నగర్ సమీపంలో పోలీసులమంటూ నలుగురు వ్యక్తులు పలువురి వద్ద నగదు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో స్థానికులు వారిని పట్టుకుని... దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.