breaking news
Rankers
-
3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తమపై జరుగుతున్న అసత్య ప్రచారం.. సంచలన ఆరోపణలపై తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్లు, వాళ్ల తల్లిదండ్రులు స్పందించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. రీవాల్యూయేషన్ పేరిట హైకోర్టు వీళ్ల ఆశలపై నీళ్లు చల్లని సంగతి తెలిసిందే. అదే సమయంలో రాజకీయంగానూ వీళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సుమారు 200 మంది అభ్యర్థులు, వాళ్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియలో అవకతవకలు, పేపర్ మూల్యాంకనంలో అక్రమాలు, రాజకీయ జోక్యం ఉన్నాయని ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగానికి రూ.3 కోట్ల చొప్పున రూ.1700 కోట్ల కుంభకోణం జరిగిందనే ప్రభుత్వం, రిక్రూట్మెంట్ బోర్డుపైనా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు.. మెయిన్స్ పరీక్షల వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయని, కొందరికి అసాధారణ ర్యాంకులు వచ్చాయని.. ఆఖరికి పరీక్ష రాయనివారికి కూడా ఫలితాలు ఇచ్చారని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ర్యాంకులు రద్దుచేస్తూ రీవాల్యూయేషన్ జరపాలని ఆదేశించింది.అయితే అప్పులు చేసి తమ పిల్లల్ని చదివించుకున్నామని.. అలాంటిది రూ.3 కోట్లు లంచాలు ఇచ్చి ఉద్యోగులు కొన్నామనే ప్రచారం తగదని తల్లిదండ్రులు వాపోయారు. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమలో కొందరికి తెలియదని అన్నారు ‘‘పస్తులుండి.. అప్పులు చేసి చదివించాం.. కష్టపడి మా పిల్లలు ఉద్యోగాలు సంపాదించారు. పేద విద్యార్థులే కష్టపడి గ్రూప్ 1ల్లో మెరిట్ ర్యాంకులు సాధించారు. రూ.3 కోట్లు చెల్లించి ఉద్యోగాలు కొనుగోలు చేశామనే ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం ఎంతగానో బాధిస్తోంది. అంత డబ్బే ఉంటే వేరే వ్యాపారాలు చేసుకునేవాళ్లం. నిరుద్యోగులు పెళ్లిళ్లు చేసుకోకుండా.. కొన్ని ఏళ్ల నుంచి చదువుకున్నారు. యూపీఎస్సీ పరీక్షల కోసం కాకుండా ఈ పరీక్ష కోసమే ప్రిపేర్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు అసత్య ఆరోపణలు మనోవేదనకు గురి చేస్తున్నాయి. రాజకీయాలు పార్టీల మధ్య ఉండాలి కానీ నిరుద్యోగులపై చూపించొద్దు. ఎన్నికల్లో ఓడితే మళ్లీ ఎన్నికలు పెట్టమని కోర్టులకెళ్తారా?. ఆరోపణలు చేస్తున్నవాళ్లు వాటిని నిరూపించాలి. వాటిపై ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. గ్రూప్-1ను ఇంకెంత కాలం నిర్వహిస్తారో రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టత ఇవ్వాలి. మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి.’’ అని ర్యాంకర్ల తల్లిదండ్రులు పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ‘‘ఉద్యోగ భర్తీ మీద రాజకీయాలు ఎందుకు?’’, ‘‘మూడు కోట్లు ఎక్కడ?’’ అంటూ పలు ఫ్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలియజేశారు.xహైకోర్టులో ఏం జరిగింది?మెయిన్స్ వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయన్న వాదనలతో హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏకీభవించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్లను తిరిగి రీవాల్యూయేషన్ చేయాలని, ఈసారి అవకతవకలు లేకుండా చూడాలని, మళ్లీ అవకతవకలు జరిగినట్లు తేలితే ఊరుకోబోమని.. మళ్లీ పరీక్షకు తామే ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 8 నెలల్లోగా రీవాల్యూయేషన్ ప్రకక్రియ పూర్తి చేయాలని, అలాకాని పక్షంలో మళ్లీ పరీక్ష నిర్వహించే దిశగా ఆలోచనలు చేయాలని సూచించింది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30న ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచింది. కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు, పత్రాల పరిశీలన, విశ్లేషణ అనంతరం మంగళవారం 222 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. అయితే.. కష్టపడి చదివిన తమ శ్రమ వృధా అవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు ర్యాంకర్లు హైకోర్టు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన యూపీఎస్సీ(సీఎస్ఈ) ర్యాంకర్లు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూపీఎస్సీ(సీఎస్ఈ) 2022 ర్యాంకర్లు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా యూపీఎస్ఈ ర్యాంకర్లను సీఎం జగన్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం సూచించారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ -
ఉత్తమ ఫలితాలు తెచ్చుకున్న విద్యార్థులు , ఉఫాధ్యాలులకి సత్కారం
-
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
నా విజయం వెనుక చాలామంది కృషి ఉంది : సివిల్స్ 20 వ ర్యాంకర్
-
ఎంసెట్‌లో మెరిసిన పల్లె కుసుమాలు
హుజూరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ శనివారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో హుజూరాబాద్ విద్యార్థులు రాష్ట్ర్రస్థాయి ర్యాంకులు సా«ధించి మండలానికి పేరు తెచ్చారు. మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మండల అభిషేక్ 783 ర్యాంక్ సాధించగా, పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన బోయినపల్లి అనూప్‌రావు 910 ర్యాంక్ సాధించాడు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులిద్దరూ గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం. పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం పాఠశాల్లో పదో తరగతి పూర్తి చేసి.. ఉన్నత చదవుల కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించి భవిష్యత్తులో ఏ కావాలనుకుంటున్నారో వారి మాటల్లోనే.. తల్లిదండ్రుల సహకారంతోనే అధ్యాపకులు, తల్లిదండ్రులు సహాదేవ్–వసంత సహకారంతో ఎంసెట్‌లో 783 రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాను. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి మంచి ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. – మండల అభిషేక్, 783 ర్యాంక్ మెకానికల్ ఇంజినీర్ లక్ష్యం అధ్యాపకులు, తల్లిదండ్రులు ఉమాపతిరావు–నవ్యశ్రీ సూచనలు అనుసరిస్తూ 910 రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించా. మెకానికల్ ఇంజినీర్‌గా రాణించి దేశానికి సేవలందించాలని భావిస్తున్నాను. – బోయినపల్లి అనుప్‌రావు, 910 ర్యాంక్ మొగిలిపేట విద్యార్థికి 813 ర్యాంకు మల్లాపూర్(కోరుట్ల): తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట విద్యార్థిని ర్యాగల్ల మనీషా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 813 ర్యాంకు సాధించింది. మొగిలిపేటకు చెందిన ర్యాగల్ల వెంకటేశ్వర్–గౌతమి దంపతుల ఏకైక కుమార్తె మనీషా మెట్‌పల్లిలోని ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతిలో 9.8 జీపీఏ, కరీంనగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో ఇంటర్మీడియేట్‌లో భైపీసీలో 984 మార్కులతో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. ఎంసెట్ ఫలితాల్లో మనీషా రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చడంతో ఎంపీపీ బద్దం విజయ, జెడ్పీటీసీ దేవ ముత్తమ్మ, తహసీల్దార్ రాజేశ్వర్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, ఎస్సై సతీశ్, ఆర్ఎస్ఎస్ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మండల అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఉసికెల మల్లవ్వ, ఎంపీటీసీ దండవేని వెంకవ్వ, ఉపసర్పంచ్ ఎనడ్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హర్షం వ్యక్తంచేసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభచూపిన హర్షవర్ధ్దన్ మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ ఎల్మి ప్రదీప్ కుమారుడు హర్షవర్దన్ శనివారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 355 ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్ 1 నుంచి 5 తరగతి వరకు స్థానిక జయ కాన్వెంట్ స్కూల్లో చదివాడు. 6 తరగతికి జవహర్ నవోదయకు ఎంపికయ్యాడు. అందులోనే 10 తరగతి వరకు చదివి అనంతరం హైదరాబాద్ నారాయణ కళాశాల నుంచి ఇంటర్ (ఎంపీసీ) పూర్తి చేశాడు. తర్వాత ఐఐటీ(జేఈఈ) ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యాడు. కొన్ని రోజుల క్రితం జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1348 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఎంసెట్ ఫలితాల్లో 355 ర్యాంకు పొందాడు. ప్రతిభచూపిన హర్షవర్దన్‌ను పలువురు అభినందించారు. సత్తాచాటిన జైహింద్‌రెడ్డి మల్యాల (చొప్పదండి) : మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల మహిపాల్‌రెడ్డి కుమారుడు నల్ల జైహింద్‌రెడ్డి ఎంసెట్‌లో 63 ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చొప్పదండి నవోదయ పాఠశాలలో చదివిన జైహింద్ ఇంటర్మీడియేట్ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి అభినందించారు. -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్ జిల్లాకు పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను ముఖ్యమంత్రి అభినందించారు. 9 ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యశర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా సీఎం అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా తెలంగాణ విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రభుత్వ పరంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను తెలంగాణలోని హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని సీఎం పిలుపునిచ్చారు. -
సివిల్స్ విజేతలతో కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన విజేతలు బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన వారిని కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల అకాంక్షల వంటి అంశాల మీద తన అలోచనలను కేటీఆర్ వారితో చర్చించారు. సూమారు 20 మంది సివిల్ ర్యాంకర్లు మంత్రితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధించిన మీకు ఇక ఉద్యోగమే అసలైన పరీక్షలా ఉంటుందన్నారు. ముఖ్యంగా అధికారులుగా ప్రజల అకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలని కోరారు. పరిపాలనలో అనేక ఒడిదుడుకులుంటాయని, ఎప్పడూ తమ ఆశయాన్ని వదులుకోవద్దన్నారు. ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి మిమ్మల్ని ఉద్యోగంలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఉద్యోగ ప్రయాణంలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురవుతాయన్నారు. కానీ, తొలినాళ్లలో ఉన్న స్తూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లుకు దూరంగా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని హితవుపలికారు. ప్రజల భాగసామ్యంతో పనిచేస్తూ, వారిలో సమిష్టి తత్వం నెలకొల్పేలా అనేక కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కోరారు. చాల సందర్భాల్లో పరిపాలనలో నిధులకన్నా, మంచి అలోచనలతో చేసే పనులకు ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా పనిచేయాలని కోరారు. మంత్రిని కలవడం పట్ల ర్యాంకర్లు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చిన సలహాలు సూచనలు తమకి సరికొత్త దిశానిర్ధేశం చేశాయన్నారు. ప్రజలకోసం పనిచేయాలనే తమ అలోచనలకి మరింత ఊతం ఇచ్చాయన్నారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్ష ప్రిపేరేషన్ కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి వారి సలహాలను తీసుకెళ్తానని మంత్రి హమీ ఇచ్చారు. -
10వేల వరకూ ఫీజ్ రియింబర్స్‌మెంట్
-
వ్యవసాయ కోర్సుల కౌన్సెలింగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ గురువారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. మొదటి రోజు 556 మందిని పిలువగా 147 మంది హాజరయ్యారు. రానివారు మెడిసిన్‌లో సీట్లు పొంది ఉండొచ్చని అధికారులు చెప్పారు. మొదటి సీటు 2501 ర్యాంకు పొందిన డి.ప్రణతీరెడ్డి వెటర్నరీ కళాశాలలో ప్రవేశం లభించింది. అలాగే 2551 ర్యాంకు సందీప్ భరద్వాజ్, 2561 ర్యాంకు రవిశంకర్‌రెడ్డిలు కూడా అదే కళాశాలలో సీట్లు పొందారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ అధికారులు డాక్టర్ టి.వి.సత్యనారాయణ, డాక్టర్ టి.రమేష్‌బాబు, డాక్టర్ శివశంకర్, డాక్టర్ రావూరి రాఘవయ్య, డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌన్సెలింగ్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. -
అందరి దృష్టి ఐఐటీ ముంబైపైనే!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన అందరు విద్యార్థుల లక్ష్యం ముంబై ఐఐటీలో చేరడమే. అందులోనూ కంప్యూటర్ సైన్స్‌లో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అందులోనూ చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలను పెడతామని పేర్కొనగా కొంతమంది సివిల్స్ సర్వీసెస్, రొబోటిక్స్‌లో పరిశోధన తమ లక్ష్యాలని తెలిపారు. ఐఐటీలో ర్యాంకు సాధించడానికి తాము రోజూ 10 నుంచి 12 గంటలు చదివామని వివరించారు. పలువురు ర్యాంకర్ల అభిప్రాయాలివీ.. సివిల్స్ నా జీవిత లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధించడమే నా జీవిత లక్ష్యం. మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని కొందుర్గు మండలంలోని ముత్పూర్ గ్రామం. చాలా వెనుకబడిన ప్రాంతం. సివిల్స్ సాధించడం వల్ల మా గ్రామాల్లాంటివాటిని అభివృద్ధి చేయవచ్చు. అయితే ముందు గా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. తరువాత సివిల్స్‌పై దృష్టి పెడతా. నాన్న సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అమ్మ నిర్మల టీచర్. - చింతకింది సాయిచేతన్, రెండో ర్యాంకర్, మహబూబ్‌నగర్ రొబోటిక్స్‌లో పరిశోధన చేస్తా రొబోటిక్స్‌లో పరిశోధన చేయడమే జీవిత లక్ష్యం. ముందుగా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. మాది చిత్తూరు జిల్లా తిరుపతి పక్కనున్న పుత్తూరు. నాన్న సురేష్ ఎయిర్‌ఫోర్స్‌లో వారెంట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సుధారాణి టీచర్. - రావూరు లోహిత్, 4వ ర్యాంకర్, చిత్తూరు ప్రతిభావంతులకు ఉపాధి కల్పిస్తా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో చేరుతా. నాన్న సురేష్‌బాబు పారిశ్రామికవేత్త. అమ్మ రాధ కూడా వ్యాపారం చేస్తారు. - సి.జయత్ శంకర్, 5వ ర్యాంకర్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీనే లక్ష్యం ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను. సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపిస్తా. ఆ రంగంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నదే లక్ష్యం. నాన్న నారాయణరావు సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. అమ్మ దీప గృహిణి. - నందిగం పవన్‌కుమార్, 9వ ర్యాంకర్, రంగారెడ్డి ఉపాధి అవకాశాలు పెంచుతా సొంతంగా కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాను. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరుతా. నాన్న వెంకట్‌రెడ్డి వ్యాపారవేత్త. అమ్మ వనిత గృహిణి. - వి.యశ్వంత్‌రెడ్డి, 10వ ర్యాంకర్, నల్లగొండ(హైదరాబాద్‌లో స్థిరపడ్డారు) మంచి పేరు తెచ్చుకుంటా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాను. త్వరలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటా. నాన్న తిరుపాల్‌రెడ్డి డాక్టర్. అమ్మ ఉమాదేవి కూడా డాక్టరే. - కె.ఉదయ్, 11వ ర్యాంకర్, కర్నూలు సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా. తద్వారా ప్రతిభావంతులకు ఉపాధి కల్పించాల న్నదే నా లక్ష్యం. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. నాన్న ఆదినారాయణరెడ్డి దూరదర్శన్‌లో ఉద్యోగి. అమ్మ సుభద్రాదేవి గృహిణి. - ఎన్.దివాకర్‌రెడ్డి, 12వ ర్యాంకర్, కర్నూలు ముందుగా జాబ్ చేస్తా బీటెక్ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగం చేస్తా. ఆ అనుభవంతో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభిస్తా. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. మాది తూర్పుగోదావరిజిల్లా ప్రత్తిపాడు. నాన్న వెంకటరమణ ఫ్యాన్సీ స్టోర్స్ చూస్తారు. అమ్మ విజయలక్ష్మి గృహిణి. - కె.వీరవెంకటసతీష్, 14వ ర్యాంకర్, తూర్పుగోదావరి -
ఎంసెట్ ర్యాంకర్లు
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సాయంత్రం ఇక్కడ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలలో ర్యాంకర్ల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. మెడిసిన్‌లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు: మొదటి ర్యాంక్ - గుర్రం సాయి శ్రీనివాసులు - ప్రకాశం జిల్లా మార్కాపురం రెండవ ర్యాంక్ - డి.దివ్య - నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మూడవ ర్యాంక్ - కందికొండ పృధ్వీరాజ్ - హైదరాబాద్ 4వ ర్యాంక్ - దారవనేని హరిత - గుంటూరు 5వ ర్యాంక్ - ఉరుబండి మనోజ్ఞిత - విజయవాడ 6వ ర్యాంక్ - తేగు భరత్‌కుమార్ - ఖమ్మం 7వ ర్యాంక్ - పట్టినపు శ్రీదివ్య - విశాఖ 8వ ర్యాంక్ - సాత్విక్ గంగిరెడ్డి - హైదరాబాద్ 9వ ర్యాంక్ - రాయల సాయి హర్షతేజ - ఖమ్మం 10వ ర్యాంక్ - గంటా సాయి నిఖిల -గుంటూరు జిల్లా తెనాలి ఇంజనీరింగ్‌లో మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులు: ఫస్ట్ ర్యాంక్ - పవన్ కుమార్ - హైదరాబాద్ సెకండ్ ర్యాంక్ - చాణక్యవర్ధన్‌రెడ్డి - హైదరాబాద్ మూడో ర్యాంక్ - నిఖిల్‌కుమార్ నాలుగో ర్యాంక్ - దివాకర్‌రెడ్డి ఐదో ర్యాంక్ - ఆదిత్యవర్ధన్