మల్లెల ఓం ప్రకాష్‌కు కట్టుదిట్ట భద్రత
కేజీహెచ్ : మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీనును అనంతపురం జిల్లా రాప్తాడు జైల్లో మట్టుబెట్టిన కేసులో ముద్దారుు అరుున మల్లెల ఓం ప్రకాష్‌కు పోలీస్ యంత్రాంగం భద్రతను కట్టు దిట్టం చేసింది. మూడు నెలలుగా విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంటున్న ఓం ప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో డయాలసిస్ కోసం కేజీహెచ్‌కు బుధ, శనివారాల్లో తీసుకువస్తున్నారు.
జైలు నుంచి భారీ భద్రత మధ్య ఆయనను కేజీహెచ్‌కు తీసుకురావాల్సి ఉంది. అరుుతే పోలీసులు, ముద్దాయి అన్న తేడా లేకుండా కలసిమెలసి, చెట్టపట్టాలు వేసుకొని కేజీహెచ్‌కు ఓం ప్రకాష్‌ను తీసుకు వస్తుండడంపై ‘సాక్షి’ బృందం కొన్ని రోజుల పాటు నిఘా వేసింది. మల్లెల ఓం ప్రకాష్, ఆయన రక్షణ కోసం వస్తున్న పోలీసుల తీరును ప్రత్యేక కథనం ద్వారా ఎండగట్టింది. ‘ముద్దాయి అయినా.. మల్లెల మజా’ పేరిట ఈనెల 6న ప్రచురితమైన కథనం పోలీస్ యంత్రాంగంలో వణుకు పుట్టించింది.
అప్రమత్తమై డయాలసిస్‌కు వస్తున్న మల్లెల ఓం ప్రకాష్‌ను భద్రతను కట్టుదిట్టం చేసింది. మప్తీలో వచ్చిన పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఏఆర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను రక్షణగా నియమించింది. ప్రతి బుధ, శనివారాల్లో ఆయుధాల సహాయంతో రక్షణ కల్పించి, ఆయనను కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారు.