నా భర్తకు ఎంతోమందితో ఎఫైర్లు.. నేనే లాస్ట్: నటి
సినిమా ఇండస్ట్రీలో లవ్ బ్రేకప్‌లు సర్వసాధారణం. చాలామంది సెలబ్రిటీలు ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడినవారే! ఆ లిస్టులో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఉన్నాడు. అయితే అతడికి బోలెడన్ని ప్రేమకథలు ఉండవచ్చేమో కానీ చివరిగా ప్రేమించింది, ప్రేమిస్తోంది మాత్రం తననే అంటోంది నటి రత్న పాఠక్ షా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమాలో కలిసి నటించాం. అప్పుడే మేమిద్దరం కలిసుండాలని నిర్ణయించుకున్నాం. నిజంగా, మేమెంత పిచ్చివాళ్లమంటే? ఒకరి గురించి మరొకరు పెద్దగా ఏమీ ఆరా తీయలేదు. కలిసుండాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నామంతే!
పెళ్లి, ఎఫైర్లు.. చరిత్రే ఉంది
అతడి గతం గురించి నేనసలు పట్టించుకోలేదు.. ఎందుకంటే నేను ఆ సమయంలో అతడి మీద పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆయన చాలాకాలం క్రితమే మొదటి భార్యతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పెళ్లి ఒక్కటే కాదు, అతడికి గతంలో చాలా ఎఫైర్లు ఉన్నాయి. అదంతా ఒక చరిత్రలా అనిపిస్తుంది. ఆయన చివరగా ప్రేమించింది నన్నే.. ఆయన జీవితంలోకి ప్రవేశించాక నేను మాత్రమే ఉన్నాను.. అది చాలనిపించింది. పెళ్లి చేసుకున్నాం. తర్వాత హనీమూన్‌కు కూడా వెళ్లాం. హనీమూన్‌కు వెళ్లొచ్చాక నసీరుద్దీన్ షా.. జానే బీ దో యారో సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు.
పెళ్లికి ఒప్పుకోని పేరెంట్స్
అప్పుడు రెండుమూడు రోజుల తర్వాత కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. తను బతికున్నాడా? లేదా? ఎవరితోనైనా పారిపోయాడా?(నవ్వుతూ) అనేది కూడా తెలిసేది కాదు' అని చెప్పుకొచ్చింది రత్నపాఠక్ షా. కాగా నసీరుద్దీన్‌షా, రత్నపాఠక్ షా 1982లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మొదట రత్న పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటికే అతడు ఒకసారి పెళ్లి చేసుకుని భార్యను వదిలేయడంతో పాటు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దీంతో అతడిని అల్లుడిగా అంగీకరించడానికి రత్న కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయితే వారు ప్రేమ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో చివరకు వారి సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నారు.
చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి సీరియల్ నటి.. అత్యధిక పారితోషికం ఆమెకే..