ఎంత గొడవపడ్డా సరే అక్కాచెల్లెళ్లు వెంటనే కలిసిపోతారు. అయితే వారి మధ్య పోట్లాటలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఒకరు హైపర్ అయిపోతే మరొకరేమో అన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి రత్న పాఠక్ షా మొదటి రకం. తన సోదరిని ఎమోషనల్‌గా టార్చర్ పెట్టిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది.
రౌడీలా ప్రవర్తించా
'సుప్రియ అక్క, నేను చిన్నగా ఉన్నప్పుడు తెగ పోట్లాడుకునేవాళ్లం. తనకు నేను మంచి చెల్లినైతే కాదు. ఒక రౌడీలా ప్రవర్తించేదాన్ని. ఏది పడితే అది అనేసి బాధపెట్టేదాన్ని. అది గుర్తు చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. తన మనసును బాధపెట్టినందుకు ఆమెకు సారీ చెప్పాను. తను నన్ను క్షమించిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాం' అని తెలిపింది.
అందంగా లేనేమోనని
సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నేనంత అందంగా లేనేమోనని భయపడేదాన్ని. నా పళ్లు, పెదాలు బాగోవని.. అలాగే నా కళ్లు కూడా అంత పెద్దవి కావని ఫీలయ్యేదాన్ని. కానీ సుప్రితకు అందమైన కళ్లుండేవి. అలా అని తను నాకన్నా అందంగా ఉందని నేనేమీ ఈర్ష్య పడేదాన్ని కాదు. నా ప్రవర్తన, క్రమశిక్షణ, టాలెంట్‌పై ఫోకస్ పెట్టేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ 2023లో వచ్చిన ధక్ ధక్ అనే సినిమాలో చివరిసారిగా నటించింది. సుప్రియ పాఠక్.. సత్యప్రేమ్‌కీ కథ చిత్రంలో మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment