కంప్యూటరీకరణతో సేవలు వేగవంతం
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
కరీంనగర్‌అగ్రికల్చర్ :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణతో సేవలు వేగవంతమవుతున్నాయని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుస్నాబాద్, గట్టుదుద్దెనపల్లి, చొప్పదండి, గంభీరావుపేట, రాయికల్, సుల్తానాబాద్ సంఘాల కంప్యూటరీకరణ సేవలు, అభివృద్ధిపై శనివారం సమీక్షించారు. హైదరాబాద్ నుంచి టెస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సురేందర్, సీఐవో ఎం.శ్రీనివాస్‌రావు, జిల్లా నుంచి డీసీవో అంబయ్య, డీఏసీవో చంద్రప్రకాశ్ సమీక్షించారు. త్వరలోనే మరిన్ని సంఘాలను కంప్యూటరీకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మెుక్కలు నాటారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, సీఈవో ఎన్.సత్యనారాయణ, డీజీఎంలు నారాయణ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.