Ravindra Bharathi Auditorium
-
రవీంద్రభారతిలో అలరించిన శ్రీకృష్ణ లీలామృతం (ఫొటోలు)
-
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కాకతీయం నృత్య రూపకం (ఫొటోలు)
-
దీర్ఘ కవితల నుండి దీర్ఘ కావ్యం దాకా...
‘తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులు.’ – (జూలూరు పథం: పుట 43) తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు 20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి), ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం. ‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది. తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్. కవి, కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట. ‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్ 31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్, కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’ వ్యాసకర్త సాహితీ విమర్శకులు (రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ) -
రవీంద్రభారతి : దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్యరూపకం (ఫొటోలు)
-
ఆకట్టుకున్న ఊరు భంగం నాటకం
గన్‌ఫౌండ్రీ: నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. రసరంజని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఊరు భంగం అనే నాటకం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందన్నారు. రసరంజని సంస్థ ప్రతినిధులు, నాటక ప్రియులు పాల్గొన్నారు. -
అంతరంగ్... నాట్య తరంగ్
-
రమణీయం.. రామాయణం
-
అభినయం.. అద్వితీయం
-
శ్రీ శారదా నృత్య నికేతన్ 24వ వార్షికోత్సవం
-
ముగిసిన నాటకోత్సవాలు
-
మోరియా...ఓ ధీర వనిత గాథ
-
మంత్రముగ్ధుల్ని చేసిన నారీ నృత్యరూపకం
-
నృత్య మనోహరం
-
భారతం డయనోరారంగ
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 1995లో జరిగిన ద్విశతావధానంలో అవధాని మాడుగుల నాగఫణిశర్మను ఓ పృచ్ఛకుడు దత్తపదిలో భాగంగా ఒనిడా, డయనోరా, ఆస్కార్, ఆప్టానికా పదాలతో భారతార్థంలో ఓ పద్యం చెప్పమని కోరారు. అప్పుడు– అరణ్య, అజ్ఞాతవాసాలను పూర్తి చేసిన తరువాత శ్రీకృష్ణుడు కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రునితో జరిపిన సంభాషణలో భాగంగా ఈ పదాలను ఉపయోగించి నాగఫణిశర్మ ఈ పద్యం చెప్పారు. ఓ నీడా! నిను చూచి తీపి కలిగెన్ యుద్ధోద్యమ ప్రక్రియన్ _ హానిం గూర్చెడు నీ కుమారుడయ నోరారంగ కానందంబు ఘటించు యుద్ధమున కాస్కారంబు లేకున్నచో _ నీవా యుద్ధము నాపటానికా నిదానింపంగబో కౌరవా! ఓ కురుశ్రేష్ఠా, నీవు నీడలాంటివాడవు. ఛాయామాత్రుడివి. నీ పుత్రుని మీద తీపితో ఎలా చెబితే అలా వింటున్నావు. నేను నోరారా చెబుతున్నాను. నీ కుమారుడు నీకే కాదు, తనకే కాదు, యావత్ సామ్రాజ్యానికీ ప్రజలకూ చెడు చేస్తున్నాడు. యుద్ధానికి ఆస్కారం లేకుండా ఆపటానికి ప్రయత్నిస్తే నీకు ఆనందాన్ని కలిగిస్తాను, అంటాడు కృష్ణుడు.ఈ పద్యాన్ని ఆస్వాదించిన ఆహూతులంతా కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పంపినవారు: వాండ్రంగి కొండలరావు -
ఉనికి చాటడంలో డైరీ ఆవిష్కరణలు తోడ్పడ్డాయి: మంత్రి
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఉనికి చాటడంలో డైరీ ఆవిష్కరణలు తోడ్పడ్డాయని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి అందరినీ ఒక చోట కలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కలిసి పనిచేయటం వల్లే కొత్త రాష్ట్రం అభివృద్దిలో దూసుకెళుతోందన్నారు. తన శాఖ ఉద్యోగుల పనితీరు కృషి కారణంగా దేశంలోనే నెంబర్ వన్‌గా కొనసాగుతోందన్నారు. కేసీఆర్ కిట్స్‌తో డాక్టర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఓపీ మూడు నాలుగు వంతులు పెరిగినా వైద్యులు , సిబ్బంది నిబద్దతతో పనిచేస్తున్నారని చెప్పారు. హెల్త్ కార్డులతో ఉద్యోగులకు కార్పోరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. పరిపాలనలో కూడా విజయం సాధించామన్నారు. తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారం చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారని, సమస్యలన్నీ పరిష్కరించుకుని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తామని వ్యాఖ్యానించారు. -
రవీంద్ర భారతిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సాంస్కృతిక కళావేదిక రవీంద్రభారతిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆడిటోరియంలోని వేదిక వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేజ్‌పై ఉన్న స్పీకర్లు, వైర్లు, సెట్టింగ్ లైట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటుతో దేశ స్థితిగతుల్లో మార్పు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా దేశ స్థితిగతుల్లో మార్పుతేవచ్చని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కంటే ఓటు హక్కు వినియోగించుకొని సమర్థులను పాలకులుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కులం, మతం, జాతి, వర్గం, భాష తేడాలు లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీ జీపీ అనురాగ్‌శర్మ, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి అనూప్‌సింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అదనపు కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్నవారిలో డీజీపీ అనురాగ్‌శర్మ, ఎ.బాబు (ఆదిలాబాద్), డీఎస్ లోకేశ్‌కుమార్ (అనంతపురం), జి.కిషన్ (వరంగల్), కాంతిలాల్ దండే (విజయనగరం), జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ (ప్రకాశం), బి.శ్రీనివాస్ (పోలీసు కమిషనర్-విజయవాడ), డి.నాగేంద్రకుమార్ (మహబూబ్‌నగర్), నవదీప్‌సింగ్(నెల్లూరు), వీఎస్కే కౌముది (అదనపు డీఐజీ-ఎల్ఆర్), హరీశ్‌గుప్తా (ఐజీ), ఎం.రమేశ్ (ఏఐజీ) తదితరులున్నారు.