
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సాంస్కృతిక కళావేదిక రవీంద్రభారతిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆడిటోరియంలోని వేదిక వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేజ్‌పై ఉన్న స్పీకర్లు, వైర్లు, సెట్టింగ్ లైట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.