శ్రమ దోపిడీకి గ్రీన్ సిగ్నల్
రాయదుర్గం మున్సిపాలిటీలో 279 జీఓ అమలుకు ఆమోదం
ఔట్సోర్సింగ్ స్థానంలో వర్క్డ్ సోర్స్
కార్మికులను వెంటాడుతున్న బానిసత్వ భయం
రాయదుర్గంటౌన్ : మునిసిపల్ కార్మికు లు ఒళ్లు వంచి పని చేయడం లేదనే సా కుతో పనుల నిర్వహణను ప్రైవేటు సం స్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమైంది. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వర్క్డ్ సోర్సింగ్ విధానంతో పని చేయించాలని జీఓ 279 విడుదల చేసింది. ఈ జీవో శ్రమదోపిడీకి లైసెన్సు అని కార్మికులు మండిపడుతున్నారు. తా ము కాంట్రాక్టర్ల కింద బానిసలు గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నా రు. పారిశుద్ధ్యం మెరుగు పేరిట యూజర్ చార్జీల పేరుతో ప్రజల పై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సర్వత్రా అం సంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే రాయదుర్గం లో మాత్రం 279 జీఓ అమలుకు ఆమో దం లభించింది. ఇప్పటికే సాంకేతికపరమైన అనుమతి కూడా మంజూరైంది.
కాంట్రాక్ట్ కార్మికులు 1,418 మంది
జిల్లా వ్యాప్తంగా అనంతపురం కార్పొరేష¯ŒSతోపాటు 11 మునిసిపాలిటీల్లో మొత్తం 1,418 మంది కాంట్రాక్ట్ కార్మికులు పబ్లిక్ హెల్త్ సెక్ష¯ŒS కింద పనిచేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులతో పోలిస్తే దాదాపు సగం మంది కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు. కొత్త ఉద్యోగాల నియామకం లేకపోగా చనిపోయిన వారి కార్మికుల పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగుల వారసుల్లో చాలామంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కిందనే కొనసాగుతున్నారు. అనంతపురం కార్పొరేష¯ŒSలో 401 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండగా, ధర్మవరంలో 140, గుంతకల్లులో 120, గుత్తిలో 80, పామిడిలో 37, తాడిపత్రిలో 120, హిందూపురంలో 220, మడకశిరలో 50, కళ్యాణదుర్గంలో 60, పుట్టపర్తిలో 80, రాయదుర్గంలో 60, కదిరిలో 110 మంది ఉన్నారు.
కార్మికులకు కీడు చేస్తుంది
జీఓ 279 అమలు వల్ల కాంట్రాక్ట్ కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కోల్పో యే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ల చెప్పుచేత ల్లో నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కార్మికులకు కీడు చేసే ఈ జీవోను ప్రభు త్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
– వెంకటేశులు, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షుడు, రాయదుర్గం మునిసిపాలిటీ
శ్రమ దోపిడీనే
జీఓ అమలు వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. వారి శ్ర మను కాంట్రాక్టర్లు దోచుకుంటారు. ఈ జీవోను అమలు పరచ డం ద్వారా ప్రధానంగా స్థానిక సంస్థల అధికారాలను బలహీన పరచి ప్రజలపై యూజర్ చార్జీల భారం మోపడానికి అవకాశం ఉంది.
– వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి