rayalaseema development forum
-
29 గ్రామాల కోసం రాష్ట్రం బలి కావాలా?
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): గతంలో జరిగిన తప్పుల వల్ల తీవ్రంగా నష్టపోయామని, భవిష్యత్‌లో అలాంటి వాటికి అవకాశం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది. వేదిక ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు పరిపాలన వికేంద్రీకరణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ సమానంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. స్వీయ ప్రయోజనాలు, 29 గ్రామాల కోసం ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రాన్ని బలి కోరుతోందని మండిపడ్డారు. కేవలం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోదని 13 జిల్లాలు పురోగమించాలని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ కోసం తిరుపతి వేదికగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని, మహా పాదయాత్ర చేపట్టేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న పరిపాలన వికేంద్రీకరణ బిల్లులో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజధానిలో సింహభాగం ఇవ్వాలని, సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అవసరాలు, ఆకాంక్షలను తెలియజేసేందుకే సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎస్డీహెచ్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ తిప్పారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ప్రముఖ రచయిత్రి మస్తానమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సభలో అభివాదం చేస్తున్న రాయలసీమ అభివృద్ధి సంఘల సమన్వయ వేదిక నాయకులు రియల్ ఎస్టేట్ సమస్యగా అమరావతి మూడు రాజధానుల ప్రకటన వల్ల వివాదం ప్రారంభం కాలేదు. గత సర్కారు రాజధాని కోసం అమరావతి రైతుల భూములు లాక్కోవడంతోనే సమస్య మొదలైంది. రాజధాని అంశం ప్రస్తుతం రైతుల సమస్య కాకుండా రియల్ ఎస్టేట్ సమస్యగా మారింది. 29 గ్రామాల ప్రజలు అమరావతిని ఏకైక రాజధానిగా డిమాండ్ చేయడమంటే మిగిలిన నాలుగు కోట్ల మందిని అవమానించడమే. వికేంద్రీకరణ కొత్తది కాదు. 1953లో శ్రీభాగ్ ఒప్పందంలోనే ఆ విషయం ఉంది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వికేంద్రీకరణ బిల్లులో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో మరో రాజధానిని చేర్చడం మినహా కొత్త అంశం లేదు. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర కలసి పనిచేయాలి. అమరావతి రైతులు రాజధాని కోసం కాకుండా తమ భూముల పరిహారం కోసం అడగాలి. వారికి రాజధానిని అడిగే నైతిక హక్కు లేదు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి. అమరావతి ఏకైక రాజధాని డిమాండ్‌ను విడనాడకుంటే తిరుపతి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతాం. వికేంద్రీకరణ కోసం పాదయాత్రలు చేస్తాం. – భూమన్, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు కొత్త నగరం అనవసరం రాయలసీమ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదులకు ముఖద్వారం అయినప్పటికీ నీటి ప్రయోజనాలను పొందలేకపోతున్నాం. ఏటా 600 నుంచి 700 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. దీన్ని వినియోగించుకుంటే సీమ సస్యశ్యామలవుతుంది. రాష్ట్రంలో అనేక నగరాలు ఉండగా అమరావతి పేరిట కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడం అనవసరం. ప్రపంచంలో కొత్త నగరాల ప్రాజెక్టులు విఫలమయ్యాయి. అమరావతి కోసం వెచ్చించే నిధులతో ఇతర నగరాలను అభివృద్ధి చేయాలి. సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలి. సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రా«ధాన్యం ఇవ్వాలి. కొందరు రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర, రాయలసీమ మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. వికేంద్రీకరణ బిల్లులో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలి. – మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త చరిత్రను వక్రీకరించొద్దు రాయలసీమ ప్రజలు అనాదిగా చేసిన త్యాగాలను చరిత్ర మరువదు. చరిత్రను వక్రీకరించడం దుర్మార్గం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు రాయలసీమ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. విశాలాంధ్ర కోసం రాజధానిగా ఉన్న కర్నూలును వదులుకున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి ప్రజల మద్దతు ఉంది. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సంఘ నాయకుడు వెంకన్ననూ వదలరు.. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధానే. దీని వెనుక వ్యక్తిగత అజెండా దాగి ఉంది. మూడు రాజధానుల్లో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. అమరావతి వాసుల కోరికలు తీరుస్తూపోతే తిరుమల వెంకన్నను కూడా తమ ప్రాంతానికి తరలించుకెళ్తారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన మాదిరిగా కొందరు నాయకులు రాయలసీమకు ద్రోహం తలపెట్టడం దుర్మార్గం. – శాంతి నారాయణ, రాయలసీమ మహాసభ అధ్యక్షుడు ఆస్తి అంతా ఒక్కరికే ఇవ్వమంటున్నారు.. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఆస్తిని సమానంగా పంచకుండా ఒకరికే ఇవ్వాలనే మాదిరిగా అమరావతి వాసుల కోర్కెలు ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. అమరావతిని సమర్థించే కొందరు సీమ నాయకులు తమ మనసు మార్చుకోవాలి. – బండి నారాయణస్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అన్నీ అమరావతికే తరలించారు.. హెచ్‌సీఎల్ సంస్థ తిరుపతిలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే మాజీ సీఎం చంద్రబాబు అమరావతికి తరలించారు. అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్‌ను కూడా అమరావతికే తరలించారు. జీవో 120 ద్వారా పద్మావతి మెడికల్ కళాశాల సీట్లను రాయలసీమ వాసులకు దక్కకుండా చేశారు. సీమ వెనుకబాటుతనం పోవాలంటే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలి. – శ్రీకంఠరెడ్డి, రాయలసీమ అధ్యయన వేదిక నాయకుడు పెద్దన్న పాత్ర పోషించండి.. రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. సీమ నాయకులు పెద్దన్న పాత్ర పోషించి ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి. – ఎంఆర్ఎన్ వర్మ, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్ అధ్యక్షుడు న్యాయవాదులకు తిప్పలు.. అమరావతి ప్రాంతంలో హైకోర్టు ఆవరణలో నీరు, ఆహారం, ఇళ్లు లేక న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు. – శివారెడ్డి, హైకోర్టు న్యాయవాది చరిత్రలో నిలుస్తుంది... ఎన్నో ఏళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోతున్నారు. సీఎం జగన్ తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది. – సురేష్, డ్రీమ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ మూడుకే మా మద్దతు మేం అమరావతి ప్రాంతంలో ఉన్నప్పటికీ మా మద్దతు మూడు రాజధానులకే. – రాబర్ట్ సునీల్, ఫాస్టర్స్ ఫెడరేషన్ చైర్మన్ -
సీమ ద్రోహుల్లారా.. సిగ్గుందా?
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్న సీమ నాయకులు సిగ్గుపడాలని రాయలసీమ మేధావుల ఫోరం మండిపడింది. అమరావతి రైతుల పేరుతో 50 నుంచి 100 మంది నిర్వహిస్తున్న పాదయాత్రకు కొందరు నాయకులు హారతులిచ్చి స్వాగతం పలకడం సీమకు ద్రోహం తలపెట్టడమేనని స్పష్టం చేసింది. పాదయాత్రకు మద్దతివ్వడమంటే మన గొంతు మనమే కోసుకున్నట్లని పేర్కొంది. ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో తరతరాలుగా రాయలసీమకు జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే రెండు సార్లు రాజధానిని కోల్పోయిన సీమ ప్రజలు ఇప్పుడు పోరాడకపోతే పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. 19 గ్రామాల ప్రయోజనం కోసం... కమిటీల నివేదికలను చంద్రబాబు తుంగలో తొక్కి ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి విమర్శించారు. కేవలం 19 గ్రామాల ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని దుయ్యబట్టారు. రాయలసీమ అభివృద్ధి నినాదంతో తిరుపతిలో 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. త్యాగం.. ఎవరిది? శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80 వేల ఎకరాలను ఇచ్చిన రాయలసీమ రైతులది త్యాగమా? లేక తమ స్వార్థం కోసం భూములిచ్చి కౌలు, రుణమాఫీ, ఇతర ప్రయోజనాలు పొందుతున్న అమరావతి వాసులది త్యాగమా? అని మాకిరెడ్డి ప్రశ్నించారు. సొంతగడ్డకు నష్టం జరగాలని కోరుకుంటున్న వారికి కొందరు రాయల సీమ నేతలు మద్దతు పలకడం బాధాకరమన్నారు. విద్యార్థులదే కీలకపాత్ర.. పాదయాత్రపై ఓ వర్గం మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు సీ.ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలోనే హైకోర్టు, రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. వికేంద్రీకరణ, ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ కోరారు. ఈ పోరాటంలో విద్యార్థులదే కీలక పాత్రని రచయిత్రి మస్తానమ్మ చెప్పారు. సీమ అభివృద్ధిని అడ్డుకుంటూ పాదయాత్రలా? రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న అమరావతి పెయిడ్ ఉద్యమకారులకు తిరుపతిలో అడుగుపెట్టే అర్హత లేదని, వారి యాత్రను అడ్డుకుంటామని వైఎస్సార్ విద్యార్థి విభాగం హెచ్చరించింది. అమరావతి రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అమరావతి పెయిడ్ ఆరిస్టులు గో బ్యాక్ అంటూ నినదించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఛీ కొట్టినా ఆయన వైఖరి మారలేదని, చంద్రబాబు కనుసన్నల్లోనే పాదయాత్ర జరుగుతోందని దుయ్యబట్టారు. -
అది వంద మందిదే.. అందరిదీ కాదు.. ఢిల్లీ ఎక్కడుంది
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది. రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ ఎక్కడుంది? ‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు.. అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు. సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు. -
హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలి
హిందూపురం టౌన్ : హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లను కేటాయించి రెండోదశ పనులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ అభివద్ధి వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అల్‌హిలాల్ పాఠశాలలో చైతన్య గంగిరెడ్డి అధ్యక్షతన రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ ఈటీ రామ్మూర్తి, రామకష్ణ, ఎల్ఐసీ నరేంద్ర, బదరీష్, న్యాయవాది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘అనంత’కు ప్రాణపదమైన హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధపాత్రిపదికన పూర్తి చేయాలన్నారు. రాయలసీమ అభివద్ధి వేదిక డిమాండ్లపై త్వరలో డాక్టర్ ఎమ్మెల్సీ గేయానంద్ చేపట్టిన జీపుజాత హిందూపురంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా పరిగి మండలానికి శ్రీధర్, శ్రీకాంత్, లేపాక్షి మండలానికి రామాంజినేయులు, చిలమత్తూరు మండలానికి చైతన్య గంగిరెడ్డి, అలీముల్లాను ఇన్చార్జిలుగా ఎంపిక చేశారు. వేదిక సభ్యులు రాజశేఖర్, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్, వెంకటరామిరెడ్డి, ఆదినారాయణప్ప, చంద్ర, బాబావలి, శ్రీనివాసులు పాల్గొన్నారు.