r&b guest house
-
ఆర్టీసీ ఆస్తులు కాజేయడానికి కుట్ర
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ పూరిత ఆలోచనతో ఆర్టీసీని నిర్వీర్యం చేసి, దాని ఆస్తులు కాజేయడానికి కుట్రపన్నుతోందని పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ ఆరోపించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఎంత జీతాలు పొందుతున్నారో కూడా తెలియని సీఎం ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రతీ రోజూ కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఉద్యోగులను తొలగిస్తామనడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే వారి బలిదానాలకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం చెల్లించే బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీకి నష్టాలే లేవని అన్నారు. రూ.1052 కోట్లు వాహనాల టాక్స్ కింద వసూలు చేసి ఆర్టీíసీకి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు దిండిగాల మధు, తాజ్, బొబ్బిలి విక్టర్, నవాబ్, గణపతి, రమేశ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేను పేరుకే టీడీపీ ఇన్చార్జిని..
* ఎమ్మెల్యే, విజయమ్మ చెబితేనే అధికారులు పలుకుతున్నారు * బద్వేలుకు ఎలా వస్తావో చూస్తాం- టీడీపీ జిల్లాఅధ్యక్షుడితో కార్యకర్తల వాగ్వాదం ప్రొద్దుటూరు: ‘పేరుకే నేను టీడీపీ ఇన్చార్జిని..ఎమ్మెల్యే జయరాముడో, విజయమ్మనో చెబితేనే అధికారులు పనులు చేస్తున్నారు’ అని బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి విజయజ్యోతి అన్నారు. ప్రొద్దుటూరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం విజయజ్యోతి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో మాట్లాడేందుకు వచ్చారు. ఆమె వెంట సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మరి కొంత మంది వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 75 మంది నాయకులు, కార్యకర్తలకు నీరు-చెట్టు పథకం కింద కాలువలు తీసేందుకు పనులు పెట్టామన్నారు. 3 నెలలుగా ఈఫైల్ను పక్కన పెట్టారన్నారు. నిన్నకాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే జయరాములు, విజయమ్మ కలిసి రూ.10కోట్ల పనులు చేస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు. కూర్చొని మాట్లాడుదామని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చెబుతుండగానే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము విజయమ్మకో, జయరాములుకో ఓట్లు వేయలేదన్నారు. ఇంతలో జిల్లా అధ్యక్షుడు పార్టీ అనుకున్నారా, ఏమనుకున్నారు అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు జిల్లా అధ్యక్షునితో వాగ్వాదానికి దిగారు. బద్వేలుకు ఎలా వస్తావో చూస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు సమన్వయ కమిటీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో బద్వేలు నుంచి వచ్చిన వారు బయటికి వచ్చారు. -
ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కడప: ‘‘భిన్నమైన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేర్చాలి. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా కడప ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టను తిరుమల తరహాలో పవిత్ర స్థలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒంటిమిట్ట, కడప పెద్దదర్గా, గండికోట ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హాబ్‌గా మారుస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానమే శరణ్యం రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారానే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. 25, 26న మరోసారి జిల్లా పర్యటన కడపలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పెన్నా నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తామని సీఎం తెలిపారు. నీరు-చెట్టు పథకం, సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ఈ నెల 25, 26వ తేదీల్లో మళ్లీ వైఎస్సార్ జిల్లాకు వస్తానన్నారు. చెర్లోపల్లి పనులను పరిశీలించిన సీఎం సీఎం చంద్రబాబు గురువారం ఉదయం చెర్లోపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతరం రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరి టాల సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత అనంతపురంలో నీరు-ప్రగతిపై సదస్సు నిర్వహించారు. చివరగా కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో ఎలక్ట్రానిక్ అండ్ బయోటెక్నాల జీ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సుల్లో బాబు ప్రసంగించారు. -
వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి
అశ్వారావుపేట(ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వీధిలో ఉండే ఎం.మల్లికార్జునరావు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఆవరణలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముగ్గురు ఆగంతకులు ఆయనపై కర్రలు, రాడ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దానిని గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. కాగా, ఈ దాడి దొంగల పనే అయి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రాజమండ్రి ‘ఆర్అండ్బీ’లోనే కేబినెట్ భేటీ
సాక్షి, రాజమండ్రి: ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రాజమండ్రిలోని ఓ ప్రైవేటు హోటల్లో మంత్రివర్గ సమావేశం జరపాలని ముందు నిర్ణయించారు. కానీ గోదావరి పుష్కరాల కారణంగా ఈ హోటల్లో 25వ తేదీ వరకూ అన్ని గదులూ నిండిపోయాయి. దీంతో ఈ సమావేశాన్ని ఈ హోటల్లో జరిపితే మంత్రులు, ఐఏఎస్‌లు, ఇతర అధికారులకు గదులు కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీని ఆర్అండ్బీ అతిథి గృహంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. -
రైతులను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వం : పల్లె గంగారెడ్డి
కామారెడ్డిటౌన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని దుఃఖ సాగరంలో ముంచేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శని వారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందుకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి కుటుంబ రైతుకు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు విద్యుత్‌కోతలతో పంటలు పండక ఆందోళనలో ఉన్నారని అన్నారు. రెండేళ్ల తరువాత రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎనిమిది నిమిషాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ లైన్లను వేయలేదని కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదని అ న్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పూర్తిస్థాయిలో సహాయమందించేందుకు కృషి చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిద్దిరాములు ఉన్నారు. -
అవినీతిపైఉక్కుపాదం
ఖమ్మం జెడ్పీసెంటర్: అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని కలెక్టర్ కె.ఇలంబరితి అన్నారు. జిల్లా 44వ కలెక్టర్‌గా శుక్రవారం ఉదయం 5.36 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి బయలుదేరి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి తరువాత గత కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ వచ్చి సీటీసీ ఫైలుపై సంతకం చేసి నూతన కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీటీసీపై సంతకం చేసిన ఇలంబరితి కలెక్టర్ కుర్చీలో ఆసీనులయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారద ర్శక పాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖలలో పాలన సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తానని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటానని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. రైతు సమస్యలపై తక్షణమే స్పందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తగు ప్రాధాన్యత ఇస్తానన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ జ యప్రకాష్ నారాయణ, కలెక్టరేట్ ఏవో చూడామణి, డీటీలు బొగ్గారపు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు ఆశోక్, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్, డివిజనల్ పీఆర్వో దశరథం తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీస్సులుండాలి : శ్రీనరేశ్తో ఇలంబరితి బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాత, కొత్త కలెక్టర్లిద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. సీటీసీ ఫైలుపై కొత్త కలెక్టర్ పెట్టిన సంతకం చూసిన పాత కలెక్టర్ తన సంతకం కన్నా పెద్దగా ఉందని ఇలంబరితినుద్దేశించి అన్నారు. దీనికి సరదాగా స్పందించిన ఇలంబరితి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని శ్రీనరేశ్‌ను కోరారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. -
జిల్లాకు ఎన్నికల పరిశీలకులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ఏర్పాట్లను, స రళిని పరిశీలించడానికి సాధారణ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో ఎన్నికల సరళిని, అభ్యర్థుల ప్రచారాలను, ఏర్పాట్లను పరిశీ లించి నివేదికలివ్వడానికి ఎన్నికల సంఘం ప లువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ని యమించింది. వీరిలో సాధారణ పరిశీలకులు గా ఎల్.ఎన్.సోని (9491860465) రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఈనెల 8 నుంచి ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఈయనకు లైజన్ అధికారిగా హార్టికల్చర్ ఎ.డి.శామ్యూల్ (8374449355), మరో సాధారణ పరిశీలకులు అశోకానంద హెచ్.ఎ స్.(9491835308) కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ఈయనకు లైజన్ అధికారి గా వ్యవసాయ శాఖ ఏడీ వాజిద్‌హుస్సేన్ (సెల్ నం.8886612706) లను నియమించా రు. జహీరాబాద్ పార్లమెంట్ సాధారణ పరి శీలకులుగా ఐఏఎస్ అధికారి ఎం.తన్నారసన్ (9491860413)ను నియమించారు. ఈయన కు లైజన్ అధికారిగా డిప్యూటీ ఈఈ సురేష్‌బా బు (9701375988)ను నియమించారు. పోలీ సు పరిశీలకురాలుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెం దిన ఐపీఎస్ అధికారిణి(9491833017), ఈ మెకు లైజన్ అధికారిగా సబ్ఇన్స్పెక్టర్ అశోక్ (9440055690)ను నియమించారు. మరోసాధారణ పరిశీలకులుగా బషరత్ సలీంను నియమించారు. ఈయన జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ఈయనకు రామారావునాయక్, ఏడీఏను లైజర్ అధికారిగా నియమించారు. (సెల్నం.8886612724). మహా రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎస్.ఎం.కేంద్రీకర్ (9491860441)ను మరో పరి శీలకులుగా నియమించారు. ఈయనకు లైజ న్ అధికారిగా డిప్యూటీ ఈఈ టి.భూంరెడ్డి(9701367491)ను నియమించారు.