రాజమండ్రి ‘ఆర్‌అండ్‌బీ’లోనే కేబినెట్ భేటీ | andhra pradesh cabinet meeting at rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రి ‘ఆర్‌అండ్‌బీ’లోనే కేబినెట్ భేటీ

Published Mon, Jul 20 2015 9:43 AM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

andhra pradesh cabinet meeting at rajahmundry

సాక్షి, రాజమండ్రి: ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి రాజమండ్రిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మంత్రివర్గ సమావేశం జరపాలని ముందు నిర్ణయించారు. కానీ గోదావరి పుష్కరాల కారణంగా ఈ హోటల్‌లో 25వ తేదీ వరకూ అన్ని గదులూ నిండిపోయాయి. దీంతో ఈ సమావేశాన్ని ఈ హోటల్‌లో జరిపితే మంత్రులు, ఐఏఎస్‌లు, ఇతర అధికారులకు గదులు కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోనే నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement