RBI office
-
గాల్లోకి కరెన్సీ నోట్లు
భువనేశ్వర్: సిబ్బందితో వాగ్వాదం వలన వినియోగదారులు కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన విచిత్ర ఘటన స్థానిక భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కార్యాలయం ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు చిరిగిన మరియు తడిసిన ఇతరేతర కారణాలతో పాడైన నగదు నోట్లను మార్చి, కొత్త నోట్లు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకును సందర్శించారు. అయితే చెడిపోయిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర నిరుత్సాహానికి గురైన వినియోగదారులు తమ దగ్గర అక్కరకు రాకుండా ఉన్న నగదు నోట్లను గాలిలోకి రువ్వి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. ఫలితంగా రూ.100, రూ.200, రూ.500ల విలువైన చెడిపోయిన కరెన్సీ నోట్లు ఆర్బీఐ కార్యాలయం ఆవరణ మరియు ఎదురుగా ఉన్న వీధిలో పడి ఉండడంతో అసాధారణ పరిస్థితి నెలకొంది. చెడిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వచ్చాం. బ్యాంకు ఉద్యోగులు ఆ నోట్లను స్వీకరించలేదు. అందుకే ఇలా నిరసనగా నోట్లను గాలిలోకి విసిరినట్లు కొంతమంది బాధిత వర్గాలు తెలిపారు. నోట్ల మార్పిడి కౌంటర్ మూసివేత ఈనెల 3వ తేదీ నుంచి చెడిపోయిన నోట్ల మార్పిడి కౌంటర్‌ను మూసివేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేసి వినియోగదారులను నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఖాతాదారులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంకు అధికారులు, ఖాతాదారుల మధ్య మాటల తూటాలు పేలడంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులను శాంతింపజేశారు. తడిసిన, చిరిగిన, మరియు పాడైన నోట్లను మార్చుకోవాలని మరియు నాణేలు, నోట్లను ప్రజల నుంచి లావాదేవీలు లేదా మార్పిడి కోసం స్వీకరించాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు సూచించినట్లు భారత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం ప్రజలు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఖాతాదారులు, వినియోగదారులకు అసౌకర్యం లేకుండా బ్యాంకు వర్గాలు స్పందించాల్సి ఉంది. -
ఆర్బీఐ ముందు సీపీఐ ఆందోళన..
పారిశ్రామికవేత్త అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సైఫాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర శాఖ. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, పార్టీ నాయకులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, బాలమల్లేశ్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. – ఖైరతాబాద్ (హైదరాబాద్) -
హైదరాబాద్ ఆర్బీఐ వద్ద సీపీఐ ఆందోళన
-
18న ఆర్బీఐ ఎదుట ధర్నా: ఉత్తమ్
పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ఢిల్లీలో దిగ్విజయ్‌తో పీసీసీ నేతల భేటీ సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈ నెల 18న హైదరాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉత్తమ్‌తో పాటు పలువురు పీసీసీ ముఖ్య నేతలు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమ య్యారు. అనంతరం సమావేశం వివరాలను ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడిం చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న దేశవ్యాప్తంగా జరిగే ధర్నాల్లో భాగంగా హైదరాబాద్‌లోనూ నిరసనలు చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే ఈ నెల 19న అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈనెల 24 లేదా 25న పెద్ద నోట్ల రద్దుపై జన ఆవేదన సమ్మేళనం పేరిట ఒకరోజు శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం, దీర్ఘకా లంలో జరిగే ఆర్థిక విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్ ముఖ్యఅతిథిగా ఈ సమ్మేళనం జరుగుతుందని ఉత్తమ్ తెలిపారు. ఇందిర శత జయంతి ఉత్సవాలకు మన్మోహన్సింగ్... ఫిబ్రవరిలో జరిగే ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నా మని ఉత్తమ్ చెప్పారు. దీనికి ఇంకా తేదీని నిర్ణయించలేదని తెలిపారు. దిగ్విజయ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, సర్వే సత్య నారాయణ, రేణుకా చౌదరి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మల్లు రవి, మృత్యుంజయం, తాహెర్‌బిన్ తదితరులు పాల్గొన్నారు. భయపడకండి.. కాంగ్రెస్ అండగా ఉంటుంది: రాహుల్ జన ఆవేదన సమ్మేళన్‌లో పాల్గొన డానికి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, రేణుకాచౌదరి, వీహెచ్, దానం నాగేందర్ మరికొందరు ముఖ్య నేతలు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజల్లో అభద్రత నెలకొందని, ‘డరో మత్’ (భయ పడకండి) అని వారిలో మనోస్థైర్యాన్ని నింపాలని రాహుల్ ఈ సందర్భంగా వారికి ఉద్బోధ చేసినట్టు సమాచారం. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీ నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రధా ని చెప్పిన 50 రోజుల గడువు పూర్తయినా ప్రజల కష్టాలు తీరకపోవడం తో తెలంగాణలో ఆందోళన ఉధృతం చే యాలని నిర్ణయించామన్నారు. రబీ పంట కు కనీస మద్దతు ధరను 20శాతం అద నంగా ఇవ్వాలని, చిన్న వ్యాపారులకు పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని, ఒక్కో కుటుంబంలో ఒక మహిళ అకౌం ట్లో రూ.50 వేలు డిపాజిట్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
మోదీని ఉరి తీయాలి
ఆర్బీఐ కార్యాలయం ఎదుట నారాయణ ధర్నా సాక్షి, హైదరాబాద్: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండి పడ్డారు. కరెన్సీ నోటుపై ఇంత మొత్తానికి హామీ ఇస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ సంతకంతో ఉంటుందని, అలాంటి నోటును రద్దు చేసిన మోదీని నడివీధిలో ఉరితీసినా తప్పులేదన్నారు. గాంధీజీ బొమ్మ ఉన్న కరెన్సీని చిత్తు కాగితంగా మార్చి అవమానించినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ సైఫాబాద్‌లోని రిజర్వ్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట నారాయణ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు రవీంద్రభారతి నుంచి రిజర్వ్ బ్యాంక్ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. నోట్ల రద్దుపై ఆర్బీఐ అధికారులతో మాట్లాడేం దుకు వచ్చామంటూ నారాయణ కార్యాలయం లోకి వెళ్లారు. తర్వాత అధికారులకు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుుదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారే తప్ప ప్రజలపై ప్రేమతో కాదన్నారు. -
ఆర్బీఐలోనే క్యాష్ అయిపోయింది!
ఆర్బీఐ చెన్నై ఆఫీసులో గత వారం రోజులుగా రూ.500, రూ.1000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. బ్యాంకుకు వస్తున్న విజిటర్స్ సంఖ్య పెరుగుతుండటంతో, ఆ ఆఫీసులో నగదు అయిపోతున్నాయి. దీంతో గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూసిన వారు నిరాశతో తిరుగుముఖం పటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం వాటిని మార్చుకోవడానికి తుది గడువుగా డిసెంబర్ 30ను నిర్ణయించింది. అప్పటివరకు మార్చుకోని వారి పరిస్థితి ఇక అంతే. దీంతో తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఆర్బీఐ ఆఫీసులోనే నగదు అయిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్‌మనీ నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ.. కనీస అవసరాలకు కూడా నగదు లభ్యంకాకపోవడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్‌లను కూడా గత వారం రోజులుగా పక్కనపెట్టి క్యూలైన్లో నిల్చుంటున్నామని వారు పేర్కొంటున్నారు. 1960లో రిజర్వు బ్యాంకు చెన్నై ఆఫీసును బ్యూటిఫుల్ ఫోర్ట్ గ్లాసిస్ ప్రాంతంలోకి తరలించారు. అప్పటినుంచి చూసుకుంటే ఈ ఆఫీసుకు వచ్చే జనం కొంచెం తక్కువగానే ఉండేవారట. కానీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుకు వచ్చే విజిటర్స్ సంఖ్య పెరిగి, భారీ రద్దీ ఏర్పడిందని అధికారులు చెప్పారు. ముందు రోజు ఉదయం 7 గంటలకు క్యూలైన్లో నిల్చుంటే, తర్వాత రోజైనా తమవంతు రావడంలేదని కొంతమంది ప్రజలు నిరాశ వ్యక్తంచేస్తున్నారు. బ్యాంకులు రూ.2000 నోట్లను ఇష్యూ చేస్తుంటే, కస్టమర్లకు చిల్లర ఇవ్వడానికి ఇబ్బందులు పాలవాల్సి వస్తుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. మూడు గంటల నుంచి బ్యాంకు ఆఫీసు ముందు నిల్చుంటే, ఆఖరికి క్యాష్ అయిపోయినట్టు తెలిసిందని మరో కస్టమర్ వాపోయాడు. కొత్త నోట్లు అయిపోతుండంతో, ఇక 10 రూపాయి, 5 రూపాయి నాణేలను జారీచేసే ప్రక్రియలో పడింది రిజర్వు బ్యాంకు.క్యూ లైన్లో నిల్చోవడం ఇష్టపడని వారు, క్యూలో ఉన్నవారికి కమీషన్ ఇస్తూ నగదును డ్రా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు ఐడీ కార్డులపై నగదును డ్రా చేస్తున్నారు. దీంతో త్వరగా నగదు అయిపోతున్నట్టు కూడా తెలుస్తోంది.