Real Estate Developers Association
-
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో భారం
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి. -
ప్రాపర్టీ షోలకూ యాప్స్!
- అక్టోబర్ 2-4 వరకు ట్రెడా స్థిరాస్తి ప్రదర్శన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాప్స్.. యాప్స్.. యాప్స్! ఈ రోజుల్లో ప్రతిదానికీ స్మార్ట్‌ఫోన్‌ను టచ్ చేస్తే చాలు పనైపోయినట్టే! ఇంట్లోని డ్రెస్ నుంచి రోడ్డు మీది రెస్టారెంట్ వరకూ ప్రతి దానికి యాప్స్ వచ్చేశాయి మరి. ఇప్పుడీ జాబితాలో ప్రాపర్టీ షోలూ వచ్చిచేరాయి. అక్టోబర్ 2-4 వరకు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆధ్వర్యంలో జరగనున్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న 6వ స్థిరాస్తి ప్రదర్శన కోసం తొలిసారిగా యాప్‌ను అభివృద్ధి చేశారు. దీంతో స్థిరాస్తి ప్రదర్శనకు సంబంధించిన సమాచారంతో పాటు ఆయా స్టాళ్లలోని ప్రాపర్టీ వివరాలను, డీల్స్‌ను ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చని.. అవసరమైతే అక్కడి నుంచే బుకింగ్ చేసుకునే వీలుంటుందని ట్రెడా ప్రెసిడెంట్ దశరథ్ రెడ్డి చెప్పారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్కిటెక్ట్‌లు సుమారు 180 స్టాళ్లను ద్వారా ప్రాజెక్ట్‌లు, వెంచర్లు, గృహ రుణాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తారన్నారు. గతేడాది ట్రెడా ప్రాపర్టీ షోకు 60 వేల మంది సందర్శకులు వచ్చారని.. ఈసారి రెండింత వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. -
అప్రెడా నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) రెండేళ్ల నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా జీ హరిబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా చుక్కాపల్లి రమేష్, చావ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా లింగమూర్తి, బీ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎం ఎం కొండయ్య ఎన్నికయ్యారు. వీరితో పాటు ఎంవీ నరేంద్రనాథ్ రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, బీఎల్ నరసారెడ్డి, ఎంవీ చౌదరి సెక్రటరీలుగా, ఆర్ వెంకటేశ్వర రావు ట్రెజరర్‌గా నియమితులైనట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.