realter murdered
-
రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్: నెల్లూరుకు చెందిన రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్‌నాథ్ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం బెంగళూరు, చెన్నై, ఏపీలో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపీ డాక్టర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిఏ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాబా అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ డబ్బు, గుప్త నిధుల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి గత నెల కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. -
రియల్టర్ దారుణ హత్య
సాక్షి, అత్తాపూర్: భూతగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోకచక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన జావిద్(40) రియల్టర్‌గా ఉన్నాడు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు జావిద్‌కు గత కొంతకాలంగా ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి శివరాంపల్లి ప్రాంతానికి జావిద్‌ను భూమి విషయమై మాట్లాడుకుందామని రప్పించారు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆవేశంలో సదరు వ్యక్తులు శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద జావిద్‌ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి పరారైయ్యారు. దీంతో తీవ్రగాయాలైన జావిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండు సెల్ఫోన్లు, ఐ–10 కారు, నంబరు లేని పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. సెల్ఫోన్ల కాల్ డేటాలను సైతం పరిశీలిస్తామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతలో వృద్ధుడి దారుణ హత్య
గుర్తుతెలియని దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చారు. ఈ ఘటనలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పామురాలు గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ (55) మృతి చెందారు. శనివారం రాత్రి అనంతపురం నుంచి పనులు ముగించుకొని వస్తుండగా గుత్తి రోడ్డులో ఈ దారుణం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.