Rechargeable
-
గంటకు 260 కిలోమీటర్ల వేగం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు
ఎగరాలంటే విమానం ఎక్కాలి. కనీసం హెలికాప్టరైనా ఉండాలి. వీటికి చాలా తతంగం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫ్లైయింగ్ కార్లు అక్కడక్కడా వస్తున్నాయి. వాటికి ఇంధనం బాగానే ఖర్చవుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లైయింగ్ సాసర్ ఉంటే, ఎక్కడికైనా తేలికగా పక్షిలా ఎగిరి వెళ్లవచ్చు. కోరుకున్న చోట హాయిగా వాలిపోవచ్చు. దీనికి ఇంధనం సమస్య ఉండదు. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘జెవా’ ఈ ఫ్లైయింగ్ సాసర్ను రూపొందించింది. ఇందులో ఒక మనిషి మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. ఇందులో బ్యాటరీని పూర్తిగా చార్జి చేస్తే, 80 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం గంటకు 260 కిలోమీటర్లు. -
ఇక ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆ తర్వాత ఇతర కనెక్షన్లుకు విస్తరించే యోచన మార్చి 31లోగా బిగించాలని ఆదేశాలు జారీ ఇంట్లో కరెంటు పోయిందా.. రీచార్జ్ చేసుకోలేదేమో.. కరెంటుకు రీచార్జేంటి అనుకుంటున్నారా.. త్వరలో ఈ విధానం నగరంలో అమలుకాబోతోంది. మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్లు కరెంటుకు కూడా రీచార్జ్ చేసుకోవాలి భవిష్యత్తులో.. సిటీబ్యూరో: విద్యుత్ దుబారాను అరికట్టడంతో పాటు ప్రతి యూనిట్‌ను పక్కగా లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న మెకానికల్ విద్యుత్ మీటర్ల స్థానంలో ఇకపై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని బిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీఓ కూడా జారీ చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వీధిలైట్లకు మినహా అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఈ మీటర్లను బిగించాలని సూచించింది. ఇందుకోసం ఇప్పటికే ఐదు వేల మీటర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ తరహా మీ టర్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు అమర్చడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, గృహాల్లో చోటు చేసుకుంటున్న విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా సంస్థకు వస్తున్న నష్టాలను కూడా నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. నగరంలో చాలామంది తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది విద్యుత్ వినియోగంపై ఆంక్ష లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటు యజమానులకు, అటు అద్దెవాసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడం వల్ల విద్యుత్ వృథాను అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ‘గ్రేటర్’ పరిధిలోనే సుమారు 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రెండు వేలకుపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు అరకోటికిపైగా విద్యుత్ బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం తమకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదనే సాకుతో చాలా మంది అధికారులు తమ ఆఫీసుకు సంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా డిస్కం రూ.కోట్లు నష ్టపోవాల్సి వస్తుంది. ఇలా పనిచేస్తాయి... ప్రస్తుతం ఉన్న పాత మెకానికల్ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను (సెల్‌ఫోన్ రీచార్జ్ తరహా) అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. విని యోగదారుడు ప్రతినెలా తన చేతిలోని సెల్ ఫోన్ రీచార్జీ చేసుకున్నట్లుగానే ఇకపై ఇంట్లోని విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్ లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జీ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఇందు కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ తరహా సేవలను వ ర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. -
మొబైల్ రీచార్జ్‌తో బీమా ఫ్రీ
శ్రీరామ్ లైఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టెలినార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా రీచార్జ్ చేయించుకుంటే టెలినార్ ఇండియా (గతంలో యూనినార్) ఉచిత జీవిత బీమా అందిస్తానంటోంది. ప్రతి నెలా రీచార్జ్ చేయించుకునే మొత్తానికి 100 రెట్లు అధికంగా బీమా రక్షణ లభిస్తుందని టెలినార్ ఇండియా సీఈవో వివేక్ సూద్ తెలిపారు. ఇలా గరిష్టంగా రూ. 50,000 వరకు బీమా రక్షణను పొందవచ్చు. కానీ ఈ ఉచిత బీమా కావాలంటే మాత్రం రీచార్జ్ మొత్తాన్ని ప్రతి నెలా కనీసం రూ. 20 చొప్పున పెంచుకోవాలని కంపెనీ నిబంధన విధిస్తోంది. రీచార్జ్ మొత్తం రూ. 500దాటితే ప్రతినెలా అదనంగా రీచార్జ్ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. బీమా రక్షణ కావాలనుకునే వారు మాత్రమే ఈ సదుపాయం పొందవచ్చని, అక్కర్లేనివారు సాధారణ రీచార్జ్ చేసుకోవచ్చని సూద్ తెలిపారు. ఈ బీమా రక్షణ కోసం కంపెనీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తొలి బీమా పథకాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్. విజయన్ చేతుల మీదుగా జారీ చేశారు. తొలిసారిగా టెలినార్‌లో సబ్‌స్క్రైబ్ అయినవారికి రెండు నెలలు ఉచితంగా బీమా రక్షణ లభిస్తుంది. ఆ తర్వాత అదనపు మొత్తం రీచార్జ్ చేయించుకుంటేనే ఈ ఉచిత బీమా సౌకర్యం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్‌లైఫ్ సీఈవో మనోజ్ జైన్ మాట్లాడుతూ దీనివల్ల ప్రజల్లో బీమాపై అవగాహన మరింత పెరుగుతుం దన్నారు. గతేడాది రూ. 500 కోట్లుగా ఉన్న కొత్త ప్రీమియం ఆదాయం ఈ ఏడాది రూ. 700 కోట్లు దాటుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
సొంతంగా రీచార్జ్ చేసుకునే సోలార్ బ్యాటరీ!
వాషింగ్టన్: కాంతిని, గాలిని ఉపయోగించుకుని తనంతట తానే రీచార్జ్ చేసుకునే సౌరవిద్యుత్ బ్యాటరీని తొలిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. బ్యాటరీని, సోలార్ సెల్‌ను కలిపి ఒకే హైబ్రిడ్ పరికరంలో అమర్చడం ద్వారా ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని రూపొందించారు.