records missing
-
'ఆ' గ్రామాలు ఏమైనట్లు..!?
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో.. జిల్లా పునర్విభజనకు ముందున్న 24 గ్రామాలు ప్రస్తుతం జనాభా రికార్డుల్లో కనిపించడం లేదు. 2021 జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. జిల్లా జాబితాను పరిశీలించగా.. 8 మండలాల్లోని 24 గ్రామాల పేర్లు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. దీనిపై జిల్లా అధికారులను నివేదిక కోరారు. జిల్లా ప్రణాళిక, గణాంక, రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డుల పరంగా గ్రామాలను మరోసారి నో టిఫై చేసి రాష్ట్ర సెన్సెన్ కార్యాలయానికి పంపిం చారు. జిల్లాల విభజన అనంతరం జనాభా రికార్డుల్లో కానరాకుండాపోయింది. 11 అక్టోబర్ 2016న జీవోనంబర్ 222 రెవెన్యూ ప్రకారం ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజన, మండలాలు, గ్రామాలు, జనాభా, సరిహద్దులు, తదితర వివరాలు రెవెన్యూ అధికారులు జిల్లాల వారిగా పొందపరిచారు. ఆ సమయంలో 2011 జనాభా లెక్కలో మంచిర్యాల జిల్లాలో ఉన్న 24 గ్రామాలు పేర్లు రికార్డుల్లో నమోదు కాకుండపోయాయి. దండేపల్లిలోని రోళ్లపహేడ్, చెన్నూర్ మండలం ఆదిలవార్పేట్, గుడ్డిరాంపూర్, కోనంపేట్, ఆముదాలపల్లి, కోటపల్లి మండలం ఆయపల్లి, చింతకుంట, ఆడకపల్లి, మందమర్రి మండలం లిమూర్, కాసిపేట మండలం దేవపూర్, నెన్నెల మండలంలోని పుప్పాలవనిపేట, సీతనగర్, కుంమ్మపల్లి, బధ్రపూర్, మంకపూర్,బోదపూర్, భగీరథ్పేట, సింగపూర్, తాండూర్ మండలంలో వెంకాయపల్లి, అనకపెల్లి, మదనపూర్, రాంపూర్, భీమిని మండలంలోని రాం పూర్, సాలిగాం గ్రామాలు పేర్లు గల్లంతయ్యా యి. విచిత్రమేమిటంటే.. ఇందులోని 20 గ్రామాల వరకు పేర్లు మాత్రమే ఉండగా.. అక్కడ జనంగానీ.. కనీసం ఇళ్లుగానీ లేవు. వ్యవసాయ భూములు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామశివారుతో పేర్లు మాత్రం రెవెన్యూ రికార్డులో ఉంటున్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొ ంటున్నారు. ఏళ్ల క్రితం ఇక్కడ జనం ఉండే.. అంటున్నా.. ఇక్కడి జనం ఎక్కడికి వెళ్లారు..? మరి ఊరుపేరు మాత్రం ఎలా మిగిలింది..? 2011 జనాభా లెక్కలో ఆ గ్రామాల పేర్లు ఎలా వచ్చాయి..? అనేవి జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం జనాభా ఉన్న గ్రామాలు.. జిల్లా విభజన సమయంలో బెల్లంపలి రెవెన్యూ డివిజన్‌తోపాటు, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, దండేపల్లి, జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, వేమనపల్లి, భీమిని, మండలాలతోపాటు కొత్తగా హాజీపూర్, నస్పూర్, భీమారం, కన్నెపల్లి, మొత్తం 18 మండలాలు, 385 గ్రామాలతో జిల్లా ఆవిర్భవించింది. ఈ సమయంలో జిల్లా నుంచి 24 గ్రామాల పేర్లు గల్లంతు కాగా ఇందులో 20 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఈ గ్రామాలలో నివసించే ప్రజలు సమీప గ్రామాలలో స్థిరనివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఇళ్లు, జనాభా లేకపోయినా రెవెన్యూ రికార్డులో గ్రామ శివార్లు కొనసాగుతున్నాయి. గతంలో అక్కడ ఆ గ్రామాలు ఉన్నట్లు ఇప్పటికీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామాల్లోని గ్రామదేవతలు కనిపిస్తున్నాయి. మిగితా 4 గ్రామాలలో ప్రజలు ఇప్పటికే కొనసాగిస్తున్నారు. కాసిపేట మండలంలోని దేవపూర్‌లో అతిపెద్ద సిమెంట్ కర్మాగారం ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ గ్రామం తెలియని వారు ఉండరు. సిమెంట్ కంపెనీపై ఆధారపడి కార్మికులు, ఇతరవర్గాలవారు, వ్యవసాయ కుటుంబాలు వేల సంఖ్యలో జీవిస్తున్నాయి. దీంతోపాటు గతంలో మందమర్రి మండలం ప్రస్తుతం ఇటీవల మున్సిపాలిటీగా ఆవిర్భవించిన క్యాతనపల్లి, కన్నెపల్లి మండలం సాలిగాం, భీమిని మండలంలోని రాంపూర్‌లో వేల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి. తమ గ్రామం పేరు లేకుండా పోవడమేంటని ఇక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు. సవరించి పంపించాం.. జిల్లా సరిహద్దు, మండలాలలు, గ్రామాలు, జనాభా వివరాలు పంపించాం. ఆ సమయంలో కొన్ని గ్రామాల పేర్లు గల్లంతవడంతో పాటు తప్పుగా వచ్చాయి. గల్లంతయిన గ్రామాల పేర్లతో పాటు తప్పులను తిరిగి సవరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించాం. సెన్సెస్ కార్యాలయం వారు కొత్త జాబితాలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామశివారుతో పేర్లు మాత్రమే ఉన్నాయి. -
రికార్డులు మాయం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెం వీఆర్వో కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. దీనిపై స్థానికులు మంగళవారం ఉదయం ద్వారకాతిరుమల తహసీల్దారు ఎం.కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కోడిగూడెం (సీహెచ్ పోతేపల్లి ఇన్చార్జి) వీఆర్వో వి.సుబ్రహ్మణ్యం కుమారుడు, అతని తమ్ముడే రికార్డులను మాయం చేశారని పేర్కొన్నారు. స్థానికు ల కథనం ప్రకారం.. దెందులూరు మం డలం చల్లచింతలపూడికి చెందిన సుబ్ర హ్మణ్యం ఐదేళ్ల నుంచి కోడిగూడెం వీఆ ర్వోగా పనిచేస్తున్నాడు. ఈయన పనిచేయాలంటే ఎంతోకొంత సొమ్ము ముట్టజెప్పాల్సిందే. కౌలు పత్రం నుంచి పాస్ బుక్ వరకు ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించారు. గొడవలెందుకని భావించిన రైతులు పని త్వరగా పూర్తిచేసుకునేందు కు వీఆర్వో అడిగినంతా ముట్టజెబుతున్నారు. ఇలా చేయని వారి పాస్ పుస్తకా లు, ఇతర కాగితాలు తన కార్యాలయంలోనే ఉంచేవాడు. ఎన్నిసార్లు మీసేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాటిని పరిశీలించకుండానే తిరస్కరించేవాడు. ఈ క్రమంలోనే దొరసానిపాడుకు చెందిన రైతు రాయపాటి నాగేశ్వరరావు కుమారుడు లీలాకృష్ణమూర్తికి డిజిటల్ ఈ పాస్ పుస్తకాలు ఇచ్చేం దుకు రూ.4 వేలను డిమాండ్ చేశాడు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వీఆర్వో సుబ్రహ్మణ్యంకు లంచ ం సొమ్ము రూ.4 వేలు ఇస్తూ సోమవారం రాత్రి పట్టించిన విషయం తెలిసిందే. విచారణకు హామీ వీఆర్వో సుబ్రహ్మణ్యం ఏసీబీ అధికారుల కు పట్టుబడటంతో, ఆయన కుమారుడు, తమ్ముడు సోమవారం అర్ధరాత్రి కోడిగూడెం వీఆర్ఏ సైదు కాశీం ఇంటికి వెళ్లారు. ఆ తరువాత కాశీంతో వీఆర్వో కార్యాలయం తలుపులు తెరిపించి పాస్ పుస్తకాలు, గొలుసు, తదితర పత్రాలను తీసుకెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు కొంద రు కాశీంను నిలదీయడంతో అసలు విష యం బయటకొచ్చింది. ఈ వ్యవహారమంతా ఒక కాగితంపై రాసి కాశీంతో సం తకం చేయించారు. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు, కాగితాలు పెద్ద ఎత్తున వీఆర్వో కార్యాలయంలో దొరికి తే, అవి ఎందుకు పెండింగ్‌లో ఉంచారనే ప్రశ్నలు ఎదురౌతాయన్న ఉద్దేశంతోనే వాటిని దొంగిలించారని స్థానికులు చెబుతున్నారు. రికార్డుల మాయంపై విచారణ చేస్తానని గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, చెలికాని బుల్లియ్య, బీజేపీ జిల్లా నేత తాండ్ర శేషగిరిరావులకు తహసీల్దారు కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. కనిపించని ఫైల్ ఇదిలా ఉండగా వీఆర్వోను ఏసీబీ అధికారులకు పట్టించిన రైతుకు సంబం ధించి ఫైల్ తహసీల్దారు కార్యాలయంలో దొరకలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ సిబ్బంది ఫైల్ కోసం రికార్డు రూములో వెదికినా ఫలితం లేదు. ఐతే కోడిగూడెంలోని వీఆర్వో కార్యాలయంలో మాయమైన రికార్డుల్లో, ఈ ఫైల్ ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జనన ధ్రువీకరణకు రూ.5 వేలు జనన ధ్రువీకరణ పత్రం ఇస్తానని చెప్పి గతేడాది రూ.5 వేలు తీసుకున్నాడు. రేపు మాపు అంటూ తిప్పాడు. అసలు ఆ పత్రం ఇచ్చేది వీఆర్వో కాదని తెలుసుకుని, నా డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు వెంటపడ్డాను. సరైన సమాదానం చెప్పలేదు. చేసేదేం లేక ఇక ఊరుకున్నాను.– చవల దుర్గారావు, కోడిగూడెం, గ్రామస్తుడు ఈ పాస్ పుస్తకాల కోసం వసూలు నా పొలానికి మేన్యువల్ పాస్ పుస్తకాలున్నాయి. వాటిని మార్చి డిజిటల్ ఈ పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి తొలుత రూ.1500, ఆ తరువాత పొలం కొలతలంటూ రూ.3 వేలు తీసుకున్నాడు. అలాగే పాత పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలని అడిగాడు. వీఆర్వో చుట్టూ తిరగలేక ఊరుకున్నాను.– పాలం రాంబాబు, కోడిగూడెం, గ్రామస్తుడు ఎకరమైనా, అరెకరమైనా ఒకే రేటు నా పొలం పాస్ పుస్తకాలను ఈ పాస్ పుస్తకాలుగా మార్చేందుకు అరెకరానికి రూ.5 వేలు మరో ఎకరానికి మరో రూ.5 వేలు తీసు కున్నాడు. ఉన్నతాధికారులకు చెబుదామంటే పనులు అవ్వవని భయపడేవాళ్లం. వీఆర్వో ఏసీబీ అధికారులకు దొరకడంతో రికార్డులను మాయం చేశారు.– బచ్చు శ్రీనివాసరావు, కోడిగూడెం, గ్రామస్తుడు -
రెవెన్యూ రికార్డులు మాయం
అక్రమార్కుల పనేనంటూ అనుమానాలు సిబ్బంది ఇష్టారాజ్యంపై గతంలో ఆరోపణలు కొడకండ్ల : మండలంలోని భూముల సంబంధించిన కీలక రికార్డులు మాయమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ పరిధిలోని 16 గ్రామాలకు సంబంధించి 60 ఏళ్లకు పైబడి ఉండాల్సిన రికార్డులు కనిపించకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్ల వరకు ఆయా రికార్డుల బాధ్యతలను కార్యాలయ సిబ్బందే బాధ్యత వహించగా, ఆతర్వాత వీఆర్ఏలు, కార్యాలయానికి సంబంధం లేని పలువురు అప్పగించారు. దీంతో భద్రత కరువై రికార్డులు లేకుండాపోయాయి. ఈ విషయమై డీటీ మాన్యానాయక్, రికార్డు అసిస్టెంట్ ప్రణీత్‌ను వివరణ కోరగా కొన్ని రికార్డులు కనిపించడం లేదన్నారు. 60 ఏళ్ల నుంచి భూములకు సంబంధించిన పట్టాదారు, సర్వే నంబర్ల వివరాలతో కూడిన పహాణీ, తదితర కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు లేవు. ఏడాదిన్నర క్రితం విధుల్లో చేరిన సమయంలో రికార్డుల వివరాలను చార్్జలో సమర్పించలేదని రికార్డు అసిస్టెంట్ తెలిపారు. ఖాస్రా, ఖల్ఖస్రా, సేత్వార్ వంటి కీలకమైన రికార్డులు చాలా గ్రామాలకు సంబంధించినవి అడ్రస్ లేకుండా పోయాయి. సేత్వార్ పహాణీలు రేగుల, నర్సింగాపురం, లక్ష్మక్కపెల్లి గ్రామాలకు సంబంధించినవి ఉండగా, మిగతా గ్రామాలవి లేవు. ఖాస్రా పహాణీలు పోచారం, పాకాల, వడ్డేకొత్తపెల్లి, రేగుల, కొడకండ్ల, రంగాపురం, రామవరం, పోచంపెల్లి, పెద్దవంగర, గంట్లకుంట, లక్ష్మక్కపెల్లి, మొండ్రాయి గ్రామాల్లో కొన్ని మాత్రమే ఉండగా, పూర్తి స్థాయిలో రికార్డులు లేవు. మిగతా ఐదు గ్రామాలకు సంబంధించినవి అసలు కనిపించడం లేదు. నాలుగైదేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పాస్ పుస్తకాల తయారీ ముఠా>తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్రమాలు కప్పిపుచ్చుకొనేందుకే కొందరు కార్యాలయానికి సంబంధించిన వారే భూములకు సంబంధించిన కీలక రికార్డులను మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ఈ రికార్డు గదిని వీఆర్ఓ, వీఆర్ఏల కుటుంబసభ్యులకు కేటాయించడం వల్లే రికార్డులు మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.