శ్రీవారి భక్తులపై ఎన్కౌంటర్ తీవ్ర ప్రభావం...
తిరుపతి: శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనతో శ్రీవారి భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన వారంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో ఇప్పటికే అక్కడి రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగురోజుల పాటు బస్సులు నడపలేమని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
దాంతో ఒక్క చిత్తూరు జిల్లా నుంచే రోజుకు 214 సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా బస్సులను నిలిపివేసినట్టు ఆర్టీసీ పేర్కొంది. ఒక్క చిత్తూరు జిల్లాకే రోజుకు ఆర్టీసీకి 20లక్షల నష్టం వాటిలినట్టు అంచనా. కాగా, తమిళనాడులో భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నాయనీ, ఇప్పుడే బస్సులను నడపలేమనీ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.