reddappa reddy
-
‘ఆయన బినామీలే నిరసనలు చేస్తున్నారు’
సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బినామీలే ఇప్పుడు అమరావతిలో నిరసనలు చేస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడప్ప విమర్శించారు. సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను గాలికి వదిలేశారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని అన్నారు.ఆస్తులను కాపాడుకోవడానికే.. ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు నానా యాగీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అమరావతిలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. సీఎం జగన్‌కు మంచిపేరు వస్తోందని చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన హర్షణీయమన్నారు. -
రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి
హైదరాబాద్: రాజ్యాంగంలోని 243–ఐ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయా లని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(సుపరిపాలన వేదిక) అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి కోరారు. గురువారం లక్డీకాపూల్‌లోని సుపరిపాలన వేదిక కార్యాలయంలో సంఘం కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రావు చెలికానితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు న్యాయమైన వాటా ఇవ్వడం, పంచాయతీల పన్ను, రుసుములతో వచ్చే ఆదాయాన్ని సక్రమంగా పంపిణీ చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదలై మూడేళ్లు కావస్తున్నా అది పూర్తిస్థాయిలో కొలువుదీరలేదని ఆరోపించారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసినా అధ్యక్షుడు, సభ్యులను నియమించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పంచాయతీరాజ్ బిల్లును ప్రజల ముందుంచి వారి సలహాలు తీసుకున్న తర్వాతే అసెంబ్లీలో చట్టం చేయాలని అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన 29 అంశాలను పంచాయతీలకు బదిలీ చేయాలని కోరారు. మూడంచెల పాలనా వ్యవస్థలో చివరివైన స్థానిక సంస్థలు సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించారని చెప్పారు. ఈ సవరణ స్థానిక సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించి, కోట్లాది మంది గ్రామీణుల జీవనస్థితులను మెరుగుపరచడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు. పంచాయతీలు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేయడానికి వీలు కల్పించాలని, ఇందుకనుగుణంగా 29 అంశాలను వాటికి బదిలీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ విధంగా జరిగినప్పుడే 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు నెరవేరినట్లు అవుతుందని చెప్పారు. పంచాయతీలకు అధికారాలు, నిధులు బదిలీ చేయకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు, విధులు, సిబ్బందిని ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. -
నోటిఫికేషన్ నాటి నుంచే మద్యం బంద్ చేయాలి
ఎన్నికల నిఘా వేదిక చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణ్‌రావు దోమలగూడ, న్యూస్‌లైన్: పోలింగ్‌కు రెండు రోజుల ముందు మద్యం అమ్మకాలు బంద్ చేయడం కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచే బంద్ చేయాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సూచించారు. అప్పుడే ఎన్నికల్లో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. దోమలగూడలోని ఇందిరాపార్కు చౌరస్తా సమీపంలోని హైదరాబాదు స్టడీ సర్కిల్ సమావేశ హాలులో ఆదివారం ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వేదిక చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జస్టిస్ రెడ్డప్పరెడ్డి, డాక్టరు రావు చెలికాని, ఓయూ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు, ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణ్‌రెడ్డి, కో ఆర్డినేటర్ గుండె కనకరత్నం, రిటైర్డ్ ఐఆర్ఎస్ పద్మనాభరెడ్డి, కె.సుబ్బరంగయ్యలతో పాటు 23 జిల్లాల నుంచి జిల్లాకు ముగ్గురు వంతున ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులలో ఎవరినీ ప్రాసిక్యూట్ చేయడం లేదని, ఎవరికీ శిక్షలు పడటం లేదని, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఎన్నికల కేసులను సత్వరమే పరిష్కరించాలని సమావేశం కోరింది. జస్టిస్ అంబటి లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. కేంద్రంలోనూ, తెలంగాణ, సీమాంధ్రలోనూ ప్రభుత్వాల ఏర్పాటుకు సింగిల్ పార్టీలకు పూర్తి మెజార్టీ ఇచ్చి ప్రజలు వివేకవంతులని నిరూపించుకున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో డబ్బు అత్యధికంగా పట్టుబడిందని, డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచారని వాపోయారు.