అదరగొట్టే ఫీచర్లతో రెడ్ మి4 లాంచ్
రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అఫార్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అదరగొట్టే ఫీచర్లతో షియోమి భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెడ్ మి 4 పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ ను 6,999 రూపాయలకు, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ను 8,999 రూపాయలకు, 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ను 10,999రూపాయలకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. రెడ్ మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ సక్సెసర్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. మే 23 నుంచి ఈ ఫోన్ అమెజాన్.ఇన్, ఎంఐ.కామ్ రెండు ఆన్ లైన్ స్టోర్లలో విక్రయానికి రానుంది. ఎంఐ హోమ్ స్టోర్ నుంచి అయితే మే 20 నుంచే అందుబాటులో ఉండనుంది. ఆసక్తిగల వినియోగదారులు నేటి నుంచే ఈ ఫోన్ ను ఎంఐ.కామ్ ఉచితంగా బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్...
క్వాల్ కామ్ 1.4గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్
4100ఎంఏహెచ్ బ్యాటరీ
5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్
మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
13ఎంపీ రియర్ కెమెరా
డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
4జీ ఎల్టీఈ
బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు
వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్
హైబ్రిట్ సిమ్ ట్రే