ఎర్రచందనం డంప్ స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా బాకరాపేట అటవీ ప్రాంతంలోని బొగ్గులవాండ్ల సమీప ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలించేందుకు వీలుగా అడవిలోని ఓ రాళ్ల గుట్ట వద్ద అక్రమంగా దాచి ఉంచిన 9 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.