Registrar Office
-
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ ఆడిటర్
సాక్షి, అమరావతి/కడప అర్బన్/చిలకలూరిపేట: వైఎస్సార్ జిల్లా ఆడిట్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ జబ్బార్ రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్ అందించిన వివరాలు.. మైదుకూరు మండలం తువ్వపల్లెకు చెందిన పెద్ద వెంకటయ్య కడప ఇరిగేషన్ సర్కిల్లో సబార్డినేట్‌గా పనిచేసి పదవీవిరమణ చేశారు. తనకు రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైలును జిల్లా ఖజానా అధికారికి పంపించే విషయమై అబ్దుల్ జబ్బార్‌ను సంప్రదించారు. ఇందుకోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడి చేసి జబ్బార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.80,120 స్వాదీనం గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు. కార్యాలయంలో అధిక మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు రావడంతో గుంటూరు ఏసీబీ డీఎస్పీలు వెంకట్రావు, ప్రతాప్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. ఆ సమయంలో కార్యాలయం లోపల ఉన్న 10 మంది స్టాంప్ వెండరు, ప్రయివేటు ఉద్యోగుల వద్ద నుంచి రూ.80,120ను ఏసీబీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. -
దందాపై ఎమ్మెల్యే కేతిరెడ్డి కన్నెర్ర
ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత టీడీపీ హయాంలో మొదలైన అవినీతి వసూళ్ల దందా నేటికీ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్ అయిన డాక్యుమెంట్‌కు సెంటుకు ఒక రేటు, ఎకరాకు ఒక రేటు చొప్పన లంచం వసూలు చేస్తున్నారు. ఈ దందాలో రియల్టర్లు, బ్రోకర్లు, దస్తావేజులేఖర్లు, దళారులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కలసి పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధి పేరుతో వసూళ్లు నిర్వహిస్తూ అవినీతికి తెర లేపడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కన్నెర్ర చేశారు. అక్రమార్కుల అంతు చూడాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన అధికార యంత్రాంగం ఆరోపణలున్న దస్తావేజులేఖర్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపైన కేసులు నమోదు చేశారు. సాక్షి, ధర్మవరం: ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని టీడీపీ పాలనా కాలం మొత్తం ఆదాయ వనరుగా చేసుకున్నారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ కావాలంటే టీడీపీ ప్రజా ప్రతినిధులకు సొమ్ము ముట్టజెప్పాల్సిన దారుణమైన పరిస్థితులు ఉండేవి. టీడీపీ నాయకులు ఏకంగా కార్యాలయంలో తిష్ట వేసుకొని దళారులుగా మారి దస్తావేజు లేఖర్లు, కార్యాలయ సిబ్బందితో కుమ్మకై డబ్బులు వసూలు చేసేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఏకంగా ‘లంచం అడిగితే ఫిర్యాదు చేయండి’అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.. అవినీతికి పాల్పడేవారి వివరాలు అందించాలని ఫ్లెక్సీలో తన సెల్‌నెంబర్, ఉన్నతాధికారుల సెల్‌నెంబర్లు పొందుపరిచారు. ఈ పరిణామంతో కొంత కాలం అక్రమార్కులు స్తబ్దుగా ఉండిపోయారు. అక్రమార్జనకు కొత్త పంథా అక్రమార్జనకు అలవాటుపడిన వారు కొత్త పంథా ఎంచుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు నానా కొర్రీలు పెట్టడం రిజిస్ట్రేషన్‌ను కాలయాపన చేయడం మొదటగా చేస్తారు. దీంతో సదరు బాధితులు కార్యాలయం చుట్టూ తిరిగిన తర్వాత సదరు అక్రమార్కులు, దస్తావేజులేఖరుల ద్వారా లంచం డిమాండ్ చేస్తారు. లంచం విషయం ఎక్కడ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారోనని ఏకంగా ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రచారం చేశారు. దీంతో బాధితులు ఏం చేయాలో పాలుపోక కొంతకాలం లంచాలు ముట్టజెప్పారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ అక్రమార్కుల నయా దందా గురించి కొంతమంది బాధితులు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన అక్రమార్కులపై కన్నెర్ర చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందాకు కారకులు ఎంతటి వారైన చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని సబ్‌రిజిస్ట్రార్, పోలీస్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అక్రమార్కులపై కేసులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందా సాగిస్తున్న 16మంది దస్తావేజు లేఖరులను, ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని రెండు రోజలు క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలిసింది. అంతటితో ఆగకుండా ఆరు నెలలుగా ధర్మవరం సబ్‌రిస్టార్ కార్యాలయ పరిధిలో అయిన రిజిస్ట్రేషన్లను పరిశీలించి, ఆయా వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది. -
స్టాంపు కుంభకోణం కేసులో 8మంది సస్పెండ్
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్‌లోని రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. 2014వ సంవత్సరంలో స్టాంపుల క్రయవిక్రయాలకు సంబంధించిన కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేసు నమోదునమోదై విచారణ జరుగుతుంది. స్టాంపుల కుంభకోణంలో భాగంగా మంగళవారం రోజు ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నలుగురు సబ్ రిజిస్టార్లతోపాటు నలుగురు ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో జరిగిన ఈ కుంభకోణంలో 70 లక్షల రూపాయల మేర క్రయవిక్రయాల్లో భారీ అవినీతి జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరిపిన అధికారులు వారిని సస్పెండ్ చేశారు. -
మేడ్చల్: సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. రేపు జరగాల్సిన ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఎదుట మను స్మృతి ప్రతులను పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా హాస్టల్‌కు సెలవు ప్రకటించామని, వర్సిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
రిజిస్ట్రార్ ఆఫీసులో చోరీ
కీసర(రంగారెడ్డి జిల్లా): కీసర రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం చోరీ జరిగింది. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు వచ్చిన దంపతుల వద్ద నుంచి దుండగులు చాకచక్యంగా నగదు దొంగిలించారు. నాగారం గ్రామానికి చెందిన సంతోష్, లక్ష్మి అనే ఇద్దరు దంపతులు గురువారం ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కీసర రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.1.57 లక్షలు తీసుకొచ్చారు. దస్తావేజులకు రూ. 44 వేలు చెల్లించారు. మిగతా సొమ్మును బ్యాగులో ఉంచారు. బ్యాగు జిప్పు సరిగా వేయకుండానే రిజిస్ట్రార్ ఆఫీసులో వేరొక ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడుతున్నారు. ఇది గమనించిన గుర్తుతెలియని దుండగులు అందులోని రూ.73 వేల నగదు తస్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ గురువారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన
విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇంటిగ్రేటెడ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో, ఆఫ్ లైన్ ఇంటర్వ్యూల్లో అర్హత లేదంటూ కార్పొరేట్ కంపెనీలు తమను తిరస్కరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజుల్లో కోర్సు కాలం పూర్తవుతున్న నేపథ్యంలో దాన్ని మరో యేడాది పొడిగిస్తూ యూనివర్శిటీ ప్రకటన చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. -
ఉచితంగా జాగా!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మంత్రి గారి బంధువు మరోసారి భూదానం చేస్తున్నారహో...! మొన్న ఆర్టీఏ ఆఫీసుకు... ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి స్థలం ఇస్తున్నారు. నమ్మలేకున్నా ఇది రియల్ వ్యాపారంలో మరో ముందడుగు. సొంత వెంచర్‌లోని ప్లాట్లకు డిమాండ్ పెంచి.. అధిక రేట్లకు అమ్ముకోవచ్చనే ఎత్తుగడలో ఇది రెండో భాగం. జనగామలో ఉండాల్సిన ఆర్టీఏ ఆఫీసుకు.. 3.5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి గ్రామ శివారులోని రియల్ ఎస్టేట్ వెంచర్లో రెండెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వ్యవహారం ఇప్పటికే బట్టబయలైంది. స్వయానా మంత్రి బంధువు ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు డెరైక్టర్ కావడంతో ఫైళ్లు చకచకా కది లాయి. లక్షల్లో విలువైన స్థలాన్ని ఎరగా చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు వేసిన వ్యాపార ఎత్తుగడ.. మంత్రి కనుసన్నల్లో జరిగిన ‘రియల్’ మాయను కళ్లకు కట్టించింది. తాజాగా అదే వెంచర్లో మరో ప్రభుత్వ ఆఫీసుకు స్థలం కేటాయించేందుకు ఫైళ్లు కదులుతున్నాయి. ఈసారి జనగామలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఎర వేశారు. ప్రస్తుతం ఈ ఆఫీసు అద్దె భవనంలో ఉంది. శాశ్వత భవన నిర్మాణానికి 600 చదరపు గజాల స్థలం కావాలని సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మీకు స్థలం కావాలంటే... మేం ఉచితంగానే అంతమేర స్థలాన్ని విరాళంగా అందిస్తామంటూ మంత్రి బంధువు మళ్లీ పావులు కదిపినట్లు తెలిసింది. మంత్రి అండదండలు... రాజకీయ పరపతితో రిజిస్ట్రేషన్ విభాగపు రాష్ట్ర కమిషనర్‌కు ఇప్పటికే తమ సమ్మతి లేఖను అందించినట్లు సమాచారం. గతంలో ఆర్టీఏ ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని ఆనుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సైతం స్థలం ఇవ్వజూపినట్లు వినికిడి. పెంబర్తి సమీపంలోని పద్మావతి సెవెన్‌హిల్స్ డెవెలపర్స్ రియల్ వెంచర్లో భవన నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా కేటాయించేందుకు యజమానులు ముందుకు వచ్చిన విషయాన్ని స్థానిక అధికారులు సైతం ధ్రువీకరించారు. ప్రస్తుతం స్థల సేకరణ అంశం ప్రతిపాదనల దశలో ఉందని, ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఆమోదం రాలేదని వివరణ ఇచ్చారు. రూ.60 లక్షల విలువైన ఆర్టీఏ ఆఫీసు భవనంతో పాటు కొత్తగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును అక్కడికి తరలిస్తే.. వాటికి అనుబంధంగా ఉండే వ్యాపారాలతో ఆ ప్రాంతం ప్రాధాన్యం అంతకంతకు పెరగటం ఖాయం. అదే ప్రచారంతో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కోట్లకు పడగలెత్తించే ఆరాటంలో భాగంగానే మంత్రి బంధుగణం ఈ ఫైళ్లు కదుపుతున్న తీరు.. సొంత నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.