Reich
-
హోటల్లో ఇసుక స్కెచ్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎక్కువ ఇసుక రీచ్‌ల్ని దక్కించుకోవాలని టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. గతంలో ఇసుక ద్వారా కోట్లు సంపాదించుకున్న నేతలు ఆన్‌లైన్‌లోనూ ప్రతాపం చూపుతున్నారు. మహిళా సంఘాలకే ఇసుక అంటూ ప్రభుత్వం ప్రకటించిన పాలసీను సొమ్ము చేసుకున్న అధికార టీడీపీ నేతలు భవిష్యత్తులోనూ సొమ్ము వెనకేసుకునేందుకు సిద్ధమైపోయారు. ఇతరులకు దక్కకుండా విజయవాడ నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి మంతనాలు నడిపారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఆధ్వర్యంలో ఓ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. పార్టీ అంతర్గత సమావేశాల పేరిట క్యాంప్‌లు నిర్వహిస్తూ ఇసుక ర్యాంప్‌ల విషయంపైనే సుదీర్ఘ చర్చ జరుగుతోంది. సోమవారం ఇక్కడి రామలక్ష్మణ్ జంక్షన్‌లోని ఓ హోటల్లో ఇలాంటి క్యాంపే జరిగింది. సమీక్ష ఎగ్గొట్టి మరీ.. జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఎగ్గొట్టి మరీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇసుక క్యాంపులో పాల్గొన్నట్టు తెలిసింది. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు సహా టీడీపీ నేతలు హోటల్లో కూర్చుని ఆన్లైన్ ఇసుక టెండర్లలో ఎవరెవరికి ఎన్నెన్ని ర్యాంపులివ్వాలో లెక్కలేసుకున్నట్టు సమాచారం. విశాఖలోని ఎమ్‌ఎస్‌టీసీ ఆధ్వర్యంలో జరిగిన దరఖాస్తుల ప్రక్రియ నుంచి ఆన్లైన్ బిడ్డింగ్ వివరాలు తెప్పించుకుని మెజార్టీ శాతం టీడీపీ నేతలకే ర్యాంప్‌లు దక్కేలా మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే సోమవారం జరిగిన వేలంలో జిల్లాలోని 13ర్యాంపులకు ప్రక్రియ ముగిసింది. 17ర్యాంపులకు గతంలోనే నాలుగు రద్దవ్వగా జిల్లా మంత్రికి రెండు, విప్ అనుచరులకు ఒకటి, టీడీపీ నేతలకు మరికొన్ని రీచ్‌లు దక్కినట్టు తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. గుడ్విల్తోనైనా.. బెదిరించైనా, గుడ్‌విల్ ఇచ్చయినా రీచ్‌లు సొంతం చేసుకోవాలని బెజవాడ నుంచి వచ్చిన ప్రతినిధి ఇక్కడి నాయకులకు సూచించినట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో కోట్లు దక్కించుకున్న ర్యాంప్‌లు కూడా క్యూబిక్ మీటర్‌కు రూ.500లోపే వేలంలో వెళ్లినట్టు తెలిసింది. రూ.150, 500కు మధ్య అధికశాతం ర్యాంపులు వెళ్లగా రూ.458కి మరో ర్యాంపు వేలంలో పలికినట్టు తెలిసింది. ఈ ర్యాంపులో ఇతరులకు దక్కిన వాటిని గుడ్‌విల్ చెల్లించడమో, వాటాలివ్వడం ద్వారా సొంతం చేసుకోవడమో చేయాలని చినబాబు నుంచే డెరైక్షన్ వచ్చినట్టు తెలిసింది. ఎంఎస్టీసీ నుంచి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడై స్థానిక మైనింగ్ అధికారులకు నివేదిక వస్తుందని, అధికారిక తవ్వకాలూ జరుగుతాయని, జన్మభూమి కమిటీ సభ్యులు, పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ్ముళ్లకూ కొంత వాటాలిచ్చి ర్యాంప్‌లు నిర్వహించుకోవాలని సూచించి బెజవాడ బృందం తిరుగు ప్రయాణమైనట్టు తెలిసింది. విస్తృతస్థాయి సమావేశం ఉండడంతో ఇసుక క్యాంప్‌పై రహస్య సమావేశం విషయం తొలుత తమ్ముళ్లకు తెలియలేదు. సోమవారం రాత్రి హోటల్లో హడావుడి జరగడం, వాటాల విషయంలో తలెత్తిన విభేదాలు బయటపడడంతో మరో వర్గం తీవ్రమనస్తాపం చెంది తమకు వాటాలు దక్కకపోతే విషయాన్ని చినబాబు, పెదబాబుల వద్దకు తీసుకువెళ్తామని హెచ్చరించినట్టు కూడా ప్రచారం జరిగింది. -
సైఖతం
గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో మొత్తం తవ్వేసి ఆరు నెలలకే ఖాళీచేశారు. రీచ్‌ల్లో పూర్తిగా ఇసుక నిండుకొని మూతపడ్డాయి. దీంతో జిల్లాలో ఇసుక ఇక్కట్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. నిర్మాణ రంగం నత్తనడకన సాగుతోంది. ఇసుక కోసం బిల్డర్లు ఇతర జిల్లాలకు పరుగుతీస్తున్నారు. - నిండుకున్న ఇసుక.. - మూతపడిన రీచ్‌లు - నిలిచిన అమ్మకాలు - ఇక్కట్లలో నిర్మాణ రంగం సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. మరో పక్క ఇసుక డిపోల్లో సైతం ఇసుక ఖాళీ అయి పోవడంతో జిల్లాలో ఇసుక అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో అట్టహాసంగా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో జిల్లాలో గుర్తించిన 21 రీచ్‌ల్లో తవ్వకాలను ప్రారంభించారు. రెండు శాండ్ డిపోలను కూడా ప్రారంభించారు. ఒక వైపు రీచ్‌ల్లో అమ్మకాలు సాగిస్తూనే మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో రీచ్‌ల నుంచి తరలించిన ఇసుకను డిపోల ద్వారా విక్రయించి రికార్డు స్థాయిలో వ్యాపారం సాగించారు. గతంలోఎన్నడూలేని రీతిలో రీచ్‌ల ద్వారా 1.22 లక్షలు, డిపోల ద్వారా మరో 62 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించడం ద్వారా రూ.12 కోట్ల మేర వ్యాపారం సాగించారు. రీచ్‌ల ద్వారానే ఆరు కోట్ల వ్యాపారం జరగ్గా డిపోల ద్వారా మరో ఐదు కోట్ల వరకు వ్యాపారం జరిగింది. ఒక వైపు రీచ్‌ల్లో ఇసుక నిండుకోవడం.. గుర్తించిన కొత్త రీచ్‌లకు పూర్తి స్థాయిలో అనుమతుల్లేకపోవడం.. మరో పక్క శ్రీకాకుళం, విజయనగరం రీచ్‌ల్లో ఇసుక రవాణా క్రమేపి తగ్గిపోవడంతో నెల రోజులుగా ఇసుక అమ్మకాలు పూర్తిగా మందగించాయి. ప్రస్తుతం గత వారం రోజులుగా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాడుగుల మండలం సాగరం, చోడవరం మండలం గజపతినగరం రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అవి స్థానిక అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో సరిపోని పరిస్థితి. గజపతినగరంలో మరో ప్రాం తంతో పాటు సోమిదేవులపల్లిలలో గుర్తించిన ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు 10,599 ఆర్డర్ల ద్వారా లక్షా 84వేల 116 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించగలిగారు. ఇప్పటి వరకు రీచ్‌ల ద్వారా లక్షా 22 వేల 124 క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయించడం ద్వారా ఆరు కోట్ల 10 లక్షల 62వేల వ్యాపారం చేశారు. ఈ మొత్తంలో స్థాని క సంస్థలకు సీనరేజ్ కింద 48లక్షల 84వేల 960లను ఇసుక రీచ్‌లను నిర్వహించిన డ్వాక్రా సంఘాల వేతనాల కింద రూ.18 ,60,660లు, ఇన్సెంటివ్ కింద రూ.6,10,620లు దక్కింది. ఇక మిషనరీ లోడింగ్ చార్జీల పేరిట రూ.62 55,960 ఖర్చుచేశారు. ర్యాంపుల నిర్మాణం కోసం రూ.6,10,620, అప్రూవల్స్ క్లియరెన్స్‌కోసం రూ.6,10,620 ఖర్చు చేశారు. ర్యాంపుల నిర్వహణ, ఫెన్సింగ్ కోసం రూ. 6,79,740, సీసీ టీవీల ఏర్పాటు, మోనటరింగ్ కోసం ఏకంగా రూ.18,31,860 వెచ్చించారు. పరిపాలనాపరమైన ఖర్చు(సెర్ప్) కోసం 18 లక్షల 31 వేలు ఖర్చుచేసినట్టు లెక్క చూపారు. ఈవిధంగా మొత్తం రూ. కోటి 91 లక్షల 76 వేల 900 ఖర్చు చేసినట్టుగా అధికారులు లెక్కతేల్చారు. రీచ్‌లతో పాటు శాండ్ డిపోలు కూడా ఇసుక లేక బోసిపోతున్నాయి. మొత్తమ్మీద ఇసుక అమ్మకాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. -
ఇసుకాసురులు
⇒ నదులు, గెడ్డలకు తూట్లు ⇒ అనధికారిక తవ్వకాలు ⇒ దొడ్డిదారిన అమ్మకాలు ⇒ మామూళ్ల మత్తులో అధికారులు ⇒ కానరాని నిఘా.. కొరవడిన పర్యవేక్షణ ⇒ లూటీ చేస్తున్న ‘దేశం’ నేతలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సర్ప, పెద్దేరు, శారదా, తాండవ నదులతో పాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం,బొడ్డేరు,తాచేరు రిజర్వాయర్లలో ఆయా సాగునీటి వనరులకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇసుకను దృష్టిలో పెట్టుకుని రీచ్‌లను గుర్తించారు. అధికారికంగా గుర్తించిన రీచ్‌ల కంటే అనధికారికంగా ఇసుకతవ్వకాలు జరిగే ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. అనుమతులిచ్చిన రీచ్‌ల్లో ఎక్కడా సీసీ కెమేరాలు లేవు. రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌తో అనుసంధానించలేదు. ఒకరిద్దరు డ్వాక్రామహిళలు, నోరు వాయ లేని కిందిస్థాయి సిబ్బంది తప్ప ఏరీచ్లలోనూ చెప్పుకో తగ్గస్థాయి అధికారులు లేరు. డ్వాక్రామహిళలకు తవ్వకాలు, అమ్మకాలపై కనీస అవగాహన ఉన్నట్టుగా కన్పించదు. రీచ్‌ల కోసం ఏ సమాచారం అడిగినా వారు చెప్పే పరిస్థితులో లేరు. మీ సేవ..ఆన్లైన్లో జరిగే రిజిస్ట్రేషన్ మేరకు సాగే తవ్వకాలు, అమ్మకాల కంటే అనధికారికంగా సాగే అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. ఇష్టమొచ్చిన చోటల్లా ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగిస్తూ నదులు, గెడ్డలకు తూట్లు పొడిచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నుంచి సుమారు 500కు పైగా ట్రాక్టర్లు, వెయ్యికిపైగా టైరు బండ్లపై ఇసుకను ధర్జాగా తరలించు కుపోతున్నట్టుగా గుర్తించారు. అనధికారిక తవ్వకాలు జరిగే ప్రాంతాలు.. ఏజెన్సీలో మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాలైన మత్స్యగెడ్డవంతెన, బొకెల్లు కాజ్వే, రాయగడ హాస్టల్, పరదానిపుట్టుకాజ్వే, పాతరపుట్టు, రాళ్లగెడ్డ పరిసర ప్రాంతాలైన చెరుకుంపాలెం, భీమసింగ్, దేవారాపల్లి మండలం కిమరాం, బి.చంతాడ, వేచలం, మాడుగులమండలం వీరవల్లి, ఎస్.రాయవరం మండలం పెనుగల్లు, ధర్మవరం, పెదఉప్పలం, పాయకరావుపేట మండలం మంగవరం, సత్యవరం, అరట్లకోట, మోసయ్యపేట, ముటాఆనకట్టలు, అనకాపల్లిమండలం దిబ్బపాలెం, వెంకుపాలెం, సీతా నగరం, మూలపేట,చోడవరం మండలం విజయరామరాజు పేట, వడ్డాది, గౌరవరం, గజపతినగరం, జెన్నవరం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా రోజూ వందలాది ట్రాక్టర్లు, టైరుబండ్లపై టన్నుల కొద్ది ఇసుక తరలి పోతున్నట్టుగా ‘సాక్షి’ పరిశీలన లో వెలుగుచూసింది. సముద్ర ఇసుకను వదలడం లేదు వ్యాపారులు సముద్రపు ఇసుకను కూడా వదలడం లేదు. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, డిఎల్.పురం, బోయిపాడు,పెదపీనర్ల, చినపీనర్ల, బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట, కేశవరం,పాల్మన్‌పేటల్లో సముద్రపుఇసుకను తవ్వేస్తున్నారు. ఈసుకను నదుల్లోని ఇసుకతో కలిపేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ’ఇలా చెప్పుకుంటూ పోతే క్షేత్ర స్థాయిలో జరుగు తున్న అక్రమాలు లెక్కకు మించే సాగుతున్నాయి. తాండవ నదిలో తుని-పాయకరావుపేట సరిహద్దు గ్రామాల్లో ఏకంగా పొక్లెయినర్లను ఉపయోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి పూట డ్వాక్రా మహిళల మాటున సాగుతున్న తవ్వకాలు రాత్రిళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. రాత్రిపూట అనధికారిక రీచ్‌లలో వందల కొద్ది లారీలు, టైర్ల బండ్లపై తరలిస్తున్నా అధికారులు మాత్రం ఎక్కడా ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు.