rejoined
-
జనసేనకు ఝలక్.. ఐదురోజుల్లోనే సొంత గూటికి..
సాక్షి, అనకాపల్లి జిల్లా: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రలోభాలు, మాయమాటలతో మభ్యపెట్టి అయిష్టంగా తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి యత్నించిన కూటమి పార్టీలకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఝలక్ ఇస్తున్నారు. కూటమి పార్టీకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదోలా గెలవడానికి ప్రయత్నించిన ఆ పార్టీల నేతలు భంగపడిన ఘటన యలమంచిలి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పదవిలో ఉన్నారు. ఈ నెల 8న ఉమను మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, మరికొంత మంది జనసేన రాష్ట్ర, స్థానిక నేతల సమక్షంలో జనసేన పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. ఈ మేరకు ఉమకు జనసేన పార్టీ కండువా వేసిన ఫోటోలను మీడియాకు పంపించారు. అయితే కేవలం 5 రోజుల్లోనే శిలపరశెట్టి ఉమ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు.బుధవారం తాడేపల్లిలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో జరిగిన యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో ఉమ ఆమె భర్త గణేష్‌తో హాజరయ్యారు. సమావేశంలో భాగంగా మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జనసేనలో ఐదు రోజులు కూడా ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.ఎంపీటీసీల సమావేశం ఉందని మాయమాటలు చెప్పి బలవంతంగా జనసేన కండువా వేశారని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శిలపరశెట్టి ఉమ సాక్షికి తెలిపారు. పార్టీ అధినేత జగనన్నతోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేవలం ఐదు రోజుల్లోనే జనసేనను వీడడంతో లేని బలం ఉన్నట్టు చూపించుకోవడానికి ప్రయత్నించిన జనసేన నేతలు అభాసుపాలైనట్టయిందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. -
ఢిల్లీ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పెద్ద పొరపాటు చేశానంటూ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీకి షాక్ ఇస్తూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహది, పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరు నచ్చడం వల్లే వాళ్లు తాము ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అలీ మెహది చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతామన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అలీ మెహది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. తాను పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను రాహుల్ గాంధీ నమ్మకస్తుడినైన కార్మికుడిగా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్, బ్రిజ్‌పురి కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌లు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. అర్ధరాత్రి 1.25 గంటలకు వీడియో పోస్ట్ చేశారు అలీ మెహది.. చేతులు జోడించి ‘నేను పెద్ద పొరపాటు చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాను. నా తండ్రి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. తనతో వచ్చిన కౌన్సిలర్లు సైతం క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయాలని కోరారు. వీడియో విడుదల చేసిన గంటన్నర తర్వాత మరో ట్వీట్ చేశారు అలీ మెహది. ‘బ్రిజ్‌పురి కౌన్సిలర్ నాజియా ఖాటూన్, ముస్తఫాబాద్ కౌన్సిలర్ సబిలా బేగం, 300 ఓట్ల మార్క్‌తో ఓడిపోయిన బ్లాక్ ప్రెసిడెంట్ అలీమ్ అన్సారీ ఇప్పటికీ రాహుల్ జీ, ప్రియాంక జీలకు నమ్మకమైన కార్మికులు. రాహుల్ గాంధీ జిందాబాద్.’ అని పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన మరో ముగ్గురు సైతం ఆప్‌ను కలిశారు. श्री @RahulGandhi जी के जो सच्चे सिपाही होते हैं उन्हें कुछ समय के लिए दिग्भ्रमित किया जा सकता है लम्बे समय के लिए नहीं। शुक्रिया भाई @alimehdi_inc जी का जिन्होंने कुछ पल में ही गलती सुधार ली। आप कांग्रेस के जन्मजात सच्चे सिपाही हो, गलती इंसान से हो जाती है। @INCDelhi pic.twitter.com/UaqMUQGjMZ — Minnat Rahmani (@MRahmaniINC) December 10, 2022 ఇదీ చదవండి: Manneguda Young Woman Kidnap Case: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
రాజీనామా చేసి చూపించండి
టీడీపీ కార్పొరేటర్లకు ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి సవాల్ సాక్షి, రాజమహేంద్రవరం : రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామన్న టీడీపీ కార్పొరేటర్లు.. ఆ పని చేసి చూపించాలని నగరపాలక సంస్థలో ప్రతిపక్ష నేత మేడపాటి షర్మిలారెడ్డి సవాల్ చేశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణితో కలసి ఆమె మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు రాజీనామా చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదని, దమ్ముంటే చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారానికి నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు, రాజమహేంద్రవరం అభివృద్ధికి విఘాతం కలిగించారని ధ్వజమెత్తారు. ప్రజలకు నష్టం జరిగిన సమయాల్లో సమావేశాలను ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. అర్హతలు లేనందున నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించని సమయంలో సమావేశాలను వీరు ఎందుకు బహిష్కరించలేదని నిలదీశారు. పుష్కరాలకు కేటయించిన రూ.240 కోట్లలో రూ.117 కోట్లు మాత్రమే ఇచ్చినప్పుడు, పుష్కరాల తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించినప్పుడు వారికి సంతాపంగా ఎందుకు సమావేశాన్ని బహిష్కరించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పుష్కరాల్లో కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా నగరంలో పనులు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదన్నారు. అమృత్ పథకం కింద నగరానికి కేవలం రూ.3 కోట్లు ఇచ్చి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రూ.36 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదో ప్రజలకు వెల్లడించాలన్నారు. పాలకులు, యంత్రాంగం వల్ల పెరిగిన పన్నుల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో మూడూ దఫాలుగా టీడీపీ అధికారంలో ఉందని, 2006 నుంచి చట్ట ప్రకారం పన్నులు ఎందుకు పెంచలేదో అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మాసా రామజోగ్, పెంకె సురేష్, కోడికోట తదితరులు పాల్గొన్నారు.