relay initiatives
-
టీడీపీ విధానాలతోనే చేనేత సంక్షోభం
నేతన్నల సంక్షేమ పథకాలన్నీ నీరుగార్చారు : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ♦ సంక్షేమ పథకాల అమలులో పక్షపాత వైఖరి : మాజీ ఎంపీ అనంత ♦ చేనేత కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ♦ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం ధర్మవరం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి..ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తేస్తూ చేనేత వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. టీడీపీ విధానాలతోనే చేనేత రంగం నిర్వీర్యమవుతోందన్నారు. చేనేతలకు అందాల్సిన ముడిపట్టు రాయితీ బకాయిలు వెంటనే చెల్లించాలన్న డిమాండ్‌తో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలకు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధినిస్తున్న చేనేత రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. జిల్లాలో 27వేల మంది గుర్తింపు కలిగిన చేనేత కుటుంబాలకు అందాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలనూ నిలిపివేసి కష్టాల్లోకి నెడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన పక్షపాత ధోరణిని అవలంబిస్తోందన్నారు. జిల్లాలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడతుంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ పట్టడం లేదన్నారు. ఎంత సేపూ సొంత ఆదాయం తప్ప.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడే టీడీపీలో లేరని దుయ్యబట్టారు. అవసానదశలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేనేతలకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలనూ నిలిపివేసి చేనేత రంగ పతనానికి ప్రభుత్వం కారణమవుతోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. చేనేతల ఇబ్బందులను గుర్తించి అప్పట్లో ముడిపట్టు రాయితీని తీసుకొచ్చామని, జిల్లా వ్యాప్తంగా 27వేల మందికి, ఒక్క ధర్మవరంలోనే 13 వేల మందికి ప్రతినెలా రూ.600 చొప్పున రాయితీ అందేదన్నారు. టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత రాయితీని నిలిపివేయడాన్ని చూస్తే చేనేతల పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు ధర్మవరం వచ్చి రూ.600 సబ్సిడీని రూ.1,000కి పెంచుతున్నట్లు ప్రకటించారేగానీ రాయితీ నిధులు కేటాయించలేదన్నారు. వైఎస్సార్సీపీ తరఫున మూడు దఫాలు చేనేతల నుంచి సంతకాల సేకరణ చేసి, ముడిపట్టు రాయితీ అందలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించారన్నారు. ఇప్పటికి మొత్తం 21 నెలల బకాయి పెండింగ్‌లో ఉందన్నారు. జిల్లాలో 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్ప డితే కేవలం 11 మందికి మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. చేనేతల గురించి ఆలోచన చేస్తోంది తమ పార్టీ మాత్రమేనని, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి వారిని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారని గుర్తు చేశారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేదిలేదన్నారు. దీక్షల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు లాలేనాయక్, చందమూరి నారాయణరెడ్డి, నాయకులు చింతా యల్లయ్య, బాలం గోపాల్, డోల్ దాస్, తేజా, పెద్దన్న, పురుషోత్తంరెడ్డి, రంగస్వామి, ఎస్వీ రమణారెడ్డి, శేఖర్‌రెడ్డి, తోపుదుర్తి వెంకటరాముడు, మేడాపురం వెంకటేష్, ఎస్పీ బాషా, గడ్డం కుమార్, మాసపల్లి సాయికుమార్, పెద్దన్న కూర్చున్నారు. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షుడు గడ్డం కుళ్లాయప్ప, చేనేత నాయకులు బీరే జయచంద్ర, గుర్రం రాజ, లాయర్ కిష్ట, పాలబావి శీనా, గుండా ఈశ్వరయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలి
వామపక్షాలు, ప్రజాసంఘాల డిమాండ్ ► రిలే దీక్షలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంట నే నిర్ణయం తీసుకోవాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఎట్టి పరి స్థితుల్లోనూ ధర్నా చౌక్‌ను పరిరక్షించుకుంటా మని, ఇందుకోసం దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ప్రజాస్వా మ్య హక్కుల పరిరక్షణ, నిరసన తెలిపే హక్కు కోసం కలిసొచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, మేధావులను కలుపుకుని వివిధ రూపాల్లో ఆందోళనలను తీవ్రం చేస్తామని హెచ్చరించా యి. నెల రోజులు రిలే దీక్షలను నిర్వ హించి, మే 15న ఇందిరాపార్కు ఆక్రమణ, రాష్ట్రవ్యాప్త చలో ధర్నాచౌక్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి. ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా శనివారం మగ్దూంభవన్ లో చాడ వెంకటరెడ్డి, గుండా మల్లేశ్, ఆదిరెడ్డి, ఈర్ల నర్సింహా(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, గోవర్ధన్(న్యూడెమోక్రసీ–చంద్రన్న), వెంకట రామయ్య, పోటు రంగారావు (న్యూ డెమోక్రసీ–రాయల),తాండ్రకుమార్ (ఎంసీపీ ఐ–యూ), మురహరి (ఎస్‌యూసీఐ–సీ), జానకిరాములు (ఆర్ఎస్పీ), ప్రకాశ్ (ఆప్), రాజేశ్(న్యూ లిబరేషన్), వెంకటరెడ్డి (టీజేఏసీ),రవిచంద్ర(టీడీఎఫ్), కె.సజయతో కలిపి మొత్తం 50 మందితో తొలిరోజు రిలే దీక్షలను విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారం భించారు. దీక్షలో ఉన్న వారికి సాయంత్రం నిమ్మ రసం ఇచ్చి టీజేఏసీ చైర్మన్ కోదండరాం విరమింపజేశారు. ప్రజాస్వామ్యం కోసం కలసిరావాలి ప్రజాస్వామ్య హక్కుల కోసం ధర్నాచౌక్ పరిర క్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. నెల రోజులపాటు సాగే ఈ దీక్షలో పాల్గొని, సంఘీభావం తెలపవచ్చన్నారు. ప్రజాస్వా మ్యాన్ని బతికించుకోవాల్సి ఉందని, ధర్నా చౌక్ వంటిది ఉనికిలో లేకపోతే ప్రజాస్వా మ్యానికి ఉరి వేసినట్లేనన్నారు. గద్దెను ఎక్కగానే సీఎం కేసీఆర్ ధర్నా చౌక్‌ను మరిచి పోవడం భావ్యం కాదని చుక్కా రామయ్య విమర్శించారు. నిన్నటివరకు ప్రజాస్వామ్య యుతంగా పార్టీలో పనిచేసిన కేసీఆర్‌కు ప్రశ్నించే దీపాన్ని ఆర్పివేసే హక్కు లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకుని ధర్నా చౌక్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గొంతుకను నులిమే శక్తి ఏ ప్రభు త్వానికి, ఏ పార్టీకి లేదని ప్రొ.రమా మేల్కొటె అన్నారు. ప్రధాని మోదీకి రెండు కళ్లు మాదిరిగా చంద్రబాబు, కేసీఆర్ వ్యవహరిస్తు న్నారని విరసం నేత వరవరరావు ధ్వజమెత్తారు. ఏపీలో నిషేధిత సంస్థ అయిన రెవెల్యూ షనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించా రు. నిరసన తెలపడమనేది ప్రకృతి సిద్ధమైన, నైసర్గిక హక్కుని, రాచరికంలో, ఫ్యూడల్ వ్యవస్థలోనూ ధర్మగంట పెట్టి ఆపదలో ఉన్న వారు రాజు తలుపుతట్టే వీలుంటుందని చె ప్పారు. నిరసనలు లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని సామ, దాన, భేద, దండోపాయాలను పాలకులు ప్రయో గిస్తున్నారని తమ్మినేని వీరభద్రం ధ్వజమె త్తారు. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదని, ప్రశ్నించే గొంతులను, హక్కులను హరిస్తారా అని చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.