3న మెరిట్ జాబితా విడుదల
అనంతపురం మెడికల్ : జిల్లా క్షయ నివారణ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు గడిచినా మెరిట్ జాబితా విడుదల కాకపోవడంపై ‘కమిటీలతోనే సరి’ శీర్షికన గురువారం సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఆయన ఉదయం జాబితాకు తుది రూపు తెచ్చేందుకు కమిటీ వేశారు.
ఇందులో ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్‌బాబు, జబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పురుషోత్తంతో కూడిన కమిటీని వేసి శనివారానికి జాబితా తయారు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. జాబితా సిద్ధం కాగానే కలెక్టర్ కోన శశిధర్‌తో అనుమతి తీసుకుని అక్టోబర్ 3న విడుదల చేస్తామని చెప్పారు.