reorganisation
-
యూనివర్సిటీల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా.. విశ్వవిద్యాలయాల పరిపాలనకు తగిన విధంగా వాటిని పునర్వ్యవస్థీకరించలేదు. దీంతో ఆయా జిల్లాల విద్యార్థులు, అఫిలియేషన్ కలిగిన కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం కొత్త జిల్లాలు, మూడేళ్ల క్రితం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ వర్సిటీల పరిధి విషయంలో మాత్రం అవసరమైన మార్పులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనే కొత్తగా శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇప్పటికీ ఆయా ఉమ్మడి జిల్లాల పరిధికి మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో గతం నుంచే ఉన్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలపై మాత్రం భారం అలాగే ఉంది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని పలువురు కోరుతున్నారు.ప్రత్యేక కమిటీ నివేదిక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆయా కళాశాలల అఫిలియేషన్ విషయమై.. జిల్లాల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేయాలంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గతంలోనే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయగా.. ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే కళాశాలల అఫిలియేషన్ విషయానికి వస్తే.. తెలంగాణ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, శాతవాహన వర్సిటీ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి.అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ మాత్రం.. ఇప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను ఆనుకున్న నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీని దాటుకుని ఆయా జిల్లాల వారు సుదూరంలోని వరంగల్ కాకతీయ వర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీని అనుకున్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు కరీంనగర్ మీదుగానే వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. అయితే గతంలోనే ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయా వర్సిటీలు, కొత్త జిల్లాల మధ్య దూరం, కళాశాలల సంఖ్యను బట్టి పరిధి మార్పుపై ప్రతిపాదనలు చేశారు. ఆయా అంశాల ఆధారంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు తెలంగాణ వర్సిటీ పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు, శాతవాహన వర్సిటీ పరిధిలోకి ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట జిల్లాలను కేటాయించేలా నివేదికలో ప్రతిపాదించారు.చదవండి: ‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లుగతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉస్మానియా పరిధిలో ఉండగా.. కొత్త ప్రతిపాదనల ప్రకారం సంగారెడ్డి జిల్లా మాత్రమే ఆ వర్సిటీ పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. అంటే ఉస్మానియా వర్సిటీ పరిధిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలు ఉండేలా ప్రతిపాదించారు. ఇక కాకతీయ వర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండేలా నిర్ణయించారు. ఇక మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండలోని మూడు జిల్లాలు, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని ఐదు జిల్లాలు యధావిధిగా ఉండేలా నివేదికలో ప్రతిపాదించారు. కాగా ఇందుకు సంబంధించి విధాన నిర్ణయం విషయంలో జాప్యం జరుగుతోంది.పరిధులపై ప్రత్యేక కమిటీ ప్రతిపాదనలు..ఉస్మానియా: రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, వికారాబాద్ కాకతీయ: వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తెలంగాణ: నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ శాతవాహన: కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట మహాత్మాగాంధీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి పాలమూరు: మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట -
వామ్మో.. ఇవేం డివిజన్లు
సాక్షి, కరీంనగర్ : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు హడావుడిగా జరిపిన డివిజన్ల పునర్విభజన రాజకీయ పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో తదనుగుణంగా డివిజన్లను విభజించారు. కరీంనగర్ సిటీలో 2,50,484 మంది ఓటర్లు ఉండగా, 60 డివిజన్లకు విభజిస్తే ఒక్కో వార్డుకు 4,174 మంది ఓటర్లు ఉండాలి. డివిజన్ల భౌగోలిక స్వరూపం, రోడ్లు, కాలువలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో డివిజన్‌కు 3,800 నుంచి 4,500 వరకు ఓటర్లను తీసుకొని విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ అధికారులు తమకున్న తక్కువ సమయంలో ఇంటి నెంబర్లను ప్రాతిపదికగా తీసుకొని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా డివిజన్ల విభజన జరిపి ముసాయిదా డివిజన్ల జాబితాను ఈ నెల ఒకటో తేదీన ప్రకటించారు. ఇది గందరగోళంగా తయారైంది. ఇప్పటివరకు కొనసాగిన డివిజన్ల స్వరూపం చాలా చోట్ల మారిపోయింది. కొన్ని ఇంటి నెంబర్లు ఏ వార్డుల్లో కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార పార్టీ మాజీ కార్పొరేటర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన సిత్రాలు మచ్చుకు కొన్ని... ఇప్పటివరకు 20వ డివిజన్‌గా కొనసాగిన డివిజన్ ఇప్పుడు 17వ డివిజన్‌గా మారింది. ఇక్కడ కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించిన కళావతి నివాసం ఉన్న గల్లీ మాత్రం 16వ డివిజన్‌లోకి చేరింది. 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుజాత నివాసం 17వ డివిజన్‌లోకి వచ్చింది. హౌసింగ్‌బోర్డు కాలనీ ఇప్పటి వరకు 21వ డివిజన్‌గా ఉండగా, ప్రస్తుతం అది 18వ డివిజన్‌గా రూపాంతరం చెందింది. కానీ ఇందులోని 300కు పైగా నివాసాలు వేరే డివిజన్‌లోకి వెళ్లాయి. ఇక 41వ డివిజన్లోని ప్రాంతాలు కొన్ని 40, 42 డివిజన్లలోకి చేరాయి. 30వ డివిజన్ పరిస్థితి కూడా అదే. 47, 40, 15 నెంబర్లు గల పాత డివిజన్లు ఇప్పుడు పూర్తిగా స్వరూపాన్ని కోల్పోయాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 40వ డివిజన్లో 2–10–185æ నెంబర్ నుంచి 2–10–310 వరకు గల ఇళ్లు ఏ వార్డులోనూ కనిపించడం లేదు. జ్యోతినగర్‌ను 45వ డివిజన్‌గా ప్రకటించిన అధికారులు కట్టరాంపూర్‌ను 46వ డివిజన్‌గా ప్రకటించారు. ఇక ఓటర్ల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డివిజన్లో 3000 పైచిలుకు ఓటర్లు ఉంటే మరో డివిజన్లో 4500 మంది ఓటర్లుగా ముసాయిదా జాబితాను ప్రకటించడం గమనార్హం. సమయాభావం వల్లనే... జూలై నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా డివిజన్ల విభజనలో శాస్త్రీయత లోపించింది. డివిజన్ల సంఖ్య 60కి అనుగుణంగా ఓటర్ల సంఖ్యను విభజిస్తూ హద్దులు నిర్ణయించడంతో డివిజన్లు ముక్కలు ముక్కలుగా తయారయ్యాయి. గతంలో డివిజన్ల పునర్విభజనకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇంటి నెంబర్లతో సంబంధం లేకుండా ఒక వార్డు భౌగోళిక స్వరూపాన్ని ప్రామాణికంగా తీసుకొని తదనుగుణంగా ఇళ్లను చేర్చేవారు. రోడ్లు, రైల్వే లైన్లు, పార్కులు, కాలువలు, తదితర వాటిని హద్దులుగా నిర్ణయించి పునర్విభజన ప్రక్రియ సాగేది. ఈసారి శాస్త్రీయ విధానం లేకపోవడంతో ముసాయిదాలోనే గందరగోళం ఏర్పడింది. నేటితో అభ్యంతరాలకు ముగుస్తున్న గడువు ఈ నెల 1న ముసాయిదా డివిజన్ల జాబితాను అధికారులు ప్రకటించగా, శుక్రవారం వరకు అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు, స్థానిక బస్తీ పెద్దలు, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కమిషనర్, కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వార్డులను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరపాలని కోరుతున్నారు. కాగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఇప్పటికే మునిసిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ వాస్తవాలను తెలుసుకుంటున్నారు. శుక్రవారం అభ్యంతరాలకు గడువు ముగిస్తే శనివారం ఒక్కరోజులేనే వాటిని సరిచేసి, ఆదివారం తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. హడావుడిలో ఎంత మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి. -
ఎంపీటీసిల లెక్క తేలింది..!
సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) లెక్క తేలింది. సవరించిన జాబితా ప్రకారం ఎంపీటీసీల సంఖ్య 177గా నిర్ధారించారు. జిల్లాలో కలిసిన గుండాలతో కలుపుకుని 17 మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాలను రూపొందించారు. తుది జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండనుంచి యాదాద్రి భువనగిరి జిల్లాను 16 మండలాలతో ఏర్పాటు చేశారు. అయితే పాత మండలాలు 14 మాత్రమే ఉండగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతూ ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతోపాటు జిల్లాలో మోటకొండూరు, అడ్డగూడురు రెండు నూతన మండలాలు ఏర్పాటు చేశారు. మూడు మండలాలు అదనంగా చేరడంతో జిల్లాలో ప్రస్తుతం మండలా సంఖ్య 17కు చేరింది. ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 17 మండలాలతో కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. 3,500 జనాభాకు ఒక మండల ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తక్కువగా ఉన్నప్పటికీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ముందుగా జారీ చేసిన ముసాయిదా పై పలు అభ్యంతరాలు వచ్చాయి. ఎంపీటీసీల్లో విలీనమైన గ్రామాల మధ్యన దూరం తగ్గించాలని, ఓటర్ల సంఖ్యను 3,500 నుంచి 2000 కు తగ్గించాలంటూ సుమారు 20 అభ్యంతరాలు వచ్చాయి. 177 ఎంపీటీసీలు నూతన ముసాయిదా ప్రకారం జిల్లాలోని 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలను ఖరా రయ్యాయి. గతంలో జిల్లాలో 207 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 177కు తగ్గిపోయాయి. మేజర్ గ్రామపంచాయతీలైన ఆలే రు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలుగా మారాయి. భువనగిరి మున్సిపాలిటీలో రాయిగిరి, బొమ్మాయపల్లి, పగిడిపల్లి గ్రామాలు ఇలా మొత్తం మున్సిపాలటీల్లో 17 పంచాయతీలు విలీనం అయ్యాయి. గతంలో 2,500 మందికి ఒక ఎంపీటీసీ స్థానం ఉండగా ప్రస్తుతం 3,500కు పెంచారు. కాగా జిల్లాలో వలిగొండ మండలంలో17 అత్యధికంగా ఎంపిటీసీలు ఉండగా,మోత్కూరులో అతి తక్కువగా 4 ఎంపిటీసీలు ఉన్నాయి. ఆలేరు అడ్డగూడురు, మోటకొండూరులో ఏడేసీ చొప్పున ఎంపీటీసీలు ఉండగా, ఆత్మకూర్(ఎం) లోఎనిమిది ఎంపిటీసీ స్థానాలుఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. ఎంపీటీసీ,జెడ్పీటీసీల సంఖ్య ఖరారు కావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది.రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎప్పుడు ఆదేశించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటరు జాబితాలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేస్తోంది. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు ఆలేరు 7, భువనగిరి 13, బీబీనగర్ 14 , బొ మ్మలరామారం 11, చౌటుప్పల్ 12, మోట కొండూర్ 7, మోత్కూర్ 4, నారాయణపురం13, రాజాపేట 11, వలిగొండ 17, యాద గిరిగుట్ట 9, ఆత్మకూర్ 8, భూదాన్‌పోచంపల్లి 10, అడ్డగూడూరు 7, రామన్నపేట 15, తుర్కపల్లి 10, గుండాల 9 ఉన్నాయి. రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి భువనగిరి(వలిగొండ) : జిల్లాలో చాలా మం దికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదని వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. వలిగొండలో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చాలా మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేదన్నారు. దీంతో వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రానివారందరికీ వెంటనే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వేముల మహేందర్, మా టూరి బాలరాజు, చిర శ్రీశైలంరెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, ముగిలి పాక గోపాల్, కృష్ణ, అంజనేయులు, సత్తిరెడ్డి, కిష్టయ్య, రాంచందర్ పాల్గొన్నారు. 3న భాషా పండితుల సమావేశం భువనగిరిటౌన్ : హైదరాబాద్‌లోని కొత్తపేటలో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఈనెల 3వ తేదీన భాషా పండితుల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జీడిపల్లి సైదులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలుగు, హిందీ ఉర్దూ పండిట్లతో పాటు పీఈటీలందరూ హాజరుకావాలని కోరారు. -
డివిజన్ల పునర్విభజనకు ఆమోదం
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదించిన పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 83 తేదీ 4–3–2017 ద్వారా పురపరిపాలన, అర్బన్ డెవలప్మెంట్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రభుత్వం త్వరలో ఇక్కడ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామన్న సంకేతాలను ఇచ్చినట్టయింది. ఆరేళ్ళుగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకపోవడం, దీనిపై కాకినాడకు చెందిన మాజీ కౌన్సిలర్ చిట్నీడి మూర్తి హైకోర్టులో కేసు వేయడం తదితర పరిణామాలతో గత ఏడాది తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కాకినాడలో గతంలో ఉన్న 50 డివిజన్లను, కొన్ని పంచాయతీలను కలిపి హద్దులను మార్చి పునర్విభజన చేశారు. ఎస్.అచ్యుతాపురం, గంగానపల్లిలోని టీచర్స్‌కాలనీ, స్వామినగర్ ప్రాంతాలను విలీనం చేస్తూ మార్పులు, చేర్పులు చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా సేకరించారు. వచ్చిన 47 అభ్యంతరాలను పరిష్కరించి కౌన్సిల్ ఆమోదంతో తుది నివేదికను ప్రభుత్వానికి గత ఏడాది సెప్టెంబర్‌లో పంపించారు. ఈ ప్రతిపాదనలను యథావిధిగా ఆమోదిస్తూ పుర పరిపాలన శాఖ శనివారం జీవో ఎంఎస్ నెంబర్ 83 ద్వారా ఆమోదం తెలిపింది. ఎన్నికల ఊసేదీ...? పుర పరిపాలనశాఖ జారీ చేసిన జీవోలో స్పష్టత కొరవడిందని రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. గత నెల చివరిలో శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి, అనంతపురం కార్పొరేష¯ŒS ఎన్నికలకు సంబంధించి పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు. కాకినాడ విషయంలో మాత్రం కేవలం పునర్విభజనకు ఆమోదం తెలిపారే తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తదితర అంశాలపై ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదంటున్నారు. కేవలం కంటితుడుపుగా ఆమోదం తెలిపారే తప్ప మిగిలిన కార్పొరేషన్లతోపాటుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయనే అంశంపై స్పష్టత లేకపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలుత జీవో నెంబర్ లేకుండానే పునర్విభజనకు ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు రావడం, ఆ తరువాత జీవో నెంబర్‌తో ఇచ్చినా అది డౌన్లోడు కాకపోవడంతో మరికొంత గందరగోళానికి దారితీసింది. జీవో నెంబర్‌తో సహా ఉత్తర్వులు కాపీ చేతికందితే తప్ప దీనిపై ఏమి చెప్పలేమంటూ కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు నుంచి మొట్టికాయలు పడడంతో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నట్టుగా చూపించేందుకే ఇలా పునర్విభజనను ఆమోదించారా? లేక ఇతర కార్పొరేషన్లతోపాటుగా ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తారా? అనే అంశంపై ఒకటి,రెండు రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంటుందన్నారు. -
పునర్విభజనపై అనుమానాలు
-
గ్రేటర్ పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణలో ఓ అడుగు ముందుకుపడింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనను మళ్లీ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పురపాలక ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌తో సమావేశమై డివిజన్ల పునర్విభజన అంశాలపై సమీక్ష జరిపారు. నిబంధనలను పాటిస్తూ డివిజన్ల పునర్విభజన జరిపి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్ల పునర్విభజన మళ్లీ జరపాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా.. వీటి మధ్య జనాభాపరంగా తీవ్ర అసమానతలున్నాయి. కొన్నింటి పరిధిలో లక్ష వరకు జనాభా ఉంటే.. మరికొన్నింటి పరిధిలో 20 వేలకు మించి లేదు. నిబంధనల ప్రకారం జనాభా వ్యత్యాసం 10 వేలకు మించి ఉండకూడదు. 2009లో నిర్వహించిన డివిజన్ల పునర్విభజనలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఈ దుస్థితినెలకొంది. దీనిపై కొందరు వ్యక్తులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, నిబంధనల ప్రకారం మళ్లీ డివిజన్ల పునర్విభజన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉండగా.. జనాభా వ్యత్యాసాలను సరిచేసేందుకు వీటి సంఖ్యను 172కు పెంచాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో డివిజన్ పరిధిలో 35 వేలకు అటూఇటుగా జనాభా ఉండేలా పునర్విభజన జరపాలని ప్రతిపాదనల్లో సూచించినట్లు సమాచారం. అయితే, ఇప్పుడే కొత్తగా ఏర్పడే డివిజన్ల సంఖ్యను ప్రకటిస్తే.. పునర్విభజన ప్రక్రియలో సమస్యలు తలెత్తవచ్చని భావించి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. డివిజన్ల పునర్విభజన కోసం జారీ చేసే ఉత్తర్వుల్లో డివిజన్ల సంఖ్యను సూచించవద్దని నిర్ణయించింది. ఎన్నికలు వాయిదా..? జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం లేదు. జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీకాలం రానున్న డిసెంబర్ 3తో ముగియనుంది. డివిజన్ల పునర్విభజన, బీసీ రిజర్వేషన్ల చిక్కులు తొలగిపోయి ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా పడక తప్పని పరిస్థితి నెలకొంది. అదే విధంగా గత మార్చి 31న రాష్ట్రంలోని పురపాలక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పటికీ, న్యాయపరమైన చిక్కులు అడ్డురావడంతో వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట, చేగుంట, కొల్లాపూర్, అచ్చంపేట, మేడ్చెల్ పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు. కోర్టు కేసుల చిక్కులు తొలిగిపోవడంతో ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు సైతం పూర్తి చేశారు. అయితే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.