resale market
-
రీసేల్.. రివర్స్
సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. ఇది నిమ్జ్‌కు అతి సమీపంలో ఉండడంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆశపడ్డాడు. గజానికి రూ. 8 వేలు చెల్లించి 150 గజాల ప్లాట్ కొన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సదరు ఉద్యోగి తన కొడుకు చదువుకని ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.. రెట్టింపు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం బ్యాంకు వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఐదు మాసాల్లో సుమారు 3.5 లక్షల దస్తావేజులు నమోదు కాగా, ఈసారి మాత్రం 2.2 లక్షలకు డాక్యుమెంట్లు కూడా దాటలేదు. రియల్ వ్యాపారం పూర్తిగా మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. సాక్షి, హైదరాబాద్: ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు..? పిల్లల చదువుకోసమో.. అమ్మాయి పెళ్లి కోసమో.. ఇతరత్రా భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు అస్సలు గిరాకీ లేదు. కుప్పలుతెప్పలుగా వెంచర్లు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవటం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ఎన్నికల వాతావరణం కావడంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ లేకుండా పోయింది. నగరం చుట్టూ ఇదే పరిస్థితి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చేస్తున్నా యంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల తదితర ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. స్థలం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతోంది. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లు విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెరాలో నమోదు లేకుండానే నిబంధనల ప్రకారం స్థిరాస్తి సంస్థల ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíసియా, దుబా య్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తు న్నాయి. ప్రతి ఆదివారం బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నారు. రెండు మూడేళ్లుగా.. జనరద్దీ లేని చోట... అటవీ ప్రాంతాలకు సమీపంగా కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరమైతే అమ్ముకోలేక అగచాట్లు పడుతు న్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలు చేశారు. వారంతా రెండుమూడేళ్లుగా విక్రయించడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అభివృద్ధి జరిగే ప్రాంతంలోనే కొనాలి అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటేనే భవిష్యత్‌లో విక్రయించినా మంచి ధర వస్తుంది. అనుమతులు ఉన్న వెంచర్లలో కొనడమే ఉత్తమం.– సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్‌తేజ ఇన్ఫ్రా -
రీసేల్ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!
సాక్షి, హైదరాబాద్: రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. -
ఈ స్పెషల్ హ్యాండ్‌బ్యాగ్‌ని అమ్మితే.. కోట్లలో లాభాలు..
పెట్టుబడి మీద మంచి లాభాలు కొనాలంటే బంగారం, రియల్ ఎస్టేట్ సులువైన మార్గాలు. కొంచెం శ్రమిస్తే స్టాక్‌మార్కెట్ కూడా ఎక్కువ లాభాలే అందిస్తుంది. కానీ వీటన్నింటిని ఈ బ్యాగును కొన్ని కొన్నాళ్లు వాడుకుని అమ్మేసినా చాలు పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్‌ను మించి రిటర్న్స్ వస్తున్నాయి. ఇంతకీ కాసుల పంట పండిస్తున్న ఆ బంగారుబాతు లాంటి బ్యాగు పేరు హెర్మిస్ బిర్కిన్. హోదాకు చిహ్నం సెలబ్రిటీ, ధనవంతుల ప్రపంచంలో బిర్కిన్ బ్యాగులకు ఉండే క్రేజ్ వేరు. ఐశ్వర్యవంతుల కుటుంబ సభ్యులు బిర్కిన్ బ్యాగుని ధరించడం తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఈ బ్యాగును కొనుగోలు చేసేందుకు ఎంత ధరైనా చెల్లించేందుకు వెనుకడారు. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు బెక్‌హామ్ భ్యార విక్టోరియా బెక్‌హామ్ దగ్గర వందకు పైగా బిర్కిన్ బ్యాగులు ఉన్నాయి. వీటి విలువ రూ. 7 కోట్లకు పైమాటే. అదే విధంగా సింగపూర్ ఎంట్రప్యూనర్ జేమీ చువా దగ్గర అయితే ఏకంగా ఈ బ్యాగులు రెండు వందలకు పైగానే ఉన్నాయి. హిమాలయ ధర రూ.3.75 కోట్లు హెర్మిస్ బిర్కిన్ బ్యాగుల్లో అనేక మోడళ్లు ఉన్నప్పటికీ ఇందులో అత్యంత ప్రత్యేకమైనవి హిమాలయ శ్రేణి హ్యాండ్ బ్యాగులు. ఈ బ్యాగు తయారీలో ప్రత్యేకమైన జంతు చర్మం ఉపయోగించడంతో పాటు 18 క్యారెట్ బంగారంతో చేసిన మెటీరియల్ 200 వజ్రాలు ఈ బ్యాగులో పొదిగి ఉంటాయి. అమెరికన్ బెట్టింగ్ రారాజు డేవిడ్ ఓనాసియా హిమాలయన్ బ్యాగుని ఇటీవల 5 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 3.75 కోట్లు )చెల్లించి కొనుగోలు చేశాడు. ఒక్క హ్యాండ్ బాగుకి సంబంధించి ఇదే అత్యధిక ధర. ప్రపంచ రికార్డు కూడా. కానీ త్వరలోనే ఈ రికార్డు కూడా మాయం కాబోతుంది. ఎందుకంటే రాబోయే ఈ రోజుల్లో ఈ బ్యాగుని 20 లక్షల డాలర్ల (రూ.14 కోట్లు)కి అమ్మేస్తానంటూ చెబుతున్నాడు డేవిడ్ ఓనాసియా. సెలబ్రిటీ ప్రపంచంలో ఈ బ్యాగుకి ఆ స్థాయి క్రేజ్ ఉంది. ఎలా వచ్చాయి ఇంగ్లండ్‌కి చెందిన నటీ సింగర్ జేన్ బిర్కిన్ ఓసారి ప్యారిస్ నుంచి లండన్‌కి విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె తన హ్యాండ్‌బ్యాగుని లగేజ్ ర్యాక్‌లో పెట్టగా.. మార్గమధ్యంలో స్ట్రాప్ ఊడిపోయి అందులో వస్తువులన్నీ కింద పడిపోయాయి. ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణం చేస్తున్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ హెర్మీస్ సీఈవో లూయిస్ డ్యుమాస్, జేన్ కిర్బిన్ ఇబ్బందిని గమనించాడు. ఇకపై మీకు ఈ సమస్య ఉండదంటూ ఆమెకు హమీ ఇచ్చాడు. ఏడాదిలోగా అన్నట్టుగానే ఏడాది తిరిగే సరికి అత్యంత సుందరైన, సౌకర్యవంతమైన బ్యాగుని తయారు చేసి దానికి బిర్కిన్ అనే పేరు పెట్టి ఆ నటికి బహుమతిగా అందించాడు. ఈ ఘటన 1984లో జరిగింది. ఎంపిక చేసిన జంతువుల చర్మాలతో ఎంతో కళాత్మకంగా పూర్తి హ్యాండ్ మేడ్‌గా బిర్కిన్ బ్యాగు రూపొందింది. పైగా ఆనాటి ప్రముఖ నటి పేరు మీదుగా రావడం దీనికి ప్లస్ అయ్యింది. అంతే ఐదేళ్లు తిరిగే సరికి బిర్కిన్ బ్యాగ్ సెలబ్రిటీల హోదాకు ప్రత్యామ్నయంగా మారింది. డిమాండ్ ఎందుకు సెలబ్రిటీల హోదాకు బిర్కిన్ చిహ్నంగా మారడంతో 90వ దశకంలో ధనవంతులు ఈ బ్యాగులను సొంతం చేసుకునేందుకు పోటీ పడటం మొదలైంది. అయితే డిమాండ్ ఎంత ఉన్నా హెర్మిస్ సంస్థ ఈ బ్యాగులను పరిమితంగానే తయారు చేయడం ప్రారంభించింది. ఎంతటి ధనవంతులైనా.. ఎంత డబ్బులు చెల్లిస్తామన్నా ఎన్నంటే అన్ని బ్యాగులు తయారు చేయదు హెర్మిస్. పైగా బ్యాగులు కొనుగోలుపై కూడా పరిమితి విధిస్తుంది. దీంతో వీటి పట్ల క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. వీటిని తమ భాగస్వామికి బహుమతిగా అందించేందుకు కోటీశ్వరులు ఊవ్విళ్లూరుతారు. ఎలాగైనా ఈ బ్యాగు ఉండాల్సిందే అనుకునే మగువల క్యూ అంతకంతకు రెట్టింపయ్యింది. అందుకే కోట్ల రూపాయలు పోసీ బిర్కిన్ బ్యాగులు కొనేస్తున్నారు. 500ల శాతం పరిమిత సంఖ్యలో బ్యాగులు లభించడం, అపరిమిత సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో అనతి కాలంలోనే బిర్కిన్ బ్యాగుల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దానికి తగట్టే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటిని కొనేందుకు పోటీ పెరిగింది. వాడిన బ్యాగులైనా సరే అసలు కంటే ఎక్కువ ధర పెట్టి కొనడం మొదలైంది. 2017లో చేపట్టిన సర్వేలో బిర్కిన్ బ్యాగుల విలువ గడిచిన 35 ఏళ్లలో 500 శాతం పెరిగినట్టు.. ప్రతీ ఏడు ఈ బ్యాగుల విలువ 14 శాతం పెరుగుతూ వస్తోందని తేలింది. ఫేక్‌ల వెల్లువ బిర్కిన్ బ్యాగులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లో ఫేక్ బ్యాగులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. అయినా సరే ఫేక్‌లను పూర్తిగా అరికట్టలేకపోయారు. - సాక్షివెబ్ ప్రత్యేకం -
పాత ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు అమ్మేస్తారా? ఇది మీకోసమే..
సాక్షి, వెబ్‌డెస్క్: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్ మోడల్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ మొదలు స్మార్ట్ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్ ల్యాప్‌టాప్‌ల వరకు వెంట వెంటనే అప్డేట్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యను తీరుస్తూ.. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. పాతవి అమ్మాలంటే మార్కెట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్ వెర్షన్ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్‌కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్‌గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్ పోర్టల్. రీ-కామర్స్ ఇది ఈ-కామర్స్ కాదు.. రీ-కామర్స్. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ స్పీకర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఇయర్‌బడ్స్ తదితర వస్తువులన్నీ ఈ సైట్లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక.. ఫైనల్ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్ అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్తుంది. ఎక్సేంజీ కంటే మేలు ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో సైతం ఎక్సేంజ్ ఆఫర్లు రెగ్యులర్‌గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్ అమ్మేయోచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్‌లైన్‌లోకి వచ్చింది. రిటైల్ చైయిన్ యూనిషాప్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్ షాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్‌లైన్ సౌకర్యం హైదరాబాద్‌ని పలకరించే అవకాశమూ ఉంది. -
సెకండ్స్ హోమ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొత్త గృహాలకు డిమాండ్ ఎంత ఉందో రీసేల్ లేక సెకండ్ హ్యాండ్ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్.. ఉండేందుకు ఇల్లు కొనుగోలు చేసినవారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్ధిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతరత్రా అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. ♦ పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటు గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్ బిల్లు తక్కువగా రావటంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్ కొనేముందు.. రీసేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిదం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు. ♦ పాత ఇళ్లలో ఎలక్ట్రిక్ వైర్లు, ఉపకరణాలు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెడ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయా లంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహా ల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్‌కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది. నిర్వహణ భారం అనుకుంటే కొత్తవే ఉత్తమం సాక్షి, హైదరాబాద్: కొత్త గృహాలతో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్ హ్యాండ్ హోమ్స్ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి. -
రీసేల్ ఫ్లాట్ కొంటున్నారా?!
నిడమర్రు : కొత్త ఫ్లాట్ అందుబాటు ధరలో లేకపోవడం, పెట్టుబడి తగ్గించుకుని తిరిగి అమ్మే ఉద్దేశం ఉన్న సమయంలో, తక్షణం గృహ ప్రవేశం చేయలనుకున్నప్పుడు లేదా మార్కెట్ విలువలో తక్కువ ధరకు లభిస్తున్నపుడు కారణం ఏదైనా రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారా..? అయితే రీసేల్ ఫ్లాట్ విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం. ’రీసేల్ అంటే పాతదే కాదు రీసేల్ యూనిట్స్ అంటే పాతవే కాకుండా, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను ఓ వ్మక్తి కొనుగోలు చేసి అది పూర్తయిన తర్వాత విక్రయానికి పెట్టినా అది రీసేల్ ప్లాటే అవుతుంది. అలాగే నిర్మాణంలో ఉన్నవీ కావచ్చు. బిల్డర్ వద్ద ఒకరు కొని తిరిగి ఫ్లాట్ నిర్మాణం పూర్తవకపోయినా, విక్రయానికి పెట్టినా అది రీసేల్ ప్లాటే అవుతుంది. చట్టబద్ధత, పత్రాలు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్/ఇంటికి సంబంధించి చట్టబద్ధమైన హక్కుల విషయంలో ముందుగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. న్యాయ నిపుణులను సంప్రదించాలి. పాత అపార్ట్మెంట్ కొనేముందు చట్టపరమైన ప్రక్రియలను కూడా పూర్తి చేసుకోవాలి. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ రికార్డుల్లో సరిగ్గా నమోదు చేశారా, పేరు, ఇతర వివరాలు సరిగానే ఉన్నాయా? అన్నవి పరిశీలించాలి. రీసేల్ ఫ్లాట్ టైటిల్ డీడ్‌ను చాలా స్పష్టంగా రాసుకోవాలి. కొనుగోలు ఒప్పందం, సేల్‌డీడ్, అపార్ట్మెంట్ సొసైటీ నుంచి నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ), బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్ కాపీ అప్పటివరకు ఆ ఫ్లాట్‌కు యజమానులుగా వ్యవహరించిన వారి వివరాలు తెలియజేసే డాక్యుమెంట్లు అన్ని అవసరం అవుతాయి. ఎందుకు అమ్ముతున్నారో ఆరా తీయాలి ఆ ఫ్లాట్‌ను యజమాని ఎందుకు విక్రయిస్తున్నారన్న అంశాన్ని విచారించుకోవాలి. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే వదిలించుకునేందుకు ఆ ఫ్లాట్‌ను విక్రయిస్తున్నారా..? దానిపై మరెవరికైనా ఉమ్మడి హక్కులున్నాయా..? అన్నవి చూడాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకుని అది పూర్తి కాకముందే విక్రయిస్తుంటే కారణాలు అన్వేషించాలి. ఫ్లాట్‌పై రుణ బకాయిలు కొనుగోలు చేయబోతున్న ఫ్లాట్ లేదా ఇంటిపైన రుణాలు ఏవైనా ఉన్నాయా, లేదా..? అన్న అంశం కూడా చూడాలి. బ్యాంకు నుంచి తీసుకున్న ఎన్వోసీ పత్రాన్ని తీసుకోవాలి. ఒకవేళ కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ బ్యాంకు తనఖాలో ఉంటే మాత్రం.. దానిపై ఉన్న రుణం మొత్తాన్ని తీర్చేసిన తర్వాత ఫ్లాట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసేందుకు సమ్మతేనని బ్యాంకు నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. కొనుగోలుకు రుణం.. రీసేల్ ఫ్లాట్/ఇంటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నాయి. రుణాన్ని ఇచ్చే ముందు సాంకేతికపరంగా ఆ భవనం నాణ్యతను పరిశీలిస్తారు. భవనం స్థితిగతులను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆస్తి కొనుగోలుకు ఎంత ఇవ్వాలన్నది బ్యాంక్ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రుణం సేల్ డీడ్ విలువ కంటే మించకుండా ఉంటుంది. ఏ అంతస్తు నయం..? 0–15 ఏళ్ల వయసున్న రీసేల్ ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నట్టయితే పై అంతస్తునే ఎంచుకోవడమే నయం. అపార్ట్‌మెంట్‌ను నిర్మించి కొన్నేళ్లయితే డ్రైనేజీపరంగా లీకేజీలు చోటు చేసుకోవచ్చు. కింద ఫ్లోర్ నిర్మాణంలో మార్పులు జరగవచ్చు. పై అంతస్తులో కింద అంతస్తు మీద వెలుతురు వచ్చే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న ఫ్లాట్‌ను కొనడం వల్ల ధర, విలువపరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా పదేళ్ల వయస్సు ఫ్లాట్ వరకూ లాభసాటిగా ఉంటుంది. నిర్వహణ రీసేల్ ఫ్లాట్ విషయంలో మెయింటెనెన్స్ చార్జీలు గురించి వాకబు చేయాలి. నిర్మాణపరమైన నాణ్యత కూడా కీలకమే. ఎక్కడైనా నిర్మాణంలో నెర్రులు బారి ఉన్నాయేమో చూడాలి. రిజిస్టర్ డాక్యుమెంట్లలో ఉన్న ప్లాన్ ప్రకారమే ఫ్లాట్ నిర్మించారా లేదా..? అన్నది చెక్ చేయాలి. పాతది అయితే ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ వంటి అంశాలు పరిశీలించుకోవాలి. నిర్మాణపరమైన మార్పులు చేయించాల్సి ఉంటే ఆ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక అపార్ట్మెంట్ సొసైటీ నిబంధనలు ఏంటన్నదీ తెలుసుకోవాలి. పన్ను ప్రయోజనాలు రీసేల్ ఫ్లాట్‌పైనా పన్నుపరమైన ప్రయోజనా లున్నాయి. రుణం తీసుకుని రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే (మొదటిసారి సొంతింటి కొనుగోలు), తిరిగి చేసే వాయిదాల చెల్లింపులో సెక్షన్ 80సీ కింద ఏడాదిలో రూ.లక్ష మినహాయింపు, వడ్డీ రూపంలో చెల్లింపులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ ఆదాయ పన్ను చెల్లించే పనిలేదు. రీసేల్ వల్ల ప్రయోజనాలు మొదటిసారి విక్రయమవుతున్న ఫ్లాట్‌తో పాలిస్తే ధర తక్కువగా ఉంటుంది. వెంటనే ఇంట్లోకి చేరిపోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నెలనెలా అద్దె ఇంటికి చేసే చెల్లింపులు మిగులుతాయి. కనిపించని చార్జీల భారం ఉండదు. వెంటనే ఇంట్లో చేరిపోతాం గనుక అప్పటి నుంచే పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. నిర్మాణంలో ఉన్నది కొనుగోలు చేస్తే లేబర్, మెయింటెనెన్స్ పన్ను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఇంటి పన్ను ఇతరత్రా చార్జీలపై స్పష్టత ఉండదు. రీసేల్ ఫ్లాట్‌కు సంబంధించి అన్ని చార్జీలు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. -
భారీగా పడిపోతున్న ఈ కార్ల రీసేల్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జిఎం) భారతీయ కార్ల మార్కెట్ నుంచి నిష్క్రమించాలన్న ప్రకటన కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా రీసేల్ మార్కెట్ లో షెవ్రోలె కార్ల ధరలు భారీగా పడిపోయాయి. గురువారం నాటి ప్రకటన తరువాత నుంచి క్రమంగా ఈ విక్రయాలు పడిపోతున్నాయని, ఈ ధోరణి ఇకముందుకూడా కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గురువారం భారతదేశ దేశీయ విక్రయ మార్కెట్ నుండి నిష్క్రమించాలని ప్రధాన ప్రకటన చేసింది జినరల్ మోటార్. దేశీయ విఫణిలో నిరంతర నష్టాలు, చిన్న మార్కెట్ వాటా (2017 ఏప్రిల్ నాటికి 0.32 శాతం) తర్వాత కంపెనీ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ నిర్ణయం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపదని అంచనా వేసినప్పటికీ, జీఎం బ్రాండ్ షెవ్రోలె కార్ల పునఃవిక్రయాలపై మరింత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఎం ప్రకటించిన తరువాత రీసేల్ మార్కెట్లో 5శాతం పడిపోయాయి. రాబోయే రోజుల్లో 20 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే దేశీయ విక్రయాలను నిలిపి వేసినప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తామనీ కార్ల విడిభాగాలు. ఇతర సర్వీసులను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. వారెంటీలకు సంబంధించి అన్ని ఒప్పందాలను, అమ్మకాల సేవలను గౌరవిస్తామని జిఎం వినియోగదారులకు గురువారం ప్రకటించింది. అయినా వినియోగదారుల్లో ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. మరోవైపు ఈ సంవత్సరాంతానికి సంస్థ ఆథరైజ్డ్ సర్వీసులు విలువైన సేవల్ని అందించలేకపోవచ్చని ట్రూ బిల్ కో ఫౌండర్ సుభ్ బన్సాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు జీఎం బ్రాండ్లకు సంబంధించి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించడం కూడా కష్టం కావచ్చని అంచనా వేశారు. ఒక సంస్థ అమ్మకాలను నిలిపివేసినపుడు సాధారణంగా సంవత్సరం కాలంలో క్రమంగా 10-15 శాతం ధరలు పతనం నమోదవుతుందని అయితే జీఎం కార్ల విషయంలో ఇప్పటికే 5 శాతం పతనం నమోదైందని తెలిపారు. కాగా డిసెంబర్31, 2017 నుంచి విక్రయాలు ముగియనున్నాయని జీఎం ఇండియా ఎండీ కహర్ కజిమ్ ప్రకటించారు. అయితే, అమ్మకాల సేవలను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని స్థానిక వాటాదారుల మద్దతు కొనసాగిస్తామనిచ భారతదేశంలో విక్రయించిన జీఎం కార్ల భాగాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కజీమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జీఎం బీట్, స్పార్క్, సెయిల్(సెడాన్) క్రూయిజ్, ఎంజాయ్, తవేరా, ట్రయిల్ బ్లేజర్లతో సహా ఏడు మోడళ్లను విక్రయిస్తుంది.మోడళ్లను విక్రయిస్తోంది