Rescheduling process
-
తిరగరాశారు!
ఈ గణాంకాలు చూస్తుంటే బ్యాంకర్లు రైతుల పాలిట స్పందించిన తీరు అమోఘమనిపిస్తోంది కదూ. కానీ ఇదంతా బ్యాంకర్లు చూపిస్తున్న లెక్కల మాయ. అసలు సంగతి ఏమిటంటే.. రబీ సీజన్లో రైతుల చేతికి వచ్చిన రుణం కేవలం రూ.29.01 కోట్లు మాత్రమే. ఈ రుణ మొత్తం అందింది 20,023 మంది రైతులకే. మిగతా రుణాలన్నీ రెన్యూవల్, రీషెడ్యూల్ చేసినవే. బుధవారం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్(ఎల్డీఎం) జిల్లా యంత్రాంగానికి సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. - పంటరుణాల పంపిణీలో బ్యాంకర్ల గిమ్మిక్కులు - రెన్యూవల్, రీషెడ్యూల్ ప్రక్రియతో సరిపెట్టిన వైనం - ఎండమావిగా ఆర్థికసాయం రబీ సీజన్లో పంటరుణాల లక్ష్యం : రూ.272.44 కోట్లు ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు : రూ.256.42 కోట్లు లబ్ధిపొందిన రైతులు : 58,362 రబీలో రుణ పంపిణీ సాధన : 94.1శాతం సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారీ స్థాయిలో పంట రుణ ప్రణాళిక రూపొందించడం.. చివరకు కాకి లెక్కలతో పురోగతిని వివరించడం జిల్లా యంత్రాంగానికి పరిపాటిగా మారింది. రైతులకు కోట్ల రూపాయల రుణాలిస్తున్నామంటూ ప్రగల్బాలు పలికే బ్యాంకర్లు.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లెక్కల మాయ చేసి లక్ష్యాల్ని సాధించినట్లు చూపిస్తున్నారు. ఇందులో కొత్తగా రుణాలందించడం అతితక్కువగా ఉండడం, పాత బకాయిలనే రెన్యూవల్ లేదా రీషెడ్యూల్ చేయడం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లోనూ ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. రూ. 272.44 కోట్లు ఇస్తామని కార్యచరణ విడుదల చేసిన అధికారులు.. ఇప్పటివరకు రూ.29.01 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా రూ.227.41 కోట్లు రీషెడ్యూల్, రెన్యూవల్ చేసి 94.1శాతం లక్ష్యం సాధించినట్లు చెప్పుకోవడం గమనార్హం. రికార్డుల్లోనే అంకెలు.. వరుస నష్టాలతో కుదేలవుతున్న రైతులకు పంటల సాగుకు పెట్టుబడి రూపంలో బ్యాంకులు రుణాలందిస్తాయి. ప్రభుత్వమే ఇందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తుంది. భూముల పాసు పుస్తకాల్ని తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలివ్వడం సాధారణమే. కానీ ప్రస్తుతం బ్యాంకులు రూటు మార్చాయి. రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గతేడాది ఖరీఫ్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాను కరువు ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా ఆర్థిక చేయూత అందించాలి. ఈ క్రమంలో రుణాలు రీషెడ్యూల్ చేసిన బ్యాంకులు.. చివరగా రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా చేతులె త్తేశాయి. జిల్లావ్యాప్తంగా 62వేల మంది రైతులకు రూ.211.25 కోట్లు రెన్యూవల్ చేయగా 5,807 మంది రైతులకు రూ.16.16 కోట్లు రీషెడ్యూల్ చేశారు. చెయ్యిచ్చిన ప్రధాన బ్యాంకుల - జిల్లాలో లీడ్ బ్యాంకుగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) వ్యవహరిస్తోంది. - ఈ క్రమంలో ప్రస్తుత రబీ సీజన్లో రూ.65.5కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. - కానీ ఈ బ్యాంకు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా కొత్తగా రుణం ఇవ్వలేదని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కు సైతం రూ.2.44 కోట్ల లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఒక్కపైసా రైతులకు రుణరూపంలో ఇవ్వలేదు. ప్రధాన బ్యాంకులే మొండికేయడంతో జిల్లాలో ఆర్థిక సాయం కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన సభావట్ లింగా 2012లో తనకున్న 4.20 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి మాల్ ఆంధ్రాబ్యాంకులో రూ. 80 వేల రుణం తీసుకున్నాడు. వడ్డీతో సహా రూ.లక్ష ఏడు వేలు అయింది. ప్రభుత్వం రుణమాపీ చేయడంతో రూ. 25 వేలు మాఫీ అయింది. కొద్ది రోజుల కింద లింగా బ్యాంకులో రెన్యూవల్ చేసుకున్నాడు. రూ.లక్ష రుణం కింద జమ చేసుకొని కేవలం రూ.7 వేలను మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు మీద మళ్లీ రూ.లక్ష అప్పు అలానే మిగిలింది. -
దా'రుణం'
స్పష్టం చేస్తున్న బ్యాంకర్లు ఖరీఫ్‌కు రుణాలు కష్టమే రీషెడ్యూల్ అయితే 12 శాతం వడ్డీ భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన టీడీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోంది. హామీని నమ్ముకొని కట్టాల్సిన రుణం చెల్లించకుండా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వేలాది మంది కర్షకుల్లో అయోమయ పరిస్థితి నెలకుంది. పూర్తిగా రద్దు చేస్తాం ... రుణాలు కట్టవద్దంటూ పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. నెల తిరక్కుండానే మాట మార్చి కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంట రుణం అయినా, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలైనా లక్షన్నర దాటితే మిగిలిన మొత్తం రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చేయడంతో వడ్డీ భారం తలచుకొని రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: రైతు రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి లీడ్‌బ్యాంక్‌కు ఇప్పటి వరకూ ఆదేశాలు రాలేదు. ఎప్పుడు వస్తాయన్న అంశంపై తమకు స్పష్టత లేదని చెబుతున్నారు. రుణమాఫీ, రీషెడ్యూల్ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అప్పటి వరకూ కొత్త రుణాలు ఇచ్చే అవకాశాలు కనపడటం లేదంటున్నారు. లక్షన్నర రుణం మాఫీకి సంబంధించి ఇప్పటి వరకూ రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకర్లకు సమాచారం లేదు. రుణాలు చెల్లించాల్సిన కాలపరిమితి దాటిపోతే 12.5 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం రాలేదు. లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ అవుతుందని చెబుతున్నారు. దీనిపై కూడా స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అయోమయం... జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా... ఇందులో కౌలురైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటరుణాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రకాశం జిల్లాలో రైతులకు 5,800 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు. బ్యాంకులలో వ్యవసాయ రుణాలురూ. 6,900 కోట్ల వరకూ ఉన్నాయి. ఇందులో రుణమాఫీ కింద ఎంత వరకు మాఫీ అవుతాయి, ఇంకా ఎంత చెల్లించాలనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పెదవి విరుపు డ్వాక్రా సంఘాల రుణాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకుంది. డ్వాక్రా రుణాలు కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రుణాలుగానే తీసుకున్నారు. లక్ష రూపాయలు, 50 వేల రూపాయల రుణం తీసుకున్న గ్రూపులకు ఈ నిర్ణయం ఊరట కలిగించినా, లక్షకు మించి రుణం తీసుకున్న గ్రూపులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సక్రమంగా రుణాలు చెల్లిస్తూ రావడం వల్లే తమకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ రుణం తీసుకునే అవకాశం వచ్చిందని ఆయా గ్రూపులు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ కచ్చితంగా చెల్లిస్తూ వచ్చిన తమకు ఈ నిర్ణయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ పునరాలోచించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు.