the Reserve Bank of India
-
ఒక్కో స్టాల్.. ఒక్కో ప్రత్యేకత
ఒక్కో స్టాల్లో ఒక్కో ప్రత్యేకత. ఒక్కో పుస్తకం ఎన్నో అంశాల కలబోత. మొత్తంగా విజయవాడ పుస్తక మహోత్సవమే ఓ విజ్ఞాన భాండాగారంగా మారిపోయింది. ఎటుచూసినా పుస్తకాలే. ఎక్కడ విన్నా విజ్ఞానాన్ని పంచే విషయాలే. చిన్నారులు నేర్చుకునే అ..ఆ..ల నుంచి పెద్దల ఆధ్యాత్మిక పుస్తకాల వరకూ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే స్టాల్లో ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయి? అనే వివరాలు మీకోసం ప్రత్యేకం.. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ‘నోట్’ దిస్ పాయింట్ బుక్ ఎగ్జిబిషన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్టాల్ పెట్టడం ఇదే ప్రథమం. ఫైనాన్షియల్ లిటరసీ అనేది రిజర్వ్ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ‘మీ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోండి..’ అనే అంశంపై ఇక్కడ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. చిరిగిన నోట్లను వెనక్కు ఇవ్వడం ఎలా అనే విషయాలను వివరిస్తున్నారు. పెద్దపెద్ద బ్యాంకులు, సంస్థల పేర్లతో వచ్చే తప్పుడు మెయిల్స్‌ని గుర్తించడం ఎలా?, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఫారెన్ ఎక్స్ఛేంజ్పై అవగాహన, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, ప్రైవేటు సంస్థల్లో అంటే నాన్‌బ్యాంకింగ్ రంగాల్లో డబ్బు పొదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... వంటి ప్రధాన అంశాల గురించి ఉచితంగా బ్రోచర్లు పంచుతున్నారు. పదేళ్ల వయసు దాటిన పిల్లలు బ్యాంక్ అకౌంట్ తెరవడం ఎలా? ఏటీఎం కార్డు ఉపయోగించడం, చెక్ బుక్ వాడటం అన్నీ వివరిస్తున్నారు. ..ఈ వివరాలకు సంబంధించిన విషయాలను కామిక్ బుక్స్ రూపంలో పిల్లలకు అంటే 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నామని ఆర్బీఐ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. తమ స్టాల్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. -
2005 క్రితం కరెన్సీ నోట్ల మార్పునకు గడువు పొడిగింపు
ముంబై: 2005 క్రితం నాటి రూ.500, రూ.1,000సహా పలు డినామినేషన్లలోని కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది. ఈ ఏడాది చివరి వరకూ ఉన్న గడువును మరో ఆరు నెలలు 2016 జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కేవలం గుర్తింపు పొందిన బ్యాంక్ బ్రాంచీలు, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో మాత్రమే బ్యాంక్ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జనవరితో ముగిసిన 13 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో 164 కోట్లకుపైగా 2005 క్రితం నోట్లను వ్యవస్థ నుంచి (చించివేత యంత్రం ద్వారా) తొలగించినట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.21,750 కోట్లు. -
ఉల్లంఘనపై సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్‌కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్‌ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్‌ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు తాకట్టుపెట్టుకునే సమయంలో ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు ఎలా వ్యవహరించాయి అనే విషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంగా వివరించారు. చోరీ బంగారాన్ని తాకట్టుపెట్టుకున్నా, ఖరీదు చేసినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇదే తర హాలో వ్యవహరిస్తే వారి లెసైన్స్‌లను కూడా రద్దుచేయమని ఆర్బీఐకి లేఖ రాస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు-ఉల్లంఘనలు ఇలా...... నిబంధన: పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, ఏదైనా గుర్తింపుకార్డు, బ్యాంకు పాస్‌బుక్, టెలిఫోన్ బిల్లు, ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన లేఖ వీటిలో ఏవైనా మూడు ఆధారాలు తీసుకోవాలి. ఉల్లంఘన: ముత్తూట్, శ్రీరామా సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీలు శివ నుంచి కేవలం పాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ జిరాక్స్ కాపీలను మాత్రమే తీసుకున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కేవలం 18 రోజుల స్వల్ప వ్యవ ధిలోనే ఈ రెండు కంపెనీలు నగలను తాకట్టు పెట్టుకుని రుణం మంజూరు చేశారు. నిబంధన: ఫైనాన్స్ కంపెనీలో ఆరు నెలలకుపైగా పనిచేసిన సీనియర్ అధికారి ఎవరైనా సరే ఖాతాదారుడిని ఇంటర్వ్యూ చేయాలి, వారి వేలి ముద్రలు కూడా తీసుకోవాలి ఉల్లంఘన: శివ గ్యాంగ్ సభ్యులను ఎలాంటి ఇంటర్వ్యూ చేయలేదు. వారి వేలి ముద్రలు కూడా సేకరించలేదు. నిబంధన: ఖాతాదారుడు సమర్పించిన మూడు గుర్తింపు పత్రాలు సరైనాలేవా అనే విషయాన్ని విచారించి నిర్దారించాలి. ఉల్లంఘన: శివ సమర్పించిన గుర్తింపు పత్రాలపై విచారించలేదు. పరిశీలించలేదు. నిబంధన: స్వచ్ఛమెన బంగారం లేదా కరిగించిన బంగారం ముద్దను తాకట్టు పెట్టుకోవడం నేరం. ఆభరణాలను మాత్రమే తాకట్టు పెట్టుకోవాలి. ఉల్లంఘన: వీరు ఆభరణాలతో పాటు బంగారం ముద్దలను తాకట్టు పెట్టుకుని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (యన్బీఎఫ్సీ ) నిబంధనలు ఉల్లంఘించారు. కలలో కూడా అనుకోలేదు... రికవరీ విషయంలో కమిషనర్ సీవీ ఆనంద్, ఇన్చార్జ్ డీసీసీ జానకీ షర్మిల తీసుకున్న చొరవ అంతాఇంతకాదు. పోయిన బంగారు గొలుసు దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. - లక్షీ్ష్మనర్సమ్మ