reserve bank policy
-
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వడ్డీరేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఈ వారంలో జరిగే ద్వైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ .. పాలసీ రేట్లను క్రమానుగతంగా కఠినతరం చేసే విధానం నుంచి తటస్థ విధానానికి మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్ల పెరుగుదల, ద్రవ్యలోటుపరమైన సవాళ్ల కారణంగా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని చెబుతున్నారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ అంచనా వేసిన 3.8 శాతం కన్నా తక్కువగా 2.6 శాతంగానే నమోదైన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం, అటు అంతర్జాతీయంగా మందగమన ఆందోళనల నేపథ్యంలో 2018–19లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ సమీర్ నారంగ్ చెప్పారు. పరపతి విధానాన్ని మార్చుకోవడానికి ఆర్బీఐ దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని, అయితే విద్య, వైద్యం, గృహావసరాల వ్యయాలు అధికంగానే ఉండటం వల్ల రేట్ల తగ్గింపునకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇటు పెరుగుతున్న ముడి చమురు ధరలు, అటు ద్రవ్యపరమైన సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఆర్బీఐ పాలసీపరంగా సంక్లిష్టమైన నిర్ణయాలే తీసుకోవాల్సి రావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ డీబీఎస్ ఎకనామిక్స్ పేర్కొంది. ఉర్జిత్ పటేల్ నిష్క్రమణ అనంతరం కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ సారథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి 7 దాకా మూడు రోజులపాటు ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. 7వ తేదీ(గురువారం) మధ్యాహ్నం పాల సీ నిర్ణయం వెలువడుతుంది. ఈ ఆర్థిక సంవత్స రం రెండు సార్లు రేట్లను పెంచిన ఆర్బీఐ క్రమానుగతంగా కఠినతర విధానాన్ని పాటిస్తోంది. డిసెంబర్లో రేట్లను మార్చకపోయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు లేకపోతే తగ్గించే సంకేతాలే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్లేషకుల అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 9న ఆర్బీఐ బోర్డుతో ఆర్థిక మంత్రి భేటీ.. సాంప్రదాయం ప్రకారం బడ్జెట్ అనంతరం ఫిబ్రవరి 9న ఆర్బీఐ బోర్డు సభ్యులతో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ సమావేశం కానున్నారు. మధ్యంతర బడ్జెట్లో కీలక అంశాల గురించి వివరించనున్నారు. ఆర్బీఐ ఆరో ద్వైమా సిక పాలసీ విధాన సమీక్ష అనంతరం రెండు రోజులకు ఈ భేటీ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర డివిడెండ్ చెల్లించాలన్న కేంద్రం సూచన కూడా ఇందు లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం రూ. 28,000 కోట్ల దాకా మధ్యంతర డివిడెండ్ రావొచ్చని అంచనా వేస్తోంది. -
ఆయిల్ షేర్లలో అమ్మకాలు
టోకు ధరల సూచి 14 నెలల గరిష్టస్థాయికి పెరగడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ తగ్గాయి. ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరినందున వచ్చే రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు కొన్ని బ్లూచిప్ షేర్లను విక్రయించారు. దాంతో సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి మూడువారాల కనిష్టస్థాయి 20,659 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 14 పాయింట్ల తగ్గుదలతో 6,154 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణపై మంగళ, బుధవారాల్లో జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోవొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ల బలహీనతకు కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ఇన్ఫీ, విప్రో కౌంటర్లలో లాంగ్ బిల్డప్... అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కుదుటపడుతున్న ఫలితంగా ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్లో కూడా మంచి ఫలితాలు వెల్లడించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఇటు దృష్టిసారించడంతో ప్రధాన ఐటీ షేర్లు అత్యంత గరిష్టస్థాయిలో ముగిసాయి. సెప్టెంబర్ క్వార్టర్లో అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించినా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో భారీ లాభాల స్వీకరణ కారణంగా అప్పట్లో ఈ షేర్లు పెరగలేకపోయాయి. ఇప్పుడు అదే విభాగంలో ఇన్ఫోసిస్, విప్రో కౌంటర్లలో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఇన్ఫోసిస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 66 వేల షేర్లు (1.88 శాతం), విప్రో కాంట్రాక్టులో 2.38 లక్షల షేర్ల (2.6 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్ రూ. 3,400 స్ట్రయిక్ వద్ద కాల్కవరింగ్, పుట్ రైటింగ్ జరగడంతో ఈ స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 60 వేల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 1.30 లక్షల షేర్ల మేర యాడ్ అయ్యాయి. అలాగే విప్రో రూ. 510 స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్ జరగడంతో 42 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 23 వేల షేర్లు కట్ అయ్యాయి. ఇన్ఫోసిస్ రూ. 3,400పైన, విప్రో రూ. 510పైన స్థిరపడితే రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగవచ్చని, ఆయా స్థాయిల దిగువకు క్షీణిస్తే క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.