restaurant owner
-
Smriti Irani Daughter: స్మృతి ఇరానీపై ట్రోలింగ్
గోవా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. తన కూతురు జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై ఆమె ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే క్షమాపణలు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ కీలక నేతలకు లీగల్ నోటీసులు కూడా పంపారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఉత్తర గోవా అస్సాగావ్‌లో సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్‌కు లీగల్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని స్వయంగా గోవా ఎక్సైజ్ శాఖ ధృవీకరించింది. అంతేకాదు.. నిజంగానే ఇల్లీగల్ బార్ లైసెన్స్‌తో నడుస్తోందని తేల్చింది. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి పేరిట కిందటి నెలలో లైసెన్స్‌ను రెన్యువల్ చేశారని నిర్ధారణ చేసుకుని మరీ నోటీసులు పంపినట్లు ప్రకటించింది. అయితే దానికి ఓనర్ ఎవరనే విషయంపై మాత్రం ఎక్సైజ్ శాఖ మౌనం వహించడం గమనార్హం. మెనూ వైరల్ ఇదిలా ఉంటే.. గతంలో కూతురు నడిపించే సదరు కేఫ్ అండ్ బార్‌కు, ఆమె డిషెస్‌కు దక్కిన రివ్యూలపై స్వయంగా స్మృతి ఇరానీనే స్పందించడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన మీడియా కథనాలు, ఆమె ఇచ్చిన రివ్యూ తాలుకా స్క్రీన్షాట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆమె నడిపిస్తున్న రెస్టారెంట్ మెనూను సైతం కొందరు తెర మీదకు తెస్తున్నారు. #smritiiranidaughter హ్యాష్ ట్యాగ్‌తో పేరుతో ఆ మెనూలో బీఫ్ ఉండడాన్ని ప్రస్తావిస్తున్నారు. తల్లి ఫేక్ డిగ్రీలాగే.. కూతురు ఫేక్ లైసెన్స్‌తో అబద్ధాలతో బార్ నడిపిస్తోందంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇది రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది. Delicious Menu at #smritiiranidaughter 's BAR. pic.twitter.com/SsS6KxetCE — Anup Dhote | अनुप धोटे (@AnupDhote_IYC) July 25, 2022 Ammi bole Mummy, Beti bole Yummy? BJP member Smriti Irani's daughter caught in controversy of serving Beef in Goa's Restaurant & Bar. #BeefJihad #smritiiranidaughter #SillySoulsGoa pic.twitter.com/zbxUeQEtl4 — Faithful Indian 🇮🇳 (@faithfulindian8) July 25, 2022 Hotel Taj Palace New Delhi on 24 May 2022 The queue is of candidates for walk-in interview for Air India Cabin Crew Educated hotel management students are struggling for jobs but #smritiiranidaughter is running bar Cafe just after doing 12th class wah.#स्मृति_ईरानी_चुप्पी_तोड़ो pic.twitter.com/1MOA7jmuOf — ਮਨਰਾਜ मनराज singh (@manraj_mokha) July 25, 2022 స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ తన ఇన్స్టాగ్రామ్ బయోలో ఆ కేఫ్‌కు కో-ఫౌండర్‌గా పేర్కొనడం విశేషం. మరోవైపు తమ పార్టీ ఒత్తిడి మేరకు ఈ బ్యార్ వ్యవహారంపై అధికారులు చర్యలు ప్రారంభించారని, అయితే సిన్సియర్‌గా వ్యవహరించిన ఓ అధికారిని ఒత్తిళ్లతో అక్కడి నుంచి బదిలీ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన జోయిష్ అదంతా ఆధారాలు లేని నిందలని చెబుతోంది. తాను ఓనర్‌ను కాదని, అసలు ఆ రెస్టారెంట్‌ను తాను నడపడం లేదని, పార్ట్‌టైంగా అక్కడ రకరకాల డిషెస్ వండుతున్నానని జోయిష్ స్పందించారు. ఇక కూతురిని టార్గెట్ చేసుకుని తనపై విమర్శలు గుప్పించడంపై ఇదివరకే తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. న్యాయస్థానం, ప్రజాకోర్టులో తాను సమాధానాలు కోరుతానన్నారు. సోనియా, రాహుల్ గాంధీ రూ.5వేలకోట్ల దోపిడీపై తన తల్లి(స్మృతినే ఉద్దేశించుకుని..) విలేకరుల సమావేశం పెట్టడమే తన కూతురు తప్పని.. 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై తన తల్లి పోటీ చేయడమే ఆమె తప్పని స్మృతి ఇరానీ ఆరోపించారు. తన కూతురు జోయిష్ స్టూడెంట్ అని, చదువుకుంటోందని, ఆమెకు ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్మృతీ ఇరానీ మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ మాత్రం.. ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీఐ యాక్టివిస్ట్‌గా తనకు తాను చెప్పుకునే రోడ్రిగ్యూస్ అనే వ్యక్తి.. బీజేపీ వ్యతిరేక చేష్టల్లో భాగంగానే కావాలనే ఈ వివాదంలోకి స్మృతీ ఇరానీ, ఆమె కూతురిని భాగం చేస్తున్నాడంటూ బీజేపీ మద్దతుదారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ అంతా కాంగ్రెస్ నడిపిస్తున్న కుట్రేనని ఆరోపిస్తున్నారు. -
దొంగకే జాబ్ ఆఫర్ చేసిన రెస్టారెంట్ యజమాని
జార్జియా: అమెరికాలోని జార్జియాలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కార్ల్ వాలెస్ తాళం కాదు ఏకంగా జాబే ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దీ రోజుల క్రితం ఓ తెల్లవారు జామున 4 గంటలకు ఓ దొంగ అద్దాలు పగలగొట్టి లోపలికి దూరాడు. అయితే అతనికి ఏమీ దొరక్క అక్కడే ఉన్న క్యాష్ బ్యాక్సు ఎత్తుకెళ్లాడు. వాడో తింగరోడులాగున్నాడు ఎందుకంటే అది ఖాళీదట. ఉదయాన్నే రెస్టారెంట్‌కు వచ్చిన ఆ యజమానికి ముందు విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత అతన్ని చూసి విపరీతమైన జాలీ వేసింది. పాపం అతనికి ఎంత కష్టం వచ్చిందో, అందుకే చివరకు క్యాష్ లేని బాక్సు కూడా ఎత్తుకెళ్లాడని చెబుతూ ‘నాయనా మా రెస్టారెంట్లో జాబ్ కోసం దరఖాస్తు చేసుకో జాబ్ ఇస్తాను. నువ్వే చేసే దొంగతనం కన్నా ఇది చాలా మంచి పనేగా’ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. పోలీసులకు భయపడి రాడేమో అని ఫిర్యాదు కూడా ఇవ్వను అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్టుకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ తింగరి దొంగ మాత్రం స్పందించనేలేదట. చదవండి: వాట్సాప్ వినియోగదారులకి సీఈఆర్టీ హెచ్చరిక -
ధాబా బాబా.. కొత్త రెస్టారెంట్
న్యూఢిల్లీ: విధి ఎవరిని ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి లేటు వయసులో అదృష్టం తలుపుతడుతుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదానిపై తదుపరి భవిష్యత్ ఆధారపడుతుంది. 80 సంవత్సరాల కాంతా ప్రసాద్‌కు చాలా లేటు వయసులో అదృష్టం వరించింది. ‘బాబా కా దాభా’ ఓనరైన కాంతా ప్రసాద్ చివరకు ఒక రెస్టారెంటు ఓనరయ్యాడు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఆరంభించిన ఈ రెస్టారెంటును చూసుకుంటూనే తన పాత దుకాణాన్ని కూడా కొనసాగిస్తానని చెప్పారు. ఇందులో పనిచేసేందుకు ప్రసాద్ ఇద్దరిని నియమించుకున్నారని తనతో కలిసినడిచే సామాజిక కార్యకర్త తుషాంత్ అద్లాకా చెప్పారు. బుధవారం నుంచి రెస్టారెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. రెస్టారెంటుపై రూ. 5లక్షల పెట్టుబడి పెట్టారని, సదరు బిల్డింగ్‌కు నెలకు రూ. 35వేలు అద్దెని చెప్పారు. 80 ఏళ్ల ప్రసాద్ చివరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాబా కా ధాబాపేరిట ఢిల్లీలో చిన్నపాటి హోటల్ నడుపుకునే కాంతా ప్రసాద్ వ్యాపారంపై కరోనా ప్రభావం పడింది. దీంతో జీవనం గడవక కన్నీరుమున్నీరవుతున్న కాంతా ప్రసాద్ బాధలను గౌరవ్ వాసన్ అనే వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో చాలామంది ప్రసాద్‌కు ఆసరాగా నిలిచి ఆర్థిక సాయం చేశారు.అనంతరం ఒక నెలకు తన వీడియో పోస్టు చేసిన వ్యక్తిపైనే నిధుల దుర్వినియోగం చేస్తున్నాడంటూ ప్రసాద్ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా కాంతా ప్రసాద్ అదే పేరిట ఒక రెస్టారెంట్‌ను ఆరంభించారు. -
బిల్లు 500.. టిప్పు 2 లక్షలు!
క్లీవ్‌లాండ్: ఓహియో రాష్ట్రం (అమెరికా) క్లీవ్‌లాండ్ నగరంలోని ఓ రెస్టరెంట్‌కు ఆదివారం ఒక కస్టమర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 7 డాలర్ల (దాదాపు 500 రూపాయలు) బిల్లుకి 3,000 డాలర్ల (సుమారు రూ. 2.21 లక్షలు) టిప్పు కలిపి మొత్తం 3,007 డాలర్లు చెల్లించాడు. రెస్టరెంట్ యజమాని బ్రెండన్ రింగ్ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ.. ‘‘ఓహియోలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రెస్టరెంట్‌ను స్వచ్ఛందంగా జనవరి వరకూ మూసివేయాలనుకున్నాం. చివరి రోజు కావడంతో ఆదివారం రెస్టరెంట్ కిటకిటలాడుతూ ఉంది. అంతలో అప్పుడప్పుడు మా దగ్గరికొచ్చే ఒక కస్టమర్ లోపలికొచ్చాడు. ఒక స్టెల్లా డ్రింక్ ఆర్డర్ చేశాడు. రెండు సిప్పులు తాగిన తర్వాత ‘చెక్’ ఇమ్మన్నాడు. దాన్ని తీసుకుని రింగ్ టేబుల్ వద్దకొచ్చిన అతను బిల్లుతో పాటు రింగ్‌కు డబ్బులిస్తూ ‘‘గుడ్‌లక్. మళ్లీ కలుద్దాం!’’ అని వెళ్లిపోయాడు. ఆ బిల్లుపై టిప్పు ముందు 300 గా కనబడింది. కళ్లజోడు పెట్టుకున్నాక గానీ అది 3,000 అని తెలియలేదు. వెంటనే బయటకు పరుగు తీసి అతన్ని కలిసాను. ‘‘ఏమైనా పొరబడ్డారా?’’ అని అడిగాను. అందుకతను ‘‘లేదు. తెలిసే ఇచ్చాను. దాన్ని స్టాఫ్ అందరికీ పంచండి. మెరీ క్రిస్మస్’’ అన్నాడు. ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానని మొదట ఒక వెయిట్రెస్ నమ్మలేదు. ఆ రోజు నలుగురు డ్యూటీలో ఉన్నారు. తలా 750 డాలర్లు ఇచ్చాను’’ అని వివరించాడు. అయితే తన పేరు బయటపెట్టొద్దని ఆ కస్టమర్ కోరాడని రింగ్ తెలిపాడు. ఈ సంఘటన పేపర్లో రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ‘అజ్ఞాత’ కస్టమర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన సోదరి కూడా ఈ విషయాన్ని పేపర్లో చదివిందని ఉత్సాహంగా చెప్పాడు రింగ్. ‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప కథలా కనిపిస్తుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. -
723 సంవత్సరాల జైలు శిక్ష!
థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు అక్కడి స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థాయిలాండ్‌కు చెందిన అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు 2019 సెప్టెంబర్‌లో తమ వద్దకు వచ్చే కస్టమర్లకు వోచర్లు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ఇది తెలుసుకున్న కస్టమర్లు వోచర్లను కొనుగోలు చేశారు. వోచర్లు పొందిన వారంతా రెస్టారెంట్లకు వెళితే రెస్టారెంట్ యజమానులు మాత్రం ఆ వోచర్లు చెల్లవంటూ చేతులెత్తేశారు. డిస్కౌంట్ వస్తుందన్న ఆశతో వోచర్లు కొనుక్కుంటే ఇప్పుడు చెల్లవంటే ఎలా కుదురుతుందంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రెండు రెస్టారెంట్ల ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో మొదట వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, తాము చేసింది తప్పేనంటూ రెస్టారెంట్ల యజమానులు ఒప్పుకొన్నారు. దీంతో వారి శిక్షను 723 సంవత్సరాలకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటు 58,500 డాలర్ల జరిమానా విధించింది. అయితే, థాయిలాండ్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు విడుదల కావొచ్చు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా) -
వాషింగ్టన్లో ఓ రెస్టారెంట్ ఉచితంగా భోజనం
-
పుణెలో ప్లాస్టిక్ బ్యాన్ ఎఫెక్ట్
-
రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే...
పుణె : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై జరిమానాలు విధిస్తూ కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే జరిమానా తప్పించుకునేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యయ్యేందుకు పుణేకు చెందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న యత్నం చేస్తోంది. తమ రెస్టారెంట్ నుంచి పార్శిల్ తీసుకువెళ్లే కస్టమర్లకు కవర్లకు బదులుగా స్టీల్ డబ్బాల్లో భోజనాన్ని అందిస్తోంది. ఇందుకుగానూ రూ. 200 కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు. బాక్స్‌లను రిటర్న్ చేయగానే ఆ డిపాజిట్ ఎమౌంట్‌ను తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం మరికొన్ని రెస్టారెంట్లు ఇదే ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమైపోయాయి. మంచి నిర్ణయమే కానీ, ప్లాస్టిక్ బ్యాన్పై మహా సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా వ్యాపారస్థులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ‘పర్యావరణ హితం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. అయితే ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు కావాలంటే అందుకు తగిన ప్రత్యామ్నాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందన్నారు. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయని.. దీని వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటోందని’ రెస్టారెంట్ ఓనర్ గణేశ్ శెట్టి చెబుతున్నారు. -
ట్రంప్ గెలవాలని బలంగా కోరుకున్నాను
చెన్నై: అతడు మాములు రెస్టారెంటు యజమాని. కానీ, రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్న తీక్షణగా గమనిస్తుంటాడు. అలాగే, అమెరికా ఎన్నికలు కూడా ఫాలో అయ్యాడు. అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాడు. కానీ, గతంలోకంటే రెట్టింపు ఉత్సాహంతో. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్. సంచలన వ్యాఖ్యలతో అందరినీ ఆకర్షించినట్లుగానే చెన్నైకి చెందిన ముకుందు అనే హోటల్ యజమానిని ఆకర్షించాడు. ఎంతలా అంటే.. ట్రంప్ విజయంతో ప్రపంచమంతా ఖంగుతినగా ఆ ముకుందు మాత్రం పండగ చేసుకున్నాడు. తన జోస్యం నిజమైనందుకు సంబరాలు చేసుకున్నాడు. ఆ రోజు తన వద్దకు వచ్చినవారందరికీ వైట్ దోశ(ట్రంప్) మరింత రుచిగా వేసి ఇచ్చి ఔరా అనిపించాడు. వార్తల్లో నిలిచాడు. 'నేను అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి అమెరికా ఎన్నికలు ఫాలో అవుతున్నాను. నేనెప్పుడూ ట్రంప్‌కు మద్దతిచ్చేవాడిని. అతడు మాట్లాడే విధానం, ధోరణి చాలా బాగుంటుంది. ఆయన అధ్యక్షుడు కావాలని బలంగా కోరుకున్నాను. మీడియా మొత్తం ట్రంప్ ఓడిపోతాడని చెబితే నేను మాత్రం గెలుస్తాడని చెప్పాను. నిజంగా గెలిచాడు. అందుకే దీనిని ఒక ఉత్సవంగా జరుపుకోవాలనుకున్నాను. బాగా ఆలోచించి ట్రంప్ దోశ వేయాలనుకున్నాను. నా కుమారులతో చర్చించి 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత రుచికరమైన తెల్లదోశను వేయగలిగాం' అలా ఆరోజంతా అందరికీ ట్రంప్ దోశ వేసి పండుగ చేసుకున్నాను' అనఇ ముకుందు చెప్పాడు. -
రెస్టారెంట్ యజమానిపై ఆగంతకుల విధ్వంసం