results of the election
-
‘తేజస్వీ బర్త్‌డే గిఫ్ట్‌గా సీఎం పీఠం’
పట్నా: బిహార్ రాజకీయాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మరో సారి నితీష్ సర్కార్ అని ఎన్డీఏ కూటమి భావిస్తుండగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని అంచాన వేస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి పీఠం బర్త్‌డే గిఫ్ట్‌గా దక్కనుంది అని తెలిపారు. నవంబర్ 9న తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ ఎంతో ఘనంగా తేజస్వీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్‌ను తిరస్కరించారు. ఉపాధి కల్పన వంటి అంశాల్లో జేడీయూ ప్రభుత్వం ఘోరంగా పరాజయం అయ్యింది. అంతేకాక నితీష్ పాలనలో ఎన్నో స్కాములు జరిగాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఈ సారి మహాఘట్ బంధన్‌కు ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పక్కన పెట్టండి. మాకు బిహారీల పట్ల నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ని మాకు ఇస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. (చదవండి: ఆర్జేడీ కూటమికే జై) కాంగ్రెస్ నాయకుడు కృతి జా అజాద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టిన రోజు కానుకగా ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోబోతున్న తేజస్వీ యాదవ్‌కు అభినందనలు. ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు జా. ఒకవేళ తేజస్వీ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం ఓ రికార్డు సృష్టిస్తుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు సీఎంలు అయ్యారనే ఘనత దక్కుతుంది. తేజస్వీ కుటుంబంలో ఇప్పటికే ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లీ రబ్రీదేవిలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్ప్ మహాఘట్బంధన్ భారీ విజయం సాధించబోతుందని అంచాన వేశాయి. ఇక ఇప్పటికే 38 జిల్లాలోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మరి కొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్తు ఏంటనే విషయం బయటపడనుంది. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు
పాలమూరు: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి 17వ లోక్‌సభకు తమ ప్రతినిధిగా ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని ప్రజలు ఓటు రూపంలో తీర్పునివ్వగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇది చేసి 40 రోజులు దాగా అందులో దాగి ఉన్న ఓటర్ల మనోగతం తేలేందుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 23న గురువారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించగా అదేరోజు రాత్రి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఈవీఎంలను సీల్ చేసి జిల్లా కేంద్రంలోని జేపీఎన్‌ఈఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. అదే కళాశాలలో ఓట్లు లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవీఎంలను తెరిచి రౌండ్ల వారీగా ఓట్లు లెక్కిస్తారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మొదటి రౌండ్లు అన్నింటినీ కలిపి పార్లమెంట్ స్థానంలో మొదటి రౌండ్‌గా గుర్తించి ఫలితాలు వెల్లడిస్తారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను, పార్లమెంట్ స్థానంలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను పార్లమెంట్ స్థానంలో రౌండ్ల వారీగా మొదట ఎన్నికల సంఘానికి చెందిన సువిద వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాతే మీడియాకు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్లు లెక్కించే కేంద్రంలో నిరంతరం వీడియో చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకోసం సీసీ కెమెరాలు బిగింపు పూర్తయింది. సీసీ కెమెరాల ద్వారా మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌తోపాటు హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాల్లో లైవ్‌గా వీక్షించే ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. 23న ఉద యం 8గంంటలకు ఓట్లు లెక్కింపు ప్ర క్రియ ప్రారంభమైనా మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో తుది ఫలితం రాత్రి 7గంటల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీవీప్యాట్ చిట్టీల లెక్కింపు తొలిసారిగా వీవీప్యాట్లలోని చిట్టీలు (ఓటర్ స్లిప్) లెక్కించనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని 5పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లు తెప్పించి, వాటిలోని ఓటర్ స్లిప్‌లు బయటకు తీసి లెక్కిస్తారు. ఓటరు చిట్టీలు అభ్యర్థుల గుర్తులు వారీగా వేరు చేసి 25 చిట్టీలు ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. వీవీప్యాట్లలో లెక్కించిన చిట్టీలు, అంతకుముందు ఈవీఎంలలో లెక్కించిన ఓట్లు సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చిట్టీలు మళ్లీ లెక్కిస్తారు. వీవీప్యాట్లలోని చిట్టీలను లెక్కించేందుకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో లాటరీ పద్ధతిన 5 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేస్తారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 14 టేబుళ్లు వేస్తారు. 14టేబుళ్లపై ఒకసారి లెక్కించిన ఓట్లు ఒక రౌండ్‌గా భావిస్తారు. ఇలా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓటర్ల ఆధారంగా రౌండ్లు నిర్ణయిస్తారు. ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ రౌండ్లు ఉంటాయి. తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువ రౌండ్లు ఉంటాయి. కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన మహబూబ్‌నగర్ న్యూటౌన్: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ భగీరథకాలనీ జేపీఎన్‌ఈఎస్ కళాశాల వద్ద కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, టేబు ళ్లు, బారీకేడ్లు, కళాశాల వద్ద భద్రత వంటి విషయాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత ఏఆర్వోలకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ జేసీ స్వర్ణలత, కలెక్టరేట్ ఏఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీవీప్యాట్లలో స్లిప్పుల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన సమావేశంలో కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వీవీప్యాట్లలో స్లిప్పులను లెక్కించాల్సి ఉందని, వీవీప్యాట్ల లెక్కిం పు అనంతరం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇన్చార్జి జేసి స్వర్ణలత, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సి.హెచ్.శ్రీనివాస్, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు చూడండి
గుత్తికొండ (పిడుగురాళ్ల రూరల్): తన పెళ్లి చిరకాలం గుర్తుండిపోవాలని భావించిన ఓ యువకుడు ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆరోజు తమ అభిమాన నాయకుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందబోయే రోజు అని, ఆరోజు అయితే ఈ జన్మలో మరచిపోలేని తీపి జ్ఞాపకంగా ఉండిపోతుందని భావించి అదేరోజు వివాహం ఖరారు చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు, రావమ్మల కుమారుడు రామకోటయ్యకు మాదల గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు, తులసి దంపతుల కుమార్తె వెనీలాతో 23న వివాహం నిశ్చయించారు. అదేరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో వివాహ వేడుకలో టీవీలు ఏర్పాటుచేసి ఫలితాలు అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అదే విషయాన్ని బంధువులకు పెళ్లి కార్డులు ఇస్తూ కుటుంబసభ్యులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు కూడా అక్కడే టీవీల్లో చూసేలా ఏర్పాటు చేస్తున్నాం.. అంటూ చెబుతున్నారు. దీంతో పెళ్లికి వెళ్లినట్లు ఉంటుంది. ఫలితాలు చూసినట్లు ఉంటుందని భావించిన బంధువులు తప్పకుండా పెళ్లికి వస్తామని చెబుతున్నట్లు పెళ్లికొడుకు తండ్రి చిన సుబ్బారావు చెబుతున్నారు. -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్‌కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
గుజరాత్.. నీదా? నాదా?
అహ్మదాబాద్/సిమ్లా: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. సొంత రాష్ట్రం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ సామర్థ్యానికి గుజరాత్ ఫలితాలు పరీక్షగా నిలవనున్నాయి. గుజరాత్లో వరుసగా ఆరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ.. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. కాగా ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం గుజరాత్‌తో పాటు, హిమాచల్ ప్రదేశ్‌లోను బీజేపీదే విజయమని తేల్చి చేప్పేశాయి. హిమాచల్ ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదలయ్యే ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 37 చోట్ల కౌంటింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 నియోజకవర్గాలకు గాను డిసెంబర్ 9న 89 స్థానాల్లో, డిసెంబర్ 14న 93 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. రెండు విడతల్లో 68.41 శాతం పోలింగ్ నమోదైంది. 2012తో పోల్చితే ఈ సారి 2.91 శాతం ఓటింగ్ తగ్గింది. వేడి పుట్టించిన ఎన్నికల ప్రచారం ఈ ఫలితాలు 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు దీటుగా తలపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఒక దశలో వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి చేరాయి. బీజేపీ ప్రచారానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ ప్రచారానికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. రామ మందిరం అంశంతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీపై ‘నీచ్ ఆద్మీ’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదని, రాష్ట్ర ప్రజల ప్రధాన సమస్యల్ని పక్కనపెట్టారని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీని రాహుల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో పటీదార్, ఓబీసీ, దళిత నేతలైన హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీని చిత్తుగా ఓడించాలని.. కాంగ్రెస్‌కు ఓటేయాలని పటీదార్ వర్గానికి హార్దిక్ పిలుపునిచ్చారు. హిమాచల్‌లోనూ.. గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నేడు జరగనుంది. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్‌తో సహా 337 మంది అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి. మొత్తం 68 నియోజకవర్గాలకు గాను 42 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో నవంబర్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 75.28 శాతం ఓటింగ్ నమోదు కాగా.. బీజేపీదే విజయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. 150 మంది ఇంజనీర్లతో ఈవీఎంల హ్యాకింగ్: హార్దిక్ గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగే అవకాశముందని హార్దిక్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడు చేసిన సంక్లిష్ట మానవ శరీరంలోనే మార్పులు చేయగలిగినప్పుడు.. మానవులు తయారుచేసిన ఈవీఎంల్ని ట్యాంపరింగ్ చేయలేమా?’ అని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పటీదార్ ప్రాబల్య ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఈవీఎంల హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అహ్మదాబాద్‌కు చెందిన ఒక కంపెనీ నుంచి 150 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. 5000 ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు యత్నిస్తున్నారని శనివారం హార్దిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని కమ్రేజ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు మేరకు సూరత్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వైఫై సేవల్ని రద్దు చేశారు. -
‘దేశం’ హుషారు
సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ఫలితాలు గ్రేటర్‌లోని ‘దేశం’ శ్రేణులకు కొత్త హుషారునిచ్చాయి. పార్టీ నేతలు, క్యాడర్ సైతం ఊహించని విధంగా నగరంలో మూడు స్థానాల్లో.. శివార్లలో ఆరు స్థానాల్లో వెరసి గ్రేటర్‌లోని 9 స్థానాల్లో ఓటర్లు టీడీపీని గెలిపించారు. టికెట్ల కేటాయింపుల వరకు తీవ్ర అసమ్మతులు, అసంతృప్తులతో తల్లడిల్లిన టీడీపీకి బీజేపీతో పొత్తు కలిసి వచ్చింది. ‘మోడీ’ ఫ్యాక్టర్ తారకమంత్రంలా పనిచేసింది. అభ్యర్థులను పార్టీ నేతలు పట్టించుకోకున్నా.. వారి నుంచి ఆశించిన స్థాయిలో సహాయ, సహకారాలు లేకున్నా ప్రజలు మద్దతు పలికారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న క్షేత్రస్థాయిలోని క్యాడర్ పార్టీ కోసం పనిచేసింది. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలనే తలంపుతో టీడీపీ-బీజేపీ కూటమికి జై కొట్టారు. గ్రేటర్లో పార్టీని పెద్దనాయకులు పట్టించుకోకున్నా ప్రజలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం గమనార్హం. జీహెచ్ఎంసీలో టీడీపీ ఇంతటి ప్రాధాన్యాన్ని సాధించడం ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లా నుంచి ఒక్క స్థానాన్ని కూడా సాధించలేని టీడీపీ ఈసారి ఏకంగా మూడుసీట్లు గెలుచుకుంది. అలాగే గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో రాజేంద్రనగర్ సీటు మాత్రమే గెలిచిన టీడీపీ.. ఈసారి దాంతోపాటు మరో ఐదు స్థానాల్లో గెలిచింది. వెరసి గ్రేటర్లో మొత్తం 9 స్థానాల్లో టీడీపీ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇక సైకిల్ స్పీడుకు తిరుగే లేదని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. -
ఫలితం అక్కడ... ప్రకంపనలిక్కడ!
= నేడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలు = కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ = ‘లోక్‌సభ’పై కేపీసీసీలో మరింత ఉత్కంఠ = అసమ్మతిని బుజ్జగించేందుకు యత్నాలు = వచ్చే నెల కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ = కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకూ అనుమతి = యడ్డిని పార్టీలోకి రప్పించుకునేలా బీజేపీ యత్నాలు = జేడీఎన్ నేతలూ గోవాలో సమాలోచనలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఆ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా పడనుంది. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే కర్ణాటక విషయంలో మున్ముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ఖాయం. మంత్రి వర్గ విస్తరణ రాష్ర్ట మంత్రి వర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్న వారి సంఖ్య పదికి పైగానే ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు విస్తరిస్తే, అసమ్మతి తలెత్తే ప్రమాదం ఉందని అధిష్టానం ఇన్నాళ్లూ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే జాప్యం వల్ల అసమ్మతికి మరింతగా ఆజ్యం పోసినట్లవుతుందని నిర్ధారణకు వచ్చింది. కనుక ఈ నెలలోనే విస్తరణ చేపట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌లతో చర్చలు జరిపారు. విస్తరణతో పాటు కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకు కూడా అధిష్టానం సమ్మతించినట్లు సమాచారం. ఈ నెల 15న దిగ్విజయ్ సింగ్ నగరానికి రానున్నారు. ఆ సందర్భంగా మంత్రి వర్గంలో ఎవరెవరిని తీసుకోవాలో నిర్ణయించే అవకాశం ఉంది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మాజీ మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లతో పాటు నగరంలోని శాంతి నగర ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారిస్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాస్త స్వేచ్ఛ లభించే అవకాశాలున్నాయి. బీజేపీలో... నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ గట్టి విశ్వాసంతో ఉంది. ఇదే ఊపులో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి దృష్టి సారించనుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా బీజేపీకి ఉనికి లేదు. కనుక సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను ఈ రాష్ర్టం నుంచే గెలుపొందడానికి వ్యూహ రచన చేస్తుంది. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం కనబడుతోంది. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానిస్తే మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. ఆయనను తీసుకోవడానికి పార్టీలో సర్వామోదం లభించినా, యడ్యూరప్పే కాస్త బెట్టు చేస్తున్నారు. తన అనుయాయులకు కూడా పదవులు ఇవ్వాలని ఆయన షరతులు విధిస్తున్నారు. జేడీఎస్.. అంతా అనుకున్నట్లు జరిగి, యడ్యూరప్ప మళ్లీ బీజేపీ పంచన చేరితే జేడీఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోనుంది. ఇటీవల బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటినీ కాంగ్రెస్‌కు సమర్పించుకుంది. మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ మాటేమో కానీ జేడీఎస్ కొట్టుకు పోయేట్లుంది. అతి కష్టం మీద మాజీ ప్రధాని దేవెగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న హాసన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల వ్యూహంపై ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి, ఆయన సహచరులు గోవాలో మంతనాలు సాగించారు. బెల్గాంలో శుక్రవారం శాసన సభ సమావేశాలు ముగియగానే అటు నుంచి అటే గోవాకు వెళ్లారు.