retail markets
-
రూ. 25కు కిలో ఉల్లి
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసి వినియోగదారులకు ఊరట కలి్పంచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా కిలో ఏకంగా 47 రూపాయలకు చేరాయి. దాంతో గోదాముల్లోని అదనపు నిల్వలను కిలో రూ.25కే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అదనపు నిల్వలను 25 రూపాయల సబ్సిడీ ధరకే టోకు, రిటైల్ మార్కెట్లలోకి విడుదల చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఇలా ఆగస్టు నుంచి ఇప్పటిదాకా 22 రాష్ట్రాల్లో ఏకంగా 1.7 లక్షల టన్నుల ఉల్లిని విడుదల చేసినట్టు వివరించారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో దుకాణాలు, వాహనాల ద్వారా సబ్సిడీ ధరకు ఉల్లిని అందుబాటులో ఉంచుతున్నారు. -
ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల పంట పండుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గతంలో క్వింటాల్ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి. రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది. సబ్సిడీతో ఊరట ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు షాక్ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లి రూ.25కే పంపిణీ చేస్తుండటం ఊరటనిస్తోంది. వినియోగదారుల కోసం ప్రభుత్వం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు ఉల్లి కొనుగోలు చేస్తోంది. కిలో ఉల్లిపై ప్రభుత్వం రూ.50కి పైగా సబ్సిడీ రూపంలో భరిస్తోంది. -
పతనానికి బ్రేక్-205 పాయింట్ల ర్యాలీ
అనుకూల గ్లోబల్ సంకేతాలతో ఏడు రోజులపతనానికి బ్రేక్‌పడింది. అమెరికా మార్కెట్ మరో కొత్త గరిష్టస్థాయికి చేరడం, ఆసియా సూచీలు ర్యాలీ జరపడంతో గురువారం గ్యాప్‌అప్‌తో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 350 పాయింట్ల మేర పెరిగి 20,568 పాయింట్ల స్థాయికి చేరింది. అక్టోబర్ నెలలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఎనిమిదినెలల గరిష్టస్థాయికి పెరిగిందన్న వార్తల తో సెన్సెక్స్ గరిష్టలాభాల్లోంచి కొంతభాగాన్ని కోల్పోయి, చివరకు 205 పాయింట్ల పెరుగుదలతో 20,399 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ 6,101 పాయింట్ల స్థాయికి చేరిన తర్వాత చివరకు 6,056 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే 67 పాయింట్లు లాభపడింది. ఇటీవల అదేపనిగా పడుతూ వచ్చిన బ్యాంకింగ్ షేర్లు గురువారంనాటి ర్యాలీకి అగ్రభాగాన నిలిచాయి.రూపాయి విలువ 63.11 స్థాయికి కోలుకోవడంతో ఐటీ షేర్లు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్‌లు, ఫార్మా షేర్లు సిప్లా, సన్‌ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్‌లు స్వల్పంగా తగ్గాయి. ప్రైవేటు బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ కవరింగ్.... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వారి ఫోర్ట్ఫోలియోలను హెడ్జ్ చేసుకునేందుకు క్యారీ చేస్తున్న షార్ట్ పొజిషన్లలో కొన్నింటిని కవర్ చేసుకోవడంతో గురువారం ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్లలో ఫ్యూచర్ కాంట్రాక్టుల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి వరుసగా 4.10 లక్షలు, 9.58 లక్షలు, 7 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్ కాంట్రాక్టుకు సంబంధించి రూ. 1,040 నుంచి రూ. 1,100 స్ట్రయిక్స్ వరకూ కాల్ కవరింగ్ జరగడంతో కాల్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రస్ట్ తగ్గింది. ఈ బ్యాంకింగ్ షేర్లతో పాటు టాటా మోటార్స్, టాటా స్టీల్ కౌంటర్లలో కూడా భారీ షార్ట్ కవరింగ్ జరగడంతో ఈ కాంట్రాక్టుల్లో ఓఐ 12.59 లక్షలు (6.61 శాతం), 17.87 లక్షల (9.2 శాతం) షేర్ల చొప్పున ఓఐ కట్ అయ్యింది. ఈ రెండు టాటా గ్రూప్ కౌంటర్లలో రూ.370 నుంచి రూ. 400 స్ట్రయిక్స్ వరకూ కాల్ కవరింగ్, భారీ పుట్ రైటింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేర్లు మరింత పెరగవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు వున్నారని ఈ డెరివేటివ్ డేటా సూచిస్తున్నది. -
ఉల్లి ధరలకు పగ్గాలేయండి
న్యూఢిల్లీ: ఉల్లి ధరల కృత్రిమ పెంపును అరికట్టాలని, ఉల్లికి తాత్కాలికంగా నెలకొన్న కొరతను ఆసరాగా తీసుకుని మార్కెట్లలో దీని ధరలను కృత్రిమంగా పెం చేందుకు ప్రయత్నించే అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని పలుచోట్ల హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో గత జూలై నుంచి ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలో ఉల్లి రిటైల్ ధర కిలో రూ.80కి చేరుకుంది. ఉల్లికి తాత్కాలికంగా ఏర్పడిన కొరతను ఆసరాగా తీసుకుని, మార్కెట్లలో కృత్రిమంగా ధరలు పెంచేందుకు యత్నించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారి ఒకరు బుధవారం మీడియాకు చెప్పారు. ఉల్లిని ఎక్కువగా నిల్వచేసే మహారాష్ట్రను, సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిపారు. గత ఏడాది ఉల్లి నిల్వల్లో 90 శాతానికి పైగా ఖాళీ అయిపోయాయని, ప్రస్తుతం 3-4 లక్షల టన్నులు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని, అందువల్లే ధరలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వినియోగం కోసం 27.5 లక్షల టన్నుల ఉల్లిపాయలను సిద్ధం చేయగా, వాటిలో 15.5 లక్షల టన్నులను మహారాష్ట్ర గోదాముల్లోనే నిల్వచేసినట్లు తెలిపారు.. గుజరాత్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులలోని గోదాముల్లో 1-2 లక్షల టన్నుల చొప్పున నిల్వ చేశామని తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున మరి కొంతకాలం ధరలు ఎక్కువగానే ఉండవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో ఖరీఫ్ ప్రారంభంలో సాగుచేసిన ఉల్లి కోతలు సాగుతున్నాయని, రానున్న కొద్దిరోజుల్లో ఈ పంట మార్కెట్‌కు రావచ్చని తెలిపారు. దేశంలోని ఉల్లి ధరలపై ప్రభావం చూపే నాసిక్‌లోని లాసల్గావ్ మండీలో ధరలు విపరీతంగా పెరిగినందునే హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు.