
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసి వినియోగదారులకు ఊరట కలి్పంచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా కిలో ఏకంగా 47 రూపాయలకు చేరాయి. దాంతో గోదాముల్లోని అదనపు నిల్వలను కిలో రూ.25కే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అదనపు నిల్వలను 25 రూపాయల సబ్సిడీ ధరకే టోకు, రిటైల్ మార్కెట్లలోకి విడుదల చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఇలా ఆగస్టు నుంచి ఇప్పటిదాకా 22 రాష్ట్రాల్లో ఏకంగా 1.7 లక్షల టన్నుల ఉల్లిని విడుదల చేసినట్టు వివరించారు. ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో దుకాణాలు, వాహనాల ద్వారా సబ్సిడీ ధరకు ఉల్లిని అందుబాటులో ఉంచుతున్నారు.