retaired IAS
-
బాబుకు రిటైర్డ్ ఐఏఎస్‌ల లేఖ
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై రిటైర్డ్ ఐఏఎస్‌లు లేఖ సంధించారు. ఏపీ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లపై చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వాడిన భాష సరికాదంటూ హితవు పలికారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం నిబద్ధత గల అధికారి అని కొనియాడారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని హైకోర్టు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు వెంటనే ఐఏఎస్‌లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్‌లు శ్రీపాద భలే రావు, కేవీరావు, టీఎస్ అప్పారావు, ఏకే పరీదా, ఎస్కే సిన్హా, సుతీంద్ర భట్టాచార్య, విద్యాసాగర్, ఎంజీ గోపాల్, సీవీఎస్కే శర్మ తదితరులు లేఖలో బాబు తీరును తప్పుబట్టారు. మా జోలికి వస్తే ఊరుకోం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఉద్యోగ సంఘాల సమాఖ్య కన్వీనర్ వెంకట్రామి రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబు వెంటనే చీఫ్ సెక్రటరీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు, ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. -
మాజీ ఐఏఎస్ 225 కోట్ల ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్రామ్, ఆయన సన్నిహితులకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ అటాచ్ చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబై, నోయిడా, కోల్‌కతాలోని స్థిరాస్తులు ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బూటకపు కంపెనీల్లో నేత్రామ్, ఆయన సన్నిహితులు కొందరు రూ.98.82 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ విభాగానికి సమాచారం అందడంతో గతంలో ఢిల్లీ, లక్నో, ముంబై, కోల్‌కతా, బరేలిలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేసింది. 1979 బ్యాచ్‌కు చెందిన నేత్రామ్ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు ఉన్నత స్థానాల్లో పనిచేశారు. -
ఆస్తులు దక్కనివ్వడం లేదని.. సొంత అన్నకూతురు
బంజారాహిల్స్:కిరాయి హంతకులతో సొంత బాబాయ్‌ను అంతమొందించేందుకు యత్నించిన ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు మరో నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్. శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్రావు వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని ప్రశాసన్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తన అన్న ప్రేమాచారి కూతురు మంజులతో కలిసి కొన్నిచోట్ల స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా గుంటూరులో రూ.15 కోట్ల వ్యయంతో ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. 2009లో గుంటూరులో రూ. 30 కోట్ల విలువ చేసే ఓ ప్లాట్‌ను ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఘట్కేసర్లో ఇద్దరూ కలిసి 25 ఎకరాల స్థలం కొనుగోలు చేయగా ఆ స్థలాన్ని దయాచారి తన అత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆమె చనిపోయిన తర్వాత మంజులకు తెలియకుండా తన పేరున బదలాయించుకున్నాడు. సింగపూర్‌లో వ్యాపార నిమిత్తం మంజుల తల్లి నుంచి రూ. 60 లక్షల వరకు తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా భాగస్వామ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా చేశాడు. దీనిపై మంజుల ఎన్నిసార్లు అడిగినా ససేమీరా అన్నాడు. వారం క్రితం మంజుల తన కుమారుడు, అన్న కొడుకుతో కలిసి దయాచారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడగా, ఇంట్లోకి కూడా రానివ్వలేదు. దీంతో విసుగు చెందిన మంజుల బాబాయ్ అడ్డు తొలగించుకుంటేనే భాగస్వామ్యంలో ఉన్న ఆస్తులు తనకు దక్కుతాయని పథకం వేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాపార భాగస్వామి వెంకటేశ్వరరావుకు విషయం చెప్పడంతో ఆయన విజయవాడకు చెందిన నరేష్‌కు ఈ బాధ్యత అప్పగించాడు. నరేష్ తనకు తెలిసిన నలుగురు కిరాయి హంతకులు ఉన్నారని వారు బెదిరిస్తారని చెప్పడంతో రూ.15 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ నెల 3న కిరాయి హంతకులు అశోక్, సాగర్, అయ్యప్ప, రాజేష్, కొండాపూర్‌లో బసచేసి ఈ నెల 4న ఉదయం వాకింగ్ చేస్తున్న దయాచారిని తమతో పాటు తెచ్చుకున్న క్రికెట్ వికెట్‌తో తలపై బలంగా మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. జూబ్లీహిల్స్ సీఐ చంద్రశేఖర్, డీఐ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వివరాల ఆధారంగా మంజుల, ఆమె సోదరుడు కరుణాకర్, నరేష్, అశోక్, సాగర్లను అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరరావు, అయ్యప్ప, రాజేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సహానీ
హైదరాబాద్: ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహానీని నియమిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.