హుస్నాబాద్‌లో ఉద్రిక్తత
టవరెక్కిన యువకులు
అఖిలపక్షం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన
హుస్నాబాద్: హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలపకుండా కరీంనగర్‌లోనే కొనసాగించాలని కోరుతూ యువకులు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అడిగినోళ్లందరికీ సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాలను ఇస్తుండగా..హుస్నాబాద్‌లో మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ వచ్చేంత వరకు టవర్ దిగేది లేదని స్పష్టం చేశారు. సీఐ దాసరి భూమయ్య, ఎసై ్స సంజయ్ అక్కడికి చేరుకుని ఇక్కడి ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు టవర్ దిగొచ్చారు. మరో వైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, అఖిలపక్ష నాయకులు మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, వలుస సుభాష్, అక్కు శ్రీనివాస్, వాల నవీన్, వరయోగుల అనంతస్వామి, విద్యాసాగర్ తదితరలున్నారు.